28,29 తేదీల్లో రోటరీ రాష్ట్ర స్థాయి సదస్సు | rotary | Sakshi
Sakshi News home page

28,29 తేదీల్లో రోటరీ రాష్ట్ర స్థాయి సదస్సు

Published Fri, Jan 20 2017 11:04 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM

rotary

 
 
బాలాజీచెరువు (కాకినాడ) :
రోటరీ గోల్డె¯ŒSజూబ్లీ క్లబ్‌ ఆధ్వర్యంలో ఈ నెల 28, 29 తేదీల్లో రోటరీ రాష్ట్ర స్థాయి సదస్సు  కాకినాడలో నిర్వహిస్తున్నట్టు రోటరీ జిల్లా గవర్నర్‌ డాక్టర్‌ ఎస్‌వీఎస్‌రావు శుక్రవారం తెలిపారు. రోటరీ హాల్లో  జరిగిన సమావేశంలో వివరాలు వెల్లడిస్తూ ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహ¯ŒS హాజరౌతున్నారని చెప్పారు. సదస్సులో శ్రీకాకుళం నుంచి కృష్ణాజిల్లా వరకూ ఉన్న రోటరీ క్లబ్‌లన్నీ  పాల్గొంటాయని, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత  ఎస్‌.రామదొరైని రోటరీ లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డుతో సత్కరిస్తామని, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత మాజీ ఎంపీ యార్లగడ్డ లక్షీ్మప్రసాద్‌ హాజరౌతున్నారని తెలిపారు. సమావేశంలో  సదస్సు చైర్మ¯ŒS జి.కె.శ్రీనివాస్, «అ««దl్యక్షుడు డాక్టర్‌ రామకృష్ణ, కార్యదర్శి ఉదయభాను, పేపకాయల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement