![Rahul Gandhi Visited St Joseph School In Few Months Back After Few Days They Visit Me In Delhi - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/6/Rahul.jpg.webp?itok=gSrLbpcu)
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ కొద్ది నెలలు క్రితం తమిళనాడులోని ముళగుమూడులోని సెయింట్ జోసెఫ్ పాఠశాలను సందర్శించారు. అక్కడ ఆయన ఆ స్కూల్‌పిల్లలతో కాసేపు ముచ్చటించడమే కాక వారితో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆ పాఠశాల విద్యార్థులు రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీ వచ్చారు.
(చదవండి: ఆమె గుండె చప్పుడు వినిపించడమే కాదు.. కనిపిస్తోంది కూడా!)
ఈ మేరకు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ...." నేను ప్రధాన మంత్రి అయితే మహిళా రిజర్వేషన్‌కి సంబంధించిన బిల్లుపైనే సంతకం చేస్తాను. అంతేకాదు మీ బిడ్డకు నేర్పించే మొదటి విషయం ఏమిటి అని నన్ను ఎవరైనా అడిగేతే వినయం అని చెబుతాను. ఎందుకంటే పిల్లలకు మొదట వినయం గురించి తెలుసుకుంటేనే వాళ్లు అన్నింటిని సులభంగా నేర్చుకోగలుగుతారు" అని అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కూడా విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.
(చదవండి: అబ్బా ఏం ఆడుతుంది...ఇది కదా ఆటంటే
Interaction and dinner with friends from St. Joseph’s Matric Hr. Sec. School, Mulagumoodu, Kanyakumari (TN). Their visit made Diwali even more special.
— Rahul Gandhi (@RahulGandhi) November 6, 2021
This confluence of cultures is our country’s biggest strength and we must preserve it. pic.twitter.com/eNNJfvkYEH
Comments
Please login to add a commentAdd a comment