తెలుగు రాష్ట్రాలలోని వరద భాదిత కుటుంబాలకు 50 లక్షల రూపాయల రోటరీ సహాయం | 50 Lakh Rupees Rotary Assistance To Flood Affected Families In Telugu States | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాలలోని వరద భాదిత కుటుంబాలకు 50 లక్షల రూపాయల రోటరీ సహాయం

Published Wed, Sep 11 2024 4:22 PM | Last Updated on Wed, Sep 11 2024 4:34 PM

50 Lakh Rupees Rotary Assistance To Flood Affected Families In Telugu States

తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు సాయం అందించేందుకు రోటరీ క్లబ్‌లు ముందుకు వచ్చాయి. తెలంగాణాలో ఖమ్మం జిల్లాలో కొన్ని గ్రామాలు , ఆంధ్రప్రదేశ్‌ విజయవాడకు దిగువ తీరాన తెనాలి -రేపల్లె ఏరియాలో ఉన్న కొన్ని గ్రామాలలో పూర్తిగా నిరాశ్రయులైన కుటుంబాల సహాయార్ధం రోటరీ క్లబ్‌లు ముందుకు వచ్చాయని రోటరీ గవర్నర్ రోటేరియన్‌ శరత్‌ చౌదరి తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఈ వరద ప్రమాదం సంభవించిన వెంటనే గత ఐదు రోజులుగా ఖమ్మం, భద్రాచలం, గుంటూరు, ప్రకాశం, జిల్లాలోని రోటరీ క్లబ్‌లు అన్ని కలిసి 'ఆత్మబంధువు' అనే ప్రాజెక్ట్‌ పేరున దాదాపు 50 లక్షల రూపాయలు విలువ చేసే వంట సామాను కిట్స్‌ని ఖమ్మం జిల్లాల్లలోని గ్రామాల్లో 2500 మందికి, అలాగే తెనాలి-రేపల్లె ఏరియాలోని గ్రామాల్లో 1500 వరద బాధితులుకు అందజేశామని తెలిపారు. 

గత మూడు రోజులుగా ఖమ్మం రోటరీ క్లబ​ వారు మల్లాది వాసుదేవ్‌ గారి ఆధ్వర్యంలో ప్రతి ప్యాకెట్‌లో 5 కేజీల రైస్‌ ప్యాకెట్‌, బొంబాయి రవ్వ, 1 లీటరు వంట నూనె, 1/2 కేజీ చింతపండు, కందిపప్పు, ఉల్లిపాయలు, ఇతర దినుసులను ఒక కుటుంబానికి సరిపోయేలా అందజేశామని తెలిపారు. అదేవిధంగా పిగురాళ్ల రోటరీ క్లబ్‌ వారు డాక్టర్‌ విష్ణు బాబు ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రాంతంలో పంచటానికి సుమారు 2500 కుటుంబాలకు వంట సామాను పాకెట్స్‌ని రెడీ చేస్తున్నట్లు తెలిపారు. ]

అలాగే అన్ని చోట్ల రోటరియన్స్‌ ఎంతో శ్రమపడి వరద బాధిత కుటుంబాలని గుర్తించి నేరుగా వారికి సహాయం అందే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గత ఆదివారం సెప్టంబర్‌ 8న రేపల్లె ఏరియా గ్రామాలలో వంట సామను కిట్‌లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఈ విపత్తుపై స్పందించి ధన సహాయం, వస్తు సహాయం చేస్తున్న రోటరియన్స్‌ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు రోటరీ గవర్నర్‌ రోటేరియన్‌ శరత్‌ చౌదరి.

(చదవండి: రండి వరద బాధితులను ఆదుకుందాం!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement