సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం 24 గంటల నిరసన దీక్ష చేపట్టారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆయన మంగళవారం తన నివాసంలో దీక్షకు దిగారు. ఉద్యోగాల్లేక రోడ్డున పడ్డ యువతకు న్యాయం చేయాలని కోరుతూ ‘కొలువుల కొట్లాట సభ’కు అనుమతి కోరితే నిరాకరించడంతో కోదండరాం నిరసన దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలపై మౌనంగా ఉండలేక...విధి లేని పరిస్థితిలో దీక్ష చేపట్టానని ఆయన తెలిపారు. కాగా కోదండరాం నిరసన దీక్షకు జేఏసీ నేతలతో పాటు ప్రొఫెసర్ హరగోపాల్ సంఘీభావం తెలిపారు.