hall
-
వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్‌లో ఆకట్టుకున్న మోడల్స్ ర్యాంప్ వాక్.. ఫోటోలు
-
వైరల్ వీడియో: వధువు ఎంట్రీ మాములుగా లేదు! దివి నుంచి వచ్చిన దేవతలా దిగింది
-
వధువు ఎంట్రీ మాములుగా లేదు! దివి నుంచి వచ్చిన దేవతలా దిగింది
ఇటీవల వధువరులు భలే గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటున్నారు. కొందరూ తమ రేంజ్‌కి తగ్గట్టుగా పెళ్లి చేసుకుంటే, మరికొందరూ అతి తక్కువ ఖర్చుతో కూడా పెళ్లి చేసుకోవచ్చు అని చేసి చూపిస్తున్నారు. అదంతా ఒక ఎత్తైతే..పెళ్లి మండపానికి కూడా వధువు లేదా వరుడు కూడా చాలా వైరైటీగా ఎంట్రీ ఇచ్చి బంధువులను, కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరుస్తున్నారు. అదే తరహాలో ఇక్కడొక పెళ్లి కూతురు ఇచ్చిన ఎంట్రీ చూస్తే వామ్మో! అంటారు. వివరాల్లో కెళ్తే...ఇక్కడొక వధువు తన తండ్రితో కలిసి ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవతలా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఉన్న వాళ్లంతా ఆ! అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ పెళ్లి మండపంలోని సీలింగ్‌కి కేబుల్స్‌తో సస్సెండ్ చేసిని అందమైన రోప్‌వే మాదిరిగా ఉండే దానిలో నుంచొని వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసి కొందరూ నెటిజన్లు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి పడిపోతే ఏమౌవుతుంది అంటూ మండిపడుతూ రకరకాలు ట్వీట్ చేశారు. (చదవండి: ఈగనా మజాకా! ఏకంగా పది గ్రామాల్లో పెళ్లిళ్లు ఆగిపోయాయి..) -
సత్తెన్న సొమ్ముపై రాజకీయ పెత్తనం!
-ఇప్పటికే వృథాగా కిర్లంపూడి, శంఖవరం కల్యాణ మంటపాలు - తాజాగా కోరుకొండలో డార్మెట్రీహాలు నిర్మాణానికి పాలకవర్గం తీర్మానం అన్నవరం : సత్యదేవుడు కొలువైన అన్నవరంలో దేవస్థానం కల్యాణ మంటపం ఒక్కటీ లేదు. కానీ రాజకీయ ఒత్తిళ్లతో ఇతర ప్రాంతాల్లో దేవస్థానం కల్యాణ మంటపాలు, డార్మెట్రీ హాళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. వివరాలిలాఉన్నాయి... అన్నవరంలో దేవస్థానం కల్యాణ మంటపాలు లేకపోవడంతో ప్రైవేట్ లాడ్జిలకు చెందిన కల్యాణ మంటపాలలోనే సామాన్యులు వివాహాలు చేసుకుంటున్నారు. రాజకీయ వత్తిడుల కారణంగా 1999–2001 సంవత్సరాల మధ్య జిల్లాలోని కిర్లంపూడి, శంఖవరాలలో రెండు కల్యాణ మంటపాలు అధికారులు నిర్మించారు. ఒక్కొక్క దానికి రూ.కోటికి పైగా వ్యయమైంది. వాటిలో పెద్దగా వివాహాలు జరగక, నిర్వహణకు సరిపడా ఆదాయం కూడా రాక లీజు కిచ్చేందుకు దేవస్థానం టెండర్లు కూడా పిలిచింది. ఈసారి కోరుకొండలో.. ఈ చేదు అనుభవం ఉన్నప్పటికీ...తాజాగా కోరుకొండలో దేవస్థానం స్థలంలో రూ.35 లక్షల వ్యయంతో డార్మెట్రీ నిర్మాణానికి పాలకవర్గం తీర్మానించింది. కోరుకొండ ప్రాంత ప్రజాప్రతినిధి ఇటీవల అన్నవరం వచ్చి ఈఓ కే నాగేశ్వరరావుతో ఈ నిర్మాణ విషయమై సుదీర్ఘంగా చర్చించి ఒప్పించినట్టు సమాచారం. వాస్తవానికి కల్యాణ మంటపం నిర్మించడానికే ప్రతిపాదనలు పెట్టారు. అయితే కల్యాణ మంటపం నిర్మాణం అంటే వివాదమవుతుందని భావించి ఈ రకంగా మార్పు చేశారు. 84 అడుగుల పొడవు 33 అడుగుల వెడల్పుతో ఈ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. పొడవుగా రెండు హాల్స్ కలిపి ఒక భవనంగా నిర్మించి ఒక దాంట్లో కిచెన్, డైనింగ్‌హాల్, మరో దాంట్లో వివాహాలు చేసుకునేందుకు గాను ప్లాన్ సిద్ధం చేశారు. కమిషనర్ అనుమతికి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదట్లో అంతే! గతంలో కిర్లంపూడి, శంఖవరంలో కల్యాణ మంటపాలు నిర్మించేటపుడు కూడా మొదట తక్కువ మొత్తంతోనే ప్లాన్ సిద్ధం చేసి అనుమతులు పొంది, ఆ తరువాత రూ.కోటి వరకూ ఖర్చు చేశారు. ఇప్పుడు కూడా ఈ డార్మెట్రీ హాలు నిర్మాణం పూర్తయ్యేటప్పటికీ సుమారు రూ.60 లక్షల వరకూ ఖర్చవుతుందని సమాచారం. ఈవో నో కామెంట్ అన్నవరంలో కాకుండా ఎక్కడెక్కడో రూ.లక్షలు ఖర్చు పెట్టి నిర్మిస్తుండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఈఓ కే నాగేశ్వరరావును సంప్రదించగా మాట్లాడేందుకు నిరాకరించారు. -
హాల్‌కు అసోచామ్ కార్పొరేట్ ఎక్స్ లెన్స్ అవార్డ్
బెంగళూరు: హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్)కు కార్పొరేట్ గవర్నెన్స ఎక్స్లెన్స అవార్డును అసోచామ్ బహూకరించింది. రూ.500కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన ప్రభుత్వ రంగ అన్‌లిస్టెడ్ కంపెనీ విభాగంలో 2015-16 సంవత్సరానికి గాను ఈ అవార్డును అందించింది. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో హాల్ సీఎండీ టి.సువర్ణరాజుకు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఈ అవార్డును అందించారు. కార్పొరేట్ పరిపాలనా పరంగా ఇప్పటికే ఆచరిస్తున్న అత్యుత్తమ ప్రమాణాలను ఇకపైనా కొనసాగించేందుకు, మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా రాజు పేర్కొన్నారు. -
అడ్డొస్తే కేసు నమోదు చేస్తా
రోటరీ హాల్ స్వాధీనంలో ఉద్రిక్తత ఎమ్మెల్యే ఆకులపై సబ్‌కలెక్టర్ విజయకృష్ణన్ ఆగ్రహం ఆనం భవనం ముందు ఎమ్మెల్యే బైఠాయింపు ఎమ్మెల్యే ఫిర్యాదుపై మంగళవారం చర్చిద్దామన్న హోం మంత్రి తాత్కాలికంగా సమసిన వివాదం తాడితోట (రాజమహేంద్రవరం) : సుమారు 50 ఏళ్లకు పైగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉన్న ఆనం రోటరీ హాల్‌ను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకునే విషయంలో వివాదం చోటు చేసుకుంది. స్థానిక వై జంక్ష¯ŒSలో ఉన్న ఆనం రోటరీ హాల్ స్థలాన్ని 1957లో అప్పటి మున్సిపల్ సభ్యుడు ఆనం ప్రేమ్ కుమార్ రోటరీ క్లబ్‌కు కేటాయించించేలా అధికారులను ఒప్పించి రోటరీక్లబ్ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి దీని పన్నులన్నీ రోటరీ క్లబ్ ద్వారానే చెల్లిస్తున్నారు. అయితే దీని డాక్యుమెంట్లు క్లబ్ సభ్యుల వద్ద లేవు. మూడు నెలల క్రితం రెవెన్యూ అధికారులు ఈ భవనం డాక్యుమెంట్లు సమర్పించాలని క్లబ్ అధ్యక్షుడు పట్టపగలు వెంకట్రావు, ఇతర సభ్యులకు S నోటీసులు జారీ చేశారు. దీనికి ప్రతిగా సభ్యులు విద్యుత్ బిల్లులు, మున్సిపల్ పన్ను బిల్లులు సమర్పించారు. దీంతో అధికారులు మళ్లీ వారం రోజుల క్రితం అధికారులు భవనం క్లబ్దేననే ఆధరాలు కావాలని నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ వారు ఎటువంటి పత్రాలూ సమర్పించకపోవడంతో అధికారులు ఎన్‌క్రోచ్‌మెంట్ నిబంధనల మేరకు భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు శనివారం ఉదయం రోటరీ హాల్‌కు వచ్చారు. ఇంతలో తన నియోజక వర్గంలో తనకు తెలియకుండా రోటరీ క్లబ్ ఆధీనంలో ఉన్న భవనాన్ని ఎలా స్వాధీనం చేసుకుంటారంటూ ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ విజయ కృష్ణ¯ŒSను ఫో¯ŒSలో నిలదీశారు. అలాగే అర్బన్ తహసీల్దార్ పోసియ్య, ఇతర రెవెన్యూ అధికారులపై కూడా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసి, మీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని సబ్ కలెక్టర్ విజయకృష్ణ¯ŒSపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురి మధ్యా వాగ్వాదం ముదిరి ఒక దశలో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాల్సి వస్తుందని సబ్‌కలెక్టర్ హెచ్చరించారు. దీనితో ఎమ్మెల్యే ఆగ్రహించి అక్కడే బైఠాయించారు. దీనిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని సబ్ కలెక్టర్ హెచ్చరించగా ఎమ్మెల్యే రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్పకు సమస్యను వివరించారు. ఈ సమస్యలను వచ్చే మంగళవారం ఇరు వర్గాలు కూర్చొని చర్చించవచ్చునని ఆయన చెప్పడంతో ఎమ్మెల్యే శాంతించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. వైఎస్సార్సీపీ సంఘీభావం ఆనం రోటరీ హాల్‌ను ఏ విధమైన ముందు హెచ్చరికలు లేకుండా స్వాధీనం చేసుకోవడంపై వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, రూరల్ కో–ఆర్డినేజర్ ఆకుల వీర్రాజు, వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు మజ్జి అప్పారావు రోటరీ యాజమాన్యానికి సంఘీభావం తెలిపారు. భవనాన్ని దౌర్జన్యంగా ఖాళీ చేయించడం తగదని తహసీల్దార్‌కు సూచించారు. ఘటనా స్థలాన్ని మేయర్ పంతం రజనీ శేషసాయి, బీసీ సంఘాల నాయకులు మార్గాని నాగేశ్వరరావు, కె.కె.సంజీవ రావు, అయ్యల గోపి, మార్గాని రామకృష్ణ గౌడ్, మరుకుర్తి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. -
వారెవ్వా.. వాల్స్!
