సూపర్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిక్రికెటర్‌గా తన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. అలాగే తన గ్యారేజీలో ఖర్జీదైన కార్ల విషయం, స్పోర్ట్స్ కార్లంటే కోహ్లికి ఉన్న పిచ్చి ప్రేమ కూడా తెలిసిన సంగతే. విదేశీ కార్లు, స్వదేశీ కార్లతో ఈ విషయంలో చాలా స్పెషల్‌గా ఉంటాడు. కింగ్ కోహ్లీగా పాపులర్ అయిన కోహ్లీ తనకిష్టమైన, ఫస్ట్ కారు గురించి గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది హాట్‌టాపిక్‌గా నిలిచింది. దీనిపై ఫ్యాన్స్ మళ్లీ మళ్లీ చర్చించుకుంటున్నారు.
రూ.1,000 కోట్లకు పైగా నికర విలువతో టాప్‌లో ఉన్న కోహ్లీ తొలి కారేంటో తెలుసా? మెర్సిడెస్ బెంజో , బీఎండబ్ల్యూనో, ఆడి కాఓ కాదు పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారైన టాటా సఫారీ. అవును ఈ విషయాన్ని కోహ్లీ స్వయంగా వెల్లడించాడు. ఈ కారును తన సొంత డబ్బుతో కొనుగోలు చేశాడట. సఫారీని ఎంచుకోవడానికి గల కారణాన్ని కూడా స్టార్ స్పోర్ట్స్‌తో కోహ్లీ వెల్లడించాడు. కేవలం ఫీచర్లే కాదు, దీని గుర్తింపు ఆధారంగా ఈ కారుపై మనసు పడినట్టు విరాట్ తెలిపాడు. ఒక సందర్భంలో ఈ కారులో డీజిల్‌కి బదులుగా పెట్రోల్ నింపడం, ఆతరువాత విషయం తెలిసి ట్యాంకుని ఖాళీ చేసిన సంగతులను కోహ్లీ గుర్తుచేసుకున్నాడు. (కొనుగోలుదారులకు టాటా మోటార్స్ షాక్)
జర్మన్ ఆటోమేకర్ ఆడికి బ్రాండ్ అంబాసిడర్‌గా అన్నవిరాట్ కోహ్లీ ఎక్కువ స్పేస్ ఉన్న కార్లంటే ఇష్టమని చెప్పాడు. ప్రస్తుతం కోహ్లీ చేతిలో ఆధునాతన కార్లులిస్ట్ ఒకసారి చూద్దాం. భారతదేశపు అత్యంత సంపన్న క్రీడాకారుడు, ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెట్ ఆటగాళ్ళలో ఒకరైన విరాట్ కోహ్లీ 22 కోట్లకుపై విలువైన ఆడి A8 L W12, బెంట్లీ కాంటినెంటల్ GT , ల్యాండ్ రోవర్ వోగ్‌తో సహా ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన కార్లను సొంతం చేసుకున్నాడు. (ప్రియుడి బర్త్‌డే బాష్: మలైకా డ్రెస్ ఖరీదెంతో తెలుసా?)
కోహ్లి గ్యారేజీలోని అత్యంత ఖరీదైన కార్లు
బెంట్లీ కాంటినెంటల్ GT, రూ. 4.04 కోట్లు
బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ రూ. 3.41 కోట్లు
ఆడి R8 LMX లిమిటెడ్ ఎడిషన్, రూ. 2.97 కోట్లు
ఆడి ఆర్8 వి10 రూ. 2.97 కోట్లు అత్యంత వేగవంతమైన కారు
ఆడి A8L W12 క్వాట్రో ధర: రూ. 1.87 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment