Sonia Gandhi Dances With Women Farmers In Haryana, Video Viral - Sakshi
Sakshi News home page

వీడియో: మహిళా రైతులతో భోజనం.. హుషారుగా సోనియా గాంధీ చిందులు

Jul 17 2023 8:30 AM | Updated on Jul 17 2023 11:24 AM

Sonia Gandhi Pure Joy Moments With women farmers Viral - Sakshi

యూపీఏ చైర్‌పర్సన్‌ చాలా కాలం తర్వాత హుషారుగా కనిపించారు.. 

ఢిల్లీ: యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ(76) చాలా కాలం తర్వాత హుషారుగా కనిపించారు. హర్యానాకు చెందిన మహిళా రైతులతో కలిసి భోజనం చేసిన ఆమె.. ఆపై సరదాగా గడిపి చిందులేశారు. ఆ సమయంలో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు. 

తాజాగా  రాహుల్‌ గాంధీ హర్యానా సోనిపాట్‌లో పర్యటించి.. అక్కడి రైతులతో కలిసి జన్‌కీ బాత్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆపై ఆయన ట్రాక్టర్‌ నడిపి.. నాట్లు సైతం వేశారు.  ఈ క్రమంలో అక్కడి కొందరు మహిళా రైతులు.. ఢిల్లీలోని రాహుల్‌ ఇంటిని చూడాలని ఉందని కోరారట. దీంతో.. వాళ్లను ఆదివారం ఇంటికి భోజనానికి ఆహ్వానించింది సోనియా కుటుంబం. 

కాంగ్రెస్‌ నేత రుచిరా చతుర్వేది తన ట్విటర్‌ హ్యాండిల్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ‘‘ఎలా ఉన్నారంటూ?..’ వాళ్లను రాహుల్‌ పలకరించడం.. సోనియా, రాహుల్‌, ప్రియాంక.. ముగ్గురూ వాళ్లతో భోజనం చేయడం, ప్రియాంకను వాళ్లు హత్తుకోవడం, ఇద్దరు మహిళా రైతులు ఆమె చేతుల్ని పట్టుకుని నృత్యం చేయాలని ముందుకు తేవడం, ఆమె సంతోషంగా చిందులేయడం అందులో చూడొచ్చు. స్వచ్ఛమైన ఆనందం అంటూ ఆ వీడియోను రుచిర పోస్ట్‌ చేశారు. 

ఇదిలా ఉంటే.. మోదీ ఇంటి పేరు వ్యాఖ్యల పరువు నష్టం దావాతో జైలుశిక్ష.. ఆపై లోక్‌సభ ఎంపీ సభ్యత్వం కోల్పోయారు రాహుల్‌ గాంధీ. దీంతో తన అధికారిక బంగ్లా ఖాళీ చేయాల్సి వచ్చింది. అయితే తాజాగా ఢిల్లీ మాజీ సీఎం, సీనియర్‌ నేత షీలా దీక్షిత్‌ పాత ఇంటికి రాహుల్‌ గాంధీ తన మకాం మార్చారు. తన శిక్షను రద్దు లేదా స్టే విధించాలని అభ్యర్థిస్తూ తాజాగా సుప్రీం కోర్టులో ఆయన పిటిషన్‌ కూడా వేశారు. మరోవైపు.. కేంద్రంలోని బీజేపీపై వ్యతిరేకతను ప్రదర్శించే క్రమంలో.. బెంగళూరులో జరగబోయే విపక్షాల ఐక్యతా సమావేశానికి సోనియా గాంధీ సైతం హాజరు కానున్నారు. 

ఇదీ చదవండి: కేజ్రీవాల్‌ను ఖుష్‌ చేసిన కాంగ్రెస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement