చిరువ్యాపారులపై కనికరం చూపండి
చిరువ్యాపారులపై కనికరం చూపండి
Published Tue, May 16 2017 12:20 AM | Last Updated on Sat, Sep 15 2018 8:05 PM
కౌన్సిల్‌లో సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ l
కాంట్రాక్టర్లు అధికంగా వసూలు చేస్తున్నారు : ఎమ్మెల్సీ ఆదిరెడ్డి
‘అఖండ గోదావరి’కి బీపీఎస్ నిధులెలా కేటాయిస్తారు..? నిలదీసిన స్వతంత్ర, అధికారపార్టీ కార్పొరేటర్లు
సాక్షి, రాజమహేంద్రవరం : ఆశీల విషయంలో చిరు వ్యాపారులను దృష్టిలో పెట్టుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పాలక మండలి, అధికార యంత్రాంగానికి సూచించారు. ఆదివారం జరిగిన రాజమహేంద్రవరం నగరపాలక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. బడుగు జీవుల నుంచి వసూలు చేసే ఆశీలు నగరపాలక సంస్థకు పెద్ద ఆదాయ వనరు కాదని, అది వసూలు చేయకపోవడం వల్ల చిరు వ్యాపారులకు మేలు చేసిన వారమవుతామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి మాట్లాడుతూ కొంత మంది ఆశీల కాంట్రాక్టర్లు బడుగుజీవుల వద్ద నిర్ణయించిన రేట్ల కంటే అధికంగా వసూలు చేస్తున్నారని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. వారిని నిలువరించాలని పాలక మండలి, యంత్రాంగానికి సూచించారు.
ఇక్కడే ఏర్పాటు చేయాలి
గోదావరి అర్బ¯ŒS డెవలప్‌మెంట్ అథారిటీ(గుడా)ను నగరంలో ఏర్పాటు చేసుకునేలా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపుదామని చెప్పారు. నగరపాలకసంస్థ పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ఇంటర్‌లో కార్పొరేటర్ కాలేజీలలో చేర్చడం సరైన నిర్ణయం కాదన్నారు. అందరికీ ఇళ్లు పథకంలో 4200 ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసినా అవి కార్యరూపం దాల్చకపోవడం దారుణమన్నారు. తొలగించిన పారిశుద్ధ్య కార్మికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నిధులు అఖండ గోదావరి ప్రాజెక్టుకు సరికాదు
నగరంలోని అనధికారిక కట్టడాల క్రమబద్ధీకరణ పథకం(బీపీఎస్)ద్వారా వచ్చిన నిధులలో రూ.20కోట్లు అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేటాయించడం సరికాదని స్వతంత్ర కార్పొరేటర్ గొర్రెల సురేష్, టీడీపీ కార్పొరేటర్లు మర్రి దుర్గా శ్రీనివాస్, కోసూరి చండీ ప్రియ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఆ నిధులతో నగరంలోని పార్కుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ గొప్పగా చేసింది అని చెప్పుకోవడానికి ఈ ప్రాజెక్టు చేపట్టడం అవసరమన్నారు. మోరంపూడి–స్టేడియం రోడ్డుపై మున్సిపల్ ప్రిన్సిపల్ కమిషనర్‌కు మూడు తీర్మానాలు పంపారని, దానిపై గందరగోళం నెలకొందన్నారు.
ఆ రోడ్డును 80 అడుగులకు కుదించాలని కోరడంతో మేయర్ రజనీశేషసాయి సమ్మతించారు. ఆ మేరకు చర్యలు చేపట్టాలి్సందిగా కమిషనర్ విజయరామరాజుకు సూచించారు. తొలగించిన 31 మంది కార్మికులు 180 రోజులకుగాను 100 రోజులు విధులకు హాజరవ్వలేదని కమిషనర్ చెప్పారు. మరో పది మంది కూడా ఉన్నారన్నారు. వారిపై నిర్ణయం తీసుకునే అధికారం కౌన్సిల్ కమిషనర్‌కు ఇచ్చింది. అనంతరం అజెండాలోని 11 అంశాలను ఏకగ్రీంగా ఆమోదిస్తూ మండలి నిర్ణయం తీసుకుంది.
Advertisement