akula
-
చిరువ్యాపారులపై కనికరం చూపండి
కౌన్సిల్లో సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ l కాంట్రాక్టర్లు అధికంగా వసూలు చేస్తున్నారు : ఎమ్మెల్సీ ఆదిరెడ్డి ‘అఖండ గోదావరి’కి బీపీఎస్ నిధులెలా కేటాయిస్తారు..? నిలదీసిన స్వతంత్ర, అధికారపార్టీ కార్పొరేటర్లు సాక్షి, రాజమహేంద్రవరం : ఆశీల విషయంలో చిరు వ్యాపారులను దృష్టిలో పెట్టుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పాలక మండలి, అధికార యంత్రాంగానికి సూచించారు. ఆదివారం జరిగిన రాజమహేంద్రవరం నగరపాలక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. బడుగు జీవుల నుంచి వసూలు చేసే ఆశీలు నగరపాలక సంస్థకు పెద్ద ఆదాయ వనరు కాదని, అది వసూలు చేయకపోవడం వల్ల చిరు వ్యాపారులకు మేలు చేసిన వారమవుతామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి మాట్లాడుతూ కొంత మంది ఆశీల కాంట్రాక్టర్లు బడుగుజీవుల వద్ద నిర్ణయించిన రేట్ల కంటే అధికంగా వసూలు చేస్తున్నారని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. వారిని నిలువరించాలని పాలక మండలి, యంత్రాంగానికి సూచించారు. ఇక్కడే ఏర్పాటు చేయాలి గోదావరి అర్బ¯ŒS డెవలప్మెంట్ అథారిటీ(గుడా)ను నగరంలో ఏర్పాటు చేసుకునేలా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపుదామని చెప్పారు. నగరపాలకసంస్థ పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ఇంటర్లో కార్పొరేటర్ కాలేజీలలో చేర్చడం సరైన నిర్ణయం కాదన్నారు. అందరికీ ఇళ్లు పథకంలో 4200 ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసినా అవి కార్యరూపం దాల్చకపోవడం దారుణమన్నారు. తొలగించిన పారిశుద్ధ్య కార్మికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిధులు అఖండ గోదావరి ప్రాజెక్టుకు సరికాదు నగరంలోని అనధికారిక కట్టడాల క్రమబద్ధీకరణ పథకం(బీపీఎస్)ద్వారా వచ్చిన నిధులలో రూ.20కోట్లు అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేటాయించడం సరికాదని స్వతంత్ర కార్పొరేటర్ గొర్రెల సురేష్, టీడీపీ కార్పొరేటర్లు మర్రి దుర్గా శ్రీనివాస్, కోసూరి చండీ ప్రియ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఆ నిధులతో నగరంలోని పార్కుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ గొప్పగా చేసింది అని చెప్పుకోవడానికి ఈ ప్రాజెక్టు చేపట్టడం అవసరమన్నారు. మోరంపూడి–స్టేడియం రోడ్డుపై మున్సిపల్ ప్రిన్సిపల్ కమిషనర్‌కు మూడు తీర్మానాలు పంపారని, దానిపై గందరగోళం నెలకొందన్నారు. ఆ రోడ్డును 80 అడుగులకు కుదించాలని కోరడంతో మేయర్ రజనీశేషసాయి సమ్మతించారు. ఆ మేరకు చర్యలు చేపట్టాలి్సందిగా కమిషనర్ విజయరామరాజుకు సూచించారు. తొలగించిన 31 మంది కార్మికులు 180 రోజులకుగాను 100 రోజులు విధులకు హాజరవ్వలేదని కమిషనర్ చెప్పారు. మరో పది మంది కూడా ఉన్నారన్నారు. వారిపై నిర్ణయం తీసుకునే అధికారం కౌన్సిల్ కమిషనర్‌కు ఇచ్చింది. అనంతరం అజెండాలోని 11 అంశాలను ఏకగ్రీంగా ఆమోదిస్తూ మండలి నిర్ణయం తీసుకుంది. -
కాపుల సహనాన్ని పరీక్షిస్తే ఫలితాలు తీవ్రం
రాష్ట్ర కాపు జేఏసీ నేత ఆకుల రామకృష్ణ కొత్తపేట : కాపుల సహనాన్ని పరీక్షిస్తే ఫలితాలు తీవ్రంగా ఉంటాయని కాపు జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.గురువారం సాయంత్రం రామకృష్ణ కొత్తపేటలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో కాపులను బీసీలలో చేరుస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయమని కోరితే కాపులను ఉగ్రదవాదుల్లా పరిగణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా అది శాంతియుత కార్యక్రమమేనని స్పష్టం చేశారు. సత్యాగ్రహ దీక్షకు పిలుపు ఇస్తే హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప జరగనీయమంటున్నారు. ఎలా జరగనీయరో చూస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చంద్రబాబు ద్వారా తమ వ్యక్తిగత ప్రయోజనాలు కోసం రాజప్ప లాంటి కాపు మంత్రులు, కొందరు కాపు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కాపు ఉద్యమాన్ని, ఉద్యమ నాయకులను విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. -
పథకం ప్రకారమే కాపుల అణచివేత చర్యలు
పాదయాత్రకు కోర్టు అనుమతి ఉన్నా అడ్డుకున్నారు సుప్రీం కోర్టు నిషేధించినా కోడిపందేలకు ఓకే చెప్పారు ఇదేనా మీ ద్వంద్వ నీతి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆకుల రామకృష్ణ ధ్వజం కొత్తపేట : కాపుల వల్లే తాము అధికారంలోకి వచ్చామని రాష్ట్ర ప్రభుత్వ నేతలు ఒక పక్క చెబుతూనే, మరోపక్క పథకం ప్రకారం కాపుల అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని కాపు జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ ధ్వజమెత్తారు. కొత్తపేట మండలం వాడపాలెంలో కాపు నాయకులు పెదపూడి శ్రీనివాస్, బాపిరాజు సోదరుల స్వగృహంలో రామకృష్ణ గురువారం విలేకరులతో మాట్లాడారు. జీఓ నంబరు 30 ద్వారా కాపు విద్యార్థులకు గతంలో ప్రభుత్వం ఉపకార వేతనాలు అమలు చేయడానికి ముద్రగడ పద్మనాభం సాగించిన ఉద్యమమే కారణమన్నారు. తర్వాత పదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఆ ప్రయోజనాలను తుంగలో తొక్కిందన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు కాపులకు బీసీ హామీ ఇచ్చి గాలికొదిలేసినందునే ముద్రగడ మరలా ఉద్యమం చేపట్టవలసి వచ్చిందన్నారు. తమ డిమాండ్ సాధనకు కాపులు శాంతియుత పాదయాత్ర చేపడితే పోలీసు యంత్రాంగంతో కాపు నాయకులను హౌస్ అరెస్టులు చేయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోందని విమర్శించారు. పాదయాత్రకు హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇస్తే ప్రభుత్వం అడ్డుకుందని, కోడి పందేలు నిర్వహించరాదని సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే అనుమతులు ఇచ్చిందని రామకృష్ణ గుర్తుచేశారు. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాస్వామ్యమో? నియంతృత్వమో?అర్థం కావడం లేదన్నారు. సంక్రాంతి ముసుగులో అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల సాక్షిగా కోడి పందేలు నిర్వహిస్తే లేని అభ్యంతరాలు, నిషేదాజ్ఞలు గాంధేయ మార్గంలో శాంతియుతంగా చేపడుతున్న పాదయాత్రకు ఎందుకని ఆకుల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించింది వారా? మేమా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజాహక్కులను హరించే అధికారం ఎవరికీ లేదన్నారు. పాదయాత్రను అడ్డుకోవడం తగదన్నారు.కమిషన్ నియమించి, కాపులను బీసీల జాబితాలో చేర్చకుండా ఎన్నాళ్లు కాలయాపన చేస్తారని ప్రశ్నించారు. తుని ఘటనతో కాపులకు సంబంధం లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబే అదే అంశాన్ని బూచిగా చూపి కాపుల పాదయాత్రను అడ్డుకోవడం ఆయన ద్వంద్వ వైఖరిని బయట పెడుతోందన్నారు. తమకు సహకరించే పార్టీలు, నాయకులతో కలిసి పోరాటాన్ని కొనసాగిస్తామని ,దానికి జగన్ ముద్ర వేయడం తగదని రామకృష్ణ అన్నారు. ఏదేమైనా బీసీ రిజర్వేషన్ల సాధనకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి బండారు సత్తిరాజు, బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం, కాపు నాయకులు సాధనాల సత్యనారాయణ,మట్టా బాబ్జి తదితరులు పాల్గొన్నారు. -
