‘కాపు సత్యాగ్రహ యాత్ర’ పోస్టర్ ఆవిష్కరణ
‘కాపు సత్యాగ్రహ యాత్ర’ పోస్టర్ ఆవిష్కరణ
Published Mon, Nov 7 2016 11:05 PM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM
బోట్‌క్లబ్ (కాకినాడ) : స్థానిక కాపు కల్యాణమండపంలో సోమవారం ‘కాపు సత్యాగ్రహ యా త్ర’ పోస్టర్‌ను కాపు జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు, జిల్లా కాపు సద్భావన సంఘ అధ్యక్షులు వాసిరెడ్డి ఏసుదాసు మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చుతామని ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. తుని ఘటన కొన్ని దుష్టశక్తులు కారణంగా జరిగిందని స్పష్టం చేశారు. కాపు ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో తీసుకు వెళ్లేందుకు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కాపు జేఏసీ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 16 నుంచి రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ కాపు సత్యాగ్రహ యాత్ర నిర్వహిస్తున్నామని, అందరూ సహకరించాలన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలోను కాపు జేఏసీ ఏర్పాటుచేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తామని చెప్పారు. కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, కల్వకొనుల తాతాజీ, రావూరి వేంకటేశ్వర్‌ారవు, పసుపులేటి చంద్రశేఖర్, పేపకాయల రామకృష్ణ పాల్గొన్నారు
Advertisement
Advertisement