అడ్డొస్తే కేసు నమోదు చేస్తా
అడ్డొస్తే కేసు నమోదు చేస్తా
Published Sat, Nov 26 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM
రోటరీ హాల్ స్వాధీనంలో ఉద్రిక్తత
ఎమ్మెల్యే ఆకులపై సబ్‌కలెక్టర్ విజయకృష్ణన్ ఆగ్రహం
ఆనం భవనం ముందు ఎమ్మెల్యే బైఠాయింపు
ఎమ్మెల్యే ఫిర్యాదుపై మంగళవారం చర్చిద్దామన్న హోం మంత్రి
తాత్కాలికంగా సమసిన వివాదం
తాడితోట (రాజమహేంద్రవరం) : సుమారు 50 ఏళ్లకు పైగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉన్న ఆనం రోటరీ హాల్‌ను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకునే విషయంలో వివాదం చోటు చేసుకుంది. స్థానిక వై జంక్ష¯ŒSలో ఉన్న ఆనం రోటరీ హాల్ స్థలాన్ని 1957లో అప్పటి మున్సిపల్ సభ్యుడు ఆనం ప్రేమ్ కుమార్ రోటరీ క్లబ్‌కు కేటాయించించేలా అధికారులను ఒప్పించి రోటరీక్లబ్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి దీని పన్నులన్నీ రోటరీ క్లబ్ ద్వారానే చెల్లిస్తున్నారు. అయితే దీని డాక్యుమెంట్లు క్లబ్ సభ్యుల వద్ద లేవు. మూడు నెలల క్రితం రెవెన్యూ అధికారులు ఈ భవనం డాక్యుమెంట్లు సమర్పించాలని క్లబ్ అధ్యక్షుడు పట్టపగలు వెంకట్రావు, ఇతర సభ్యులకు S నోటీసులు జారీ చేశారు. దీనికి ప్రతిగా సభ్యులు విద్యుత్ బిల్లులు, మున్సిపల్ పన్ను బిల్లులు సమర్పించారు. దీంతో అధికారులు మళ్లీ వారం రోజుల క్రితం అధికారులు భవనం క్లబ్‌దేననే ఆధరాలు కావాలని నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ వారు ఎటువంటి పత్రాలూ సమర్పించకపోవడంతో అధికారులు ఎన్‌క్రోచ్‌మెంట్ నిబంధనల మేరకు భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు శనివారం ఉదయం రోటరీ హాల్‌కు వచ్చారు. ఇంతలో తన నియోజక వర్గంలో తనకు తెలియకుండా రోటరీ క్లబ్ ఆధీనంలో ఉన్న భవనాన్ని ఎలా స్వాధీనం చేసుకుంటారంటూ ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ విజయ కృష్ణ¯ŒSను ఫో¯ŒSలో నిలదీశారు. అలాగే అర్బన్ తహసీల్దార్ పోసియ్య, ఇతర రెవెన్యూ అధికారులపై కూడా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసి, మీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని సబ్ కలెక్టర్ విజయకృష్ణ¯ŒSపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురి మధ్యా వాగ్వాదం ముదిరి ఒక దశలో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాల్సి వస్తుందని సబ్‌కలెక్టర్ హెచ్చరించారు. దీనితో ఎమ్మెల్యే ఆగ్రహించి అక్కడే బైఠాయించారు. దీనిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని సబ్ కలెక్టర్ హెచ్చరించగా ఎమ్మెల్యే రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్పకు సమస్యను వివరించారు. ఈ సమస్యలను వచ్చే మంగళవారం ఇరు వర్గాలు కూర్చొని చర్చించవచ్చునని ఆయన చెప్పడంతో ఎమ్మెల్యే శాంతించి అక్కడ నుంచి వెళ్లిపోయారు.
వైఎస్సార్‌సీపీ సంఘీభావం
ఆనం రోటరీ హాల్‌ను ఏ విధమైన ముందు హెచ్చరికలు లేకుండా స్వాధీనం చేసుకోవడంపై వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, రూరల్ కో–ఆర్డినేజర్ ఆకుల వీర్రాజు, వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు మజ్జి అప్పారావు రోటరీ యాజమాన్యానికి సంఘీభావం తెలిపారు. భవనాన్ని దౌర్జన్యంగా ఖాళీ చేయించడం తగదని తహసీల్దార్‌కు సూచించారు. ఘటనా స్థలాన్ని మేయర్ పంతం రజనీ శేషసాయి, బీసీ సంఘాల నాయకులు మార్గాని నాగేశ్వరరావు, కె.కె.సంజీవ రావు, అయ్యల గోపి, మార్గాని రామకృష్ణ గౌడ్, మరుకుర్తి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.
Advertisement
Advertisement