అడ్డొస్తే కేసు నమోదు చేస్తా
రోటరీ హాల్ స్వాధీనంలో ఉద్రిక్తత ఎమ్మెల్యే ఆకులపై సబ్‌కలెక్టర్ విజయకృష్ణన్ ఆగ్రహం ఆనం భవనం ముందు ఎమ్మెల్యే బైఠాయింపు ఎమ్మెల్యే ఫిర్యాదుపై మంగళవారం చర్చిద్దామన్న హోం మంత్రి తాత్కాలికంగా సమసిన వివాదం తాడితోట (రాజమహేంద్రవరం) : సుమారు 50 ఏళ్లకు పైగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉన్న ఆనం రోటరీ హాల్‌ను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకునే విషయంలో వివాదం చోటు చేసుకుంది. స్థానిక వై జంక్ష¯ŒSలో ఉన్న ఆనం రోటరీ హాల్ స్థలాన్ని 1957లో అప్పటి మున్సిపల్ సభ్యుడు ఆనం ప్రేమ్ కుమార్ రోటరీ క్లబ్‌కు కేటాయించించేలా అధికారులను ఒప్పించి రోటరీక్లబ్ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి దీని పన్నులన్నీ రోటరీ క్లబ్ ద్వారానే చెల్లిస్తున్నారు. అయితే దీని డాక్యుమెంట్లు క్లబ్ సభ్యుల వద్ద లేవు. మూడు నెలల క్రితం రెవెన్యూ అధికారులు ఈ భవనం డాక్యుమెంట్లు సమర్పించాలని క్లబ్ అధ్యక్షుడు పట్టపగలు వెంకట్రావు, ఇతర సభ్యులకు S నోటీసులు జారీ చేశారు. దీనికి ప్రతిగా సభ్యులు విద్యుత్ బిల్లులు, మున్సిపల్ పన్ను బిల్లులు సమర్పించారు. దీంతో అధికారులు మళ్లీ వారం రోజుల క్రితం అధికారులు భవనం క్లబ్దేననే ఆధరాలు కావాలని నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ వారు ఎటువంటి పత్రాలూ సమర్పించకపోవడంతో అధికారులు ఎన్‌క్రోచ్‌మెంట్ నిబంధనల మేరకు భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు శనివారం ఉదయం రోటరీ హాల్‌కు వచ్చారు. ఇంతలో తన నియోజక వర్గంలో తనకు తెలియకుండా రోటరీ క్లబ్ ఆధీనంలో ఉన్న భవనాన్ని ఎలా స్వాధీనం చేసుకుంటారంటూ ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ విజయ కృష్ణ¯ŒSను ఫో¯ŒSలో నిలదీశారు. అలాగే అర్బన్ తహసీల్దార్ పోసియ్య, ఇతర రెవెన్యూ అధికారులపై కూడా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసి, మీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని సబ్ కలెక్టర్ విజయకృష్ణ¯ŒSపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురి మధ్యా వాగ్వాదం ముదిరి ఒక దశలో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాల్సి వస్తుందని సబ్‌కలెక్టర్ హెచ్చరించారు. దీనితో ఎమ్మెల్యే ఆగ్రహించి అక్కడే బైఠాయించారు. దీనిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని సబ్ కలెక్టర్ హెచ్చరించగా ఎమ్మెల్యే రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్పకు సమస్యను వివరించారు. ఈ సమస్యలను వచ్చే మంగళవారం ఇరు వర్గాలు కూర్చొని చర్చించవచ్చునని ఆయన చెప్పడంతో ఎమ్మెల్యే శాంతించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. వైఎస్సార్సీపీ సంఘీభావం ఆనం రోటరీ హాల్‌ను ఏ విధమైన ముందు హెచ్చరికలు లేకుండా స్వాధీనం చేసుకోవడంపై వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, రూరల్ కో–ఆర్డినేజర్ ఆకుల వీర్రాజు, వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు మజ్జి అప్పారావు రోటరీ యాజమాన్యానికి సంఘీభావం తెలిపారు. భవనాన్ని దౌర్జన్యంగా ఖాళీ చేయించడం తగదని తహసీల్దార్‌కు సూచించారు. ఘటనా స్థలాన్ని మేయర్ పంతం రజనీ శేషసాయి, బీసీ సంఘాల నాయకులు మార్గాని నాగేశ్వరరావు, కె.కె.సంజీవ రావు, అయ్యల గోపి, మార్గాని రామకృష్ణ గౌడ్, మరుకుర్తి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.