కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై లోక్‌సభ అనర్హత వేటుకు నిరసనగా ఆదివారం ఆ పార్టీ కార్యదర్మి ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలో కాంగ్రెస్ రాజ్‌ఘాట్ వద్ద సంకల్ప సత్యాగ్రహ దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రియాంక ఆ కార్యక్రమంలో ఉద్వేగభరితంగా చేసిన ప్రసంగాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇన్‌స్టాగ్రాంలో పంచుకున్నారు.
ఈ మేరకు ప్రియాంక గాంధీ ఆ ప్రసంగంలో.. "మూడు దశాబ్దాల నాటి సంఘటనను వివరించారు. సరిగ్గా 32 ఏళ్ల క్రితం మా నాన్న(రాజీవ్ గాంధీ) అంతక్రియల ఊరేగింపు తీన్‌మూర్తి భవన్ నుంచి బయలుదేరుతోంది. భద్రతా బెదిరింపులు ఉన్నప్పటికీ రాజ్‌ఘాట్‌కు వరకు తన తండ్రి అంత్యక్రియల ఊరేగింపుకి వెళ్లేందుకు ఎలా పట్టుబట్టారో తెలిపింది.
అప్పుడూ మా నాన్న మృతదేహాన్ని త్రివర్ణ పతాకంలో చుట్టారు. అలాంటి అమరవీరుడి తండ్రిని పార్లమెంటులో అవమానించారు. ఆ అమరవీరుడి కుమారుడిని మీరు దేశ వ్యతిరేకి అంటారు. ఈ సందర్భంగా ప్రియాంక పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ చర్చను ప్రస్తావిస్తూ.. ఈ కుటుంబం నెహ్రూ ఇంటి పేరు ఉపయోగించేందుకు ఎందుకు సిగ్గుపడుతున్నారో అంటూ హేళన చేశారు.
మోదీ తన వ్యాఖ్యలతో మొత్తం కుటుంబాన్నే గాక కాశ్మీర్ పండిట్ల సంప్రదాయాన్నే అవమానించారు. దీనికి మీపై ఎటువంటి కేసు లేదు. అలాగే రెండేళ్ల పదవీకాలంపై వేటు పడదు, అనర్హులుగా ప్రకటించరు కూడా. ఎందుకు ఇలా అని ప్రియాంక ఆగ్రహంగా ప్రశ్నించారు.
ఈ మేరకు రాహుల్ గాంధీ సత్యాగ్రహ దీక్షలో ప్రియాంక ప్రసంగించిన వీడియోని ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేస్తూ.. సత్యం, ధైర్యం, త్యాగం మా వారసత్వం. ఇదే మా బలం అని రాసుకొచ్చారు. కాగా, ఆమె ఆ ప్రసంగంలో.. అమరులైన ప్రధాని కుమారుడు, పైగా జాతీయ సమైక్యత కోసం వేలకిలోమీటర్లు నడిచిన మహోన్నత వ్యక్తి (రాహుల్) ఎప్పటికీ దేశాన్ని అవమానించలేడని ప్రియాంక గాంధీ నొక్కి చెప్పారు.
అంతేగాదు ఈ దేశ ప్రధాని పిరికివాడని, అధికారం వెనక దాక్కున్నాడంటూ ఘాటుగా విమర్శించారు. ఈ దేశ ప్రజలు కచ్చితంగా అలాంటి దురహంకారి రాజుకి తగిన విధంగా బుద్ధి చెబుతారని ఆమె అన్నారు.
(చదవండి: తేజస్వీ యాదవ్‌కు పుత్రికోత్సాహం! పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన రాచెల్)
Comments
Please login to add a commentAdd a comment