rotary
-
తెలుగు రాష్ట్రాలలోని వరద భాదిత కుటుంబాలకు 50 లక్షల రూపాయల రోటరీ సహాయం
తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు సాయం అందించేందుకు రోటరీ క్లబ్‌లు ముందుకు వచ్చాయి. తెలంగాణాలో ఖమ్మం జిల్లాలో కొన్ని గ్రామాలు , ఆంధ్రప్రదేశ్ విజయవాడకు దిగువ తీరాన తెనాలి -రేపల్లె ఏరియాలో ఉన్న కొన్ని గ్రామాలలో పూర్తిగా నిరాశ్రయులైన కుటుంబాల సహాయార్ధం రోటరీ క్లబ్‌లు ముందుకు వచ్చాయని రోటరీ గవర్నర్ రోటేరియన్ శరత్ చౌదరి తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఈ వరద ప్రమాదం సంభవించిన వెంటనే గత ఐదు రోజులుగా ఖమ్మం, భద్రాచలం, గుంటూరు, ప్రకాశం, జిల్లాలోని రోటరీ క్లబ్‌లు అన్ని కలిసి 'ఆత్మబంధువు' అనే ప్రాజెక్ట్ పేరున దాదాపు 50 లక్షల రూపాయలు విలువ చేసే వంట సామాను కిట్స్‌ని ఖమ్మం జిల్లాల్లలోని గ్రామాల్లో 2500 మందికి, అలాగే తెనాలి-రేపల్లె ఏరియాలోని గ్రామాల్లో 1500 వరద బాధితులుకు అందజేశామని తెలిపారు. గత మూడు రోజులుగా ఖమ్మం రోటరీ క్లబ వారు మల్లాది వాసుదేవ్ గారి ఆధ్వర్యంలో ప్రతి ప్యాకెట్లో 5 కేజీల రైస్ ప్యాకెట్, బొంబాయి రవ్వ, 1 లీటరు వంట నూనె, 1/2 కేజీ చింతపండు, కందిపప్పు, ఉల్లిపాయలు, ఇతర దినుసులను ఒక కుటుంబానికి సరిపోయేలా అందజేశామని తెలిపారు. అదేవిధంగా పిగురాళ్ల రోటరీ క్లబ్ వారు డాక్టర్ విష్ణు బాబు ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రాంతంలో పంచటానికి సుమారు 2500 కుటుంబాలకు వంట సామాను పాకెట్స్‌ని రెడీ చేస్తున్నట్లు తెలిపారు. ]అలాగే అన్ని చోట్ల రోటరియన్స్ ఎంతో శ్రమపడి వరద బాధిత కుటుంబాలని గుర్తించి నేరుగా వారికి సహాయం అందే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గత ఆదివారం సెప్టంబర్ 8న రేపల్లె ఏరియా గ్రామాలలో వంట సామను కిట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఈ విపత్తుపై స్పందించి ధన సహాయం, వస్తు సహాయం చేస్తున్న రోటరియన్స్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు రోటరీ గవర్నర్ రోటేరియన్ శరత్ చౌదరి.(చదవండి: రండి వరద బాధితులను ఆదుకుందాం!) -
28,29 తేదీల్లో రోటరీ రాష్ట్ర స్థాయి సదస్సు
బాలాజీచెరువు (కాకినాడ) : రోటరీ గోల్డె¯ŒSజూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 28, 29 తేదీల్లో రోటరీ రాష్ట్ర స్థాయి సదస్సు కాకినాడలో నిర్వహిస్తున్నట్టు రోటరీ జిల్లా గవర్నర్ డాక్టర్ ఎస్‌వీఎస్‌రావు శుక్రవారం తెలిపారు. రోటరీ హాల్లో జరిగిన సమావేశంలో వివరాలు వెల్లడిస్తూ ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహ¯ŒS హాజరౌతున్నారని చెప్పారు. సదస్సులో శ్రీకాకుళం నుంచి కృష్ణాజిల్లా వరకూ ఉన్న రోటరీ క్లబ్‌లన్నీ పాల్గొంటాయని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఎస్.రామదొరైని రోటరీ లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్ అవార్డుతో సత్కరిస్తామని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మాజీ ఎంపీ యార్లగడ్డ లక్షీ్మప్రసాద్ హాజరౌతున్నారని తెలిపారు. సమావేశంలో సదస్సు చైర్మ¯ŒS జి.కె.శ్రీనివాస్, «అ««దl్యక్షుడు డాక్టర్ రామకృష్ణ, కార్యదర్శి ఉదయభాను, పేపకాయల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అడ్డొస్తే కేసు నమోదు చేస్తా
రోటరీ హాల్ స్వాధీనంలో ఉద్రిక్తత ఎమ్మెల్యే ఆకులపై సబ్‌కలెక్టర్ విజయకృష్ణన్ ఆగ్రహం ఆనం భవనం ముందు ఎమ్మెల్యే బైఠాయింపు ఎమ్మెల్యే ఫిర్యాదుపై మంగళవారం చర్చిద్దామన్న హోం మంత్రి తాత్కాలికంగా సమసిన వివాదం తాడితోట (రాజమహేంద్రవరం) : సుమారు 50 ఏళ్లకు పైగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉన్న ఆనం రోటరీ హాల్‌ను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకునే విషయంలో వివాదం చోటు చేసుకుంది. స్థానిక వై జంక్ష¯ŒSలో ఉన్న ఆనం రోటరీ హాల్ స్థలాన్ని 1957లో అప్పటి మున్సిపల్ సభ్యుడు ఆనం ప్రేమ్ కుమార్ రోటరీ క్లబ్‌కు కేటాయించించేలా అధికారులను ఒప్పించి రోటరీక్లబ్ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి దీని పన్నులన్నీ రోటరీ క్లబ్ ద్వారానే చెల్లిస్తున్నారు. అయితే దీని డాక్యుమెంట్లు క్లబ్ సభ్యుల వద్ద లేవు. మూడు నెలల క్రితం రెవెన్యూ అధికారులు ఈ భవనం డాక్యుమెంట్లు సమర్పించాలని క్లబ్ అధ్యక్షుడు పట్టపగలు వెంకట్రావు, ఇతర సభ్యులకు S నోటీసులు జారీ చేశారు. దీనికి ప్రతిగా సభ్యులు విద్యుత్ బిల్లులు, మున్సిపల్ పన్ను బిల్లులు సమర్పించారు. దీంతో అధికారులు మళ్లీ వారం రోజుల క్రితం అధికారులు భవనం క్లబ్దేననే ఆధరాలు కావాలని నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ వారు ఎటువంటి పత్రాలూ సమర్పించకపోవడంతో అధికారులు ఎన్‌క్రోచ్‌మెంట్ నిబంధనల మేరకు భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు శనివారం ఉదయం రోటరీ హాల్‌కు వచ్చారు. ఇంతలో తన నియోజక వర్గంలో తనకు తెలియకుండా రోటరీ క్లబ్ ఆధీనంలో ఉన్న భవనాన్ని ఎలా స్వాధీనం చేసుకుంటారంటూ ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ విజయ కృష్ణ¯ŒSను ఫో¯ŒSలో నిలదీశారు. అలాగే అర్బన్ తహసీల్దార్ పోసియ్య, ఇతర రెవెన్యూ అధికారులపై కూడా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసి, మీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని సబ్ కలెక్టర్ విజయకృష్ణ¯ŒSపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురి మధ్యా వాగ్వాదం ముదిరి ఒక దశలో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాల్సి వస్తుందని సబ్‌కలెక్టర్ హెచ్చరించారు. దీనితో ఎమ్మెల్యే ఆగ్రహించి అక్కడే బైఠాయించారు. దీనిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని సబ్ కలెక్టర్ హెచ్చరించగా ఎమ్మెల్యే రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్పకు సమస్యను వివరించారు. ఈ సమస్యలను వచ్చే మంగళవారం ఇరు వర్గాలు కూర్చొని చర్చించవచ్చునని ఆయన చెప్పడంతో ఎమ్మెల్యే శాంతించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. వైఎస్సార్సీపీ సంఘీభావం ఆనం రోటరీ హాల్‌ను ఏ విధమైన ముందు హెచ్చరికలు లేకుండా స్వాధీనం చేసుకోవడంపై వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, రూరల్ కో–ఆర్డినేజర్ ఆకుల వీర్రాజు, వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు మజ్జి అప్పారావు రోటరీ యాజమాన్యానికి సంఘీభావం తెలిపారు. భవనాన్ని దౌర్జన్యంగా ఖాళీ చేయించడం తగదని తహసీల్దార్‌కు సూచించారు. ఘటనా స్థలాన్ని మేయర్ పంతం రజనీ శేషసాయి, బీసీ సంఘాల నాయకులు మార్గాని నాగేశ్వరరావు, కె.కె.సంజీవ రావు, అయ్యల గోపి, మార్గాని రామకృష్ణ గౌడ్, మరుకుర్తి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. -
6 జిల్లాల్లో డయాలసిస్ సెంటర్లు, పాఠశాలలు
పాలకొల్లు అర్బన్ : రోటరీ ఇంటర్నేషనల్ ప్రోత్సాహంతో ఈ ఏడాది ఆరు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా డయాలసిస్ సెంటర్లు, రోటరీ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నట్టు రోటరీక్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు అన్నారు. గవర్నర్ అధికారిక పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన పాలకొల్లు మండలంలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నాగరాజుపేటలోని గురుకుల విద్యార్థులు ఎండ్ పోలియో ఆకృతిలో కూర్చుని పోలియోని శాశ్వతంగా నిర్మూలిద్దాం అంటూ నినాదం ఇచ్చారు. అంజలి మానసిక వికలాంగుల స్కూల్లో మదర్‌థెరిస్సా 150వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు బాలి ఏడుకొండలు విరాళం రూ.5 లక్షలతో నిర్మించిన భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. అంజలి స్కూల్ విద్యుదీకరణ నిమిత్తం రూ.40 వేలు విరాళాన్ని ప్రకటించారు. ఓఎన్జీసీ జనరల్ మేనేజర్ ఏవీవీఎస్ కామరాజు స్కూల్‌కి 12సీలింగ్ ఫ్యాన్లు విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా గురుకుల విద్యాలయలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి రెవెన్యూ డివిజన్‌లోనూ రోటరీ డయాలసిస్ సెంటర్, రోటరీ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, దాతల సహకారంతో సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ అధ్యక్షుడు కొప్పు సత్యనారాయణణ, క్ల»Œ æకార్యదర్శి అనంతపల్లి కిరణ్‌కుమార్, రావూరి వెంకట అప్పారావు, చందక రాము, గొర్ల శ్రీనివాస్, సోమంచి శ్రీనివాసశాస్త్రి, గుడాల హరిబాబు, యాతం రమేష్ తదితరులు పాల్గొన్నారు.