దుబాయ్: గతేడాది నిర్వహించిన వన్డే ప్రపంచకప్ భారత దేశానికి గణనీయమైన ఆర్ధిక లబ్ధిని చేకూర్చిందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మెగా ఈవెంట్ ఆర్థికంగా పెద్ద ప్రభావమే చూపిందని, విదేశీ పర్యాటకులతో భారత్‌లోని ఆతిథ్య రంగం పెద్ద ఎత్తున లాభపడిందని అందులో వివరించింది.
గత అక్టోబర్, నవంబర్‌లో జరిగిన ఈ మెగా టోర్నీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది. ‘ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ క్రికెట్‌కు ఉన్న ఆర్ధిక శక్తి ఎలాంటిదో నిరూపించింది. ఆతిథ్య భారత్ 1.39 బిలియన్ అమెరికా డాలర్ల (రూ.11, 637 కోట్లు) ఆదాయం ఆర్జించేలా చేసింది.
ఈ వరల్డ్‌కప్‌ను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు భారత్‌కు పోటెత్తారు. ఇలా పర్యాటకుల రాకతో ఆతిