అదిరింది ! | super classical | Sakshi
Sakshi News home page

అదిరింది !

Published Mon, Feb 17 2014 2:17 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

అదిరింది ! - Sakshi

అదిరింది !

  అదిరింది !
 స్థానిక మౌర్య ఇన్‌లోని పరిణయ హాలులో ఆదివారం గాయత్రి ఎస్టేట్స్‌లోని రవీంద్రభారతి పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీఎస్‌పీ బెటాలియన్ కమాండెంట్ జి. విజయకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మార్కులు ముఖ్యం కాదని, చదువు నేర్పే విజ్ఞానం, శారీరకభాష, సమాజంలో ఎలాగుండాలో నేర్పించడమే ప్రధానమన్నారు. రవీంద్రభారతి విద్యాసంస్థలు విలువలతో కూడిన విద్యనందిస్తున్నాయని ఆయన కొనియాడారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో రవీంద్రభారతి పాఠశాలల డిస్ట్రిక్ట్ ఇన్‌చార్జి నాగభూషణం, ప్రిన్సిపల్ ఉమామహేశ్వరి, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement