state meeting
-
పదేళ్ల తర్వాత మళ్లీ.. ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు
సాక్షి, వరంగల్: జై భారత్.. జై జవాన్.. జై కిసాన్ నినాదంతో విద్యారంగ సమస్యలు, వ్యవసాయంలో రైతులకు గిట్టుబాటు ధరలు తదితర సామాజిక సమస్యలపై చర్చించేందుకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) 38వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నారు. వరంగల్‌లోని కేయూ ఆడిటోరియం వేదికగా మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు ఈ సభలు జరుగుతాయి. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, గతంలో 2008 లో హన్మకొండలోని ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాల ఆడిటోరియంలో ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు జరిగాయి. మళ్లీ ఇప్పుడు వరంగల్ వేదికగా నిలుస్తోంది. రెండు వేలమంది ప్రతినిధులు.. కేయూలో మంగళవారం నుంచి నిర్వహించనున్న ఏబీవీపీ రాష్ట్ర మహాసభలకు రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి ఎంపిక చేసిన రెండు వేలమంది ప్రతినిధులు హాజరుకానున్నారు. రాష్ట్రంలో సుమారు 8లక్షల సభ్యత్వం కలిగిన ఏబీవీపీలో రాష్ట్ర, జిల్లా, మండల, కళాళాశాల బాధ్యులు ప్రతినిధులుగా హాజరవుతారు. వీరి కోసం కేయూలో పలుచోట్ల వసతి ఏర్పాట్లు చేశారు. చర్చించనున్న అంశాలు ఇవే.. రాష్ట్ర మహాసభల సందర్భంగా రాష్ట్రంలోని పాఠశాల, కళాశాలల స్థాయి నుంచి యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్యలపై చర్చించనున్నారు. రేషనలైజేషన్ పేరుతో పాఠశాలల మూసివేత, యూనివర్సిటీల్లో అధ్యాపకులు, ఉద్యోగుల ఖాళీలు, వీసీల భర్తీలో ఆలస్యం, ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి, సంక్షేమ హాస్టళ్ల సౌకర్యాల కల్పన, స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు తదితర అంశాలపై చర్చించి తీర్మానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనున్నారు. మొదటిరోజు కేవలం జెండా ఆవిష్కరణ.. నాలుగు రోజుల పాటు జరిగే ఏబీవీపీ మహాసభల్లో భాగంగా మంగళవారం తొలిరోజు సాయంత్రం 6గంటలకు సభాప్రాంగణం వద్ద ఏబీవీపీ జెండాను రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మీసాల ప్రసాద్.. రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్‌తో కలిసి ఆవిష్కరిస్తారు. ఏబీవీపీ ప్రముఖ్ మాసాడి బాబురావు పాల్గొంటారు. ఇక రెండో రోజైన బుధవారం రాష్ట్ర మభసభలను ఉద్ధేశించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభిస్తారు. ఏబీవీపీ జాతీయ సంఘటసహాకార్యదర్శి కేఎన్ రఘునందన్ పాల్గొననుండగా.. అమరవీరుల కుటుంబాలను సన్మానిస్తారు. మూడో రోజైన గురువారం మధ్యాహ్నం 3గంటలకు కేయూ నుంచి ఏకశిలా పార్కు వరకు శోభాయాత్రగా వెళ్లి అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభలో ఏబీవీపీ జాతీయ కార్యదర్శి ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి నిధి త్రిపాఠి,న్రాష్ట్ర నూతన అధ్యక్షడు శంకర్ పాల్గొని ప్రసంగిస్తారు. మహాసభలను విజయవంతం చేయాలి.. కేయూలో మంగళవారం నుంచి జరగనున్న ఏబీవీపీ 38వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని స్వాగత సమితి అధ్యక్షుడు డాక్టర్ నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. కేయూలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని.. ఈ సందర్భంగా విద్యారంగ, సామాజిక అంశాలపై చర్చిస్తామని తెలిపారు. మహాసభల కన్వీనర్ ఏలేటి నాగరాజు, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్, కేయూ అధ్యక్షుడు చట్ట సతీష్, నగర కార్యదర్శి భరత్ పాల్గొన్నారు. 1970 దశకం నుంచే ఏబీవీపీ.. స్వాతంత్రనంతం 1949, జూలై 9న ఐదుగురు విద్యార్థులతో ప్రొఫెసర్ బెహల్ ఢిల్లీలో విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ ఏర్పాటైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1970 దశకం నుంచి ఎక్కువగా ఏబీవీపీ విస్తరణ యూనివర్సిటీల్లో జరిగింది. అప్పటి నుంచే వరంగల్ ప్రాంతంలోనూ ఏబీవీపీ విద్యారంగ సమస్యలపై పోరాడుతూనే విద్యార్థుల్లో జాతీయ భావం పెంపొందించేందుకు కృషి చేస్తోంది. 1982లో కేయూలో జాతీయ జెండాకు అవమాన జరిగిందంటూ సామ జగన్మోహన్రెడ్డి న్యాయపోరాటం చేస్తూ అసువులు బాశారు. ఆయన స్ఫూర్తిగా ముందుకెళ్తూ విద్యారంగ, సామాజిక సమస్యలపై పోరాడుతోంది. -
28,29 తేదీల్లో రోటరీ రాష్ట్ర స్థాయి సదస్సు
బాలాజీచెరువు (కాకినాడ) : రోటరీ గోల్డె¯ŒSజూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 28, 29 తేదీల్లో రోటరీ రాష్ట్ర స్థాయి సదస్సు కాకినాడలో నిర్వహిస్తున్నట్టు రోటరీ జిల్లా గవర్నర్ డాక్టర్ ఎస్‌వీఎస్‌రావు శుక్రవారం తెలిపారు. రోటరీ హాల్లో జరిగిన సమావేశంలో వివరాలు వెల్లడిస్తూ ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహ¯ŒS హాజరౌతున్నారని చెప్పారు. సదస్సులో శ్రీకాకుళం నుంచి కృష్ణాజిల్లా వరకూ ఉన్న రోటరీ క్లబ్‌లన్నీ పాల్గొంటాయని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఎస్.రామదొరైని రోటరీ లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్ అవార్డుతో సత్కరిస్తామని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మాజీ ఎంపీ యార్లగడ్డ లక్షీ్మప్రసాద్ హాజరౌతున్నారని తెలిపారు. సమావేశంలో సదస్సు చైర్మ¯ŒS జి.కె.శ్రీనివాస్, «అ««దl్యక్షుడు డాక్టర్ రామకృష్ణ, కార్యదర్శి ఉదయభాను, పేపకాయల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
23 నుంచి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సమావేశాలు
కరీంనగర్‌ఎడ్యుకేషన్: భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈనెల 23, 24, 25 తేదీల్లో కరీంనగర్లో జరుగుతాయని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.తిరుపతి, బత్తిని సంతోష్ తెలిపారు. సమావేశాల ఆహ్వానపత్రాలను శుక్రవారం ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్‌రెడ్డి ఆవిష్కరించారు. విద్యారంగ పరిరక్షణకు అందరూ సహకరించాలని రమేశ్‌రెడ్డి కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి రజినీకాంత్, నాయకులు భాను, మౌనిక, సాగరిక పాల్గొన్నారు. -
ఉద్యమ స్ఫూర్తి సన్నగిల్లుతోంది
ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామిరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ. కోట్లు కుమ్మరించడం ప్రజాస్వామ్యానికి విఘాతం విద్యారంగాన్ని శాసిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రఘురామిరెడ్డి గుంటూరులో ముగిసిన ఏపీటీఎఫ్ రాష్ట్ర మహాసభలు గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల్లో ఉద్యమస్ఫూర్తి సన్నగిల్లుతోందని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రఘురామిరెడ్డి పేర్కొన్నారు. గుంటూరు నగరం లాడ్జి సెంటర్లోని ఎల్ఈఎం ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగిన ఏపీటీఎఫ్ రాష్ట్ర 18వ విద్యా, వైజ్ఞానిక రాష్ట్ర మహాసభలు ఆదివారం ముగిశాయి. ఈసందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రఘురామిరెడ్డి మాట్లాడుతూ ప్రై వేటు విద్యాసంస్థల ధాటికి ప్రభుత్వ విద్యారంగం కుదేలవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యారంగాన్ని శాసిస్తున్నాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం సాధారణ ఎన్నికల మాదిరిగా రూ. కోట్లాది ఖర్చు చేయాల్సి విధంగా మారిపోయాయని, ఇది ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేసే విషయమన్నారు. రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసి వేయడం తగదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం లక్షా 70 వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తుండగా, ప్రభుత్వం చేపట్టిన రేషనలైజేషన్‌తో రాబోయే పదేళ్ళలో వారి సంఖ్య 50 వేలకు తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. ఉద్యమాలే ఊపిరిగా కొనసాగుతున్న ఏపీటీఎఫ్ ప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉపాధ్యాయులు ఉద్యమబాటలో పయనించాలని పిలుపునిచ్చారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. పాండురంగ వరప్రసాద్ మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంతో భవిష్యత్‌లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసే పరిస్థితి ఉండబోదని అన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తొమ్మిది బిల్లులను సిద్ధం చేస్తోందని, ఇదే జరిగితే విద్యా వ్యవస్థ పూర్తిగా ప్రై వేటు పరమయ్యే ప్రమాదముందన్నారు. ఈసందర్భంగా ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి పరమేశ్వరరావు, ఉపాధ్యక్షులు శ్యాం సుందర్ రెడ్డి, సీహెచ్ మంజుల, కార్యదర్శులు బాలకష్ణ, సరస్వతి, ఉపాధ్యాయ పత్రిక సంపాదకులు జిలానీ, జిల్లా అధ్యక్షుడు కె. బసవ లింగారావు, ప్రధాన కార్యదర్శి ఎస్డీ చాంద్ బాషా, వివిధ జిల్లాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.