సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చెన్నై పర్యటనలో భాగంగా బుధవారం విద్యార్థులతో సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశానికి ముందు ఆయన రాకను స్వాగతిస్తూ కాంగ్రెస్ పార్టీ ట్విటర్‌లో వనక్కమ్ రాహుల్ గాంధీ అనే యాష్ ట్యాగ్‌తో కొన్ని వీడియోలు పోస్ట్ చేశారు. ఓ వీడియో ఓ విద్యార్థిని రాహుల్ రాకకోసం ఎగ్జైట్ అవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆమె రాహుల్ రాక పట్ల ఎగ్జైట్ అవుతూ.. అతని కోసం వేచి ఉండలేకపోతున్నామని చెప్పడం సోషల్ మీడియాలో తెగహల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోపై కుళ్లు జోకులు పేలుతున్నాయి. ఇది స్డాండప్ కామెడీ మించిన ప్రోగ్రామని, ఆయన కామెడీ కోసం ఎవరైనా ఎదురు చూడాల్సిందేనంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
The excitement is palpable & the students can't wait for Congress President @RahulGandhi to arrive. #VanakkamRahulGandhi pic.twitter.com/cueB5gOaqk
— Congress (@INCIndia) March 13, 2019
Comments
Please login to add a commentAdd a comment