గోడల్లోనే వస్తువుల అమరిక సాక్షి, హైదరాబాద్ : ‘ఇల్లు కట్టి చూడు’ అనేది పాత నానుడి. ‘ఉన్న స్థలంలోనే వస్తువులను అమర్చి చూడు’ అన్నది లేటెస్ట్ సామెత. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో విశాలమైన ఇల్లు కావాలంటే బోలెడంత డబ్బు కావాలి. ఇది అందరికీ కుదరదు. అందుకే ఉన్న కొంచెం స్థలంలోనే ఇంట్లోని ఫర్నీచర్‌ను అమర్చుకోవాలి. దీనికి కావాల్సిందల్లా కొద్దిపాటి సృజనాత్మకతే. సౌకర్యాల ఆలోచనలు.. ఈ రోజుల్లో 600 చ.అ.- 700 చ.అ. విస్తీర్ణంలోనే ఒక హాలు, వంట గది, పడక గది, పూజ గది, వీటిని ఆనుకునే మరుగుదొడ్డినీ నిర్మిస్తున్నారు బిల్డర్లు. హాల్లోనే సోఫాసెట్, టీవీ, డైనింగ్ టేబుల్, దివాన్‌కాట్ అమర్చాలి. వంట గదిలోనే ఉడెన్ కప్ బోర్డు, స్టీల్ బాస్కెట్స్, చిమ్నీ, స్టోరేజీ క్యాబిన్‌తో నిత్యావసర సరుకులతో పాటు బియ్యం వంటి వంట సామాగ్రి ఉండేలా చూసుకోవాలి. పడకగదిలో రెండు మంచాలతో పాటు గోడలకే అమర్చే కప్ బోర్డ్‌లోనే దుస్తులు, నగదు, బంగారం తదితర విలువైన వస్తువులు పెట్టే ఏర్పాటు చేసుకోవాలి. అన్ని గోడల్లోనే.. టీవీ మొదలుకొని బీరువా, మైక్రోఓవెన్‌ను అంతర్గత అలంకరణలో భాగంగా గోడల్లోనే అమర్చుకునేలా ప్రణాళికలున్నాయి. మరోవైపు సోపానే మంచంగా మలుచుకునేలా రెడిమేడ్‌గా తయారైనవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. డ్రెస్సింగ్ టేబుల్ కూడా హాలులో కానీ, పడక గదిలోనే ఒక గూటికి అమర్చుకునేలా నిపుణులు తయారుచే స్తున్నారు. ఇవన్నీ మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. ప్రత్యేకించి అపార్ట్మెంట్లు, కాలనీల్లో ఇల్లు నిర్మించుకునే వారికి అనుగుణంగా వీటిని రూపొందిస్తున్నారు. -
పోలీస్ కన్వెన్షన్ హాలు ప్రారంభం
కాకినాడ రూరల్ : పోలీసులు తమ పరిధిలోని కమ్యూనిటీ , కన్వెన్షన్ హాళ్ల వంటి వాటిని ప్రధాన ఆదాయ వనరులుగా మార్చుకోవాలని డీజీపీ జేవీ రాముడు సూచించారు. కాకినాడలోని పోలీసు రిజర్వులైనులో రూ.1.35 కోట్లతో నిర్మించిన కన్వెన్షన్ హాలును బుధవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. కన్వెన్షల్ హాలును కేవలం పోలీసు సిబ్బందికే కాక బయట వారు కూడా ఫంక్షన్లు, పెళ్లిళ్లు తదితర కార్యక్రమాలను చేసుకునేందుకు ఇస్తే ఆదాయం సమకూరుతుందన్నారు. ఆ రాబడిని పోలీసు కుటుంబాల సంక్షేమానికి ఉపయోగించాలని సూచించారు. ఇటీవల జిల్లాలో జరిగిన పలు సంఘటనల్లో శాంతిభద్రతలు భంగపడకుండా పోలీసులు చేసిన సేవలు ప్రశంసనీయమన్నారు. రాష్ట్రం విడిపోయాక పోలీసు సిబ్బంది సరిపడినంతగా రాష్ట్రానికి రాలేదన్నారు. ప్రస్తుతం నియామకానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, జేసీ సత్యనారాయణ, ఎస్పీ రవిప్రకాష్, ఏఎస్పీ దామోదర్, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తదితరులు పాల్గొన్నారు. -
70 వేల ఇందిరమ్మ ఇళ్లు రద్దు?
మోర్తాడ్: గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి బిల్లులు చేయకపోవడంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 70 వేల ఇళ్లు రద్దు అయ్యాయి. 2013-14 ఆర్థిక సంవత్సరానికిగాను, అంతకు ముందు సంవత్సరాల్లో మంజూరు అయిన ఇళ్లకు సంబంధించి ఎంతో కొంత బిల్లు చేసిన ఇళ్లను మాత్రమే ఆన్లైన్లో ఉంచిన అధికారులు అసలే బిల్లు చేయని ఇళ్లను రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. పేద, మధ్య తరగతి ప్రజలకు సొంత ఇంటి కలను నెరవేర్చడానికి రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ద్వారా ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. అయితే, పాత విధానానికి స్వస్తి పలుకుతూ కొత్త విధానానికి దివంగ త ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రూపొందించి ఆర్థిక సహాయాన్ని పెంచారు. సకల సదుపాయాలు కల్పిం చే విధంగా చర్యలు తీసుకున్నారు. తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు బెడ్రూం లు, హాలు, కిచెన్, అటాచ్డ్ బాతురూం కలిగిన ఇంటిని రూ. మూడు లక్షల వ్యయంతో నిర్మించి ఇస్తామని ప్రకటించింది. అయితే ఇంతవరకు గృహనిర్మాణ సంస్థ ద్వారా అందించే ఆర్థిక సహాయానికి సంబంధించిన పాలసీని ప్రభుత్వం ఖరారు చేయలేదు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యిందనే నమ్మకంతో ఎంతో మంది ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు. బంధు, మిత్రులు, వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేసి అనేక మంది ఇళ్ల నిర్మాణం ప్రారంభిం చారు. ఎలాగూ ఇల్లు మంజూరు అయ్యింది కదా అని భావించిన లబ్ధిదారులు బిల్లు వచ్చిన తరువాత అప్పులు తీర్చేయవచ్చని ఆశించి ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేశారు. అయితే రాష్ట్ర విభజనకు ముందుగానే బిల్లుల చెల్లింపునకు వెబ్‌సైట్‌ను క్లోజ్ చేసిన గృహనిర్మాణ సంస్థ ఇప్పటి వరకు ఆన్‌లైన్‌కు అనుమతి ఇవ్వలేదు. వెబ్సైట్ ఆన్‌లో ఉంటేనే ఇంది రమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి బిల్లులు చెల్లించే వీలు ఉంది. ఇళ్లు మంజూరు అయినా ఎంతో కొంత బిల్లు చెల్లింపు జరుపకపోవడంతో 70 వేల ఇళ్లు రద్దు కానున్నాయని సంబంధిత అధికారిక వర్గాలు చెబుతున్నాయి. పాతవి, కొత్తవి కలుపుకుని 1.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇందులో 25 వేల ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. మరో 25 వేల ఇళ్లు 50 శాతం నిర్మాణ దశను పూర్తి చేసుకున్నాయి. 30 వేల ఇళ్ల నిర్మాణం మొదలు కావడంతో 10 శాతం బిల్లు చెల్లింపు జరిగింది. 70 వేల ఇళ్లకు అసలే బిల్లు చెల్లింపు జరుగకపోవడంతో అవి రద్దు కానున్నాయి. మంజూరు అయి రద్దు అవుతున్న ఇళ్ల స్థానంలో రెండు బెడ్రూంలు, హాలు, కిచెన్, అటాచ్డ్ బాత్రూం గల ఇంటిని మంజూరు చేస్తారా లేదా అనేది ఇంకా తేలలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన పథకం ప్రకారం తమకు ఇళ్లు మంజూరు అయితే పర్వాలేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. కొత్త ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం విషయమై ప్రభుత్వ పాలసీ ఖరారు కాక పోవడంతో ఇప్పుడే ఏమీ చెప్పలేమని అధికారులు అంటున్నారు. ఇప్పుడే ఏమీ చెప్పలేం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన వెబ్సైట్ క్లోజ్ అయ్యింది. వెబ్సైట్ ఆన్‌లో ఉంటే ఏదైనా చెప్పగలం. ఇళ్లు రద్దు విషయం మాకు అధికారికంగా ఇంకా తెలియలేదు. బిల్లులు అసలే చెల్లించకుంటే ఆ ఇళ్లను రద్దు చేస్తారా లేక కొత్త పథకం కింద తీసుకుంటారో ఇంకా స్పష్టత లేదు. -
అదిరింది !
అదిరింది ! స్థానిక మౌర్య ఇన్‌లోని పరిణయ హాలులో ఆదివారం గాయత్రి ఎస్టేట్స్‌లోని రవీంద్రభారతి పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ జి. విజయకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మార్కులు ముఖ్యం కాదని, చదువు నేర్పే విజ్ఞానం, శారీరకభాష, సమాజంలో ఎలాగుండాలో నేర్పించడమే ప్రధానమన్నారు. రవీంద్రభారతి విద్యాసంస్థలు విలువలతో కూడిన విద్యనందిస్తున్నాయని ఆయన కొనియాడారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో రవీంద్రభారతి పాఠశాలల డిస్ట్రిక్ట్ ఇన్చార్జి నాగభూషణం, ప్రిన్సిపల్ ఉమామహేశ్వరి, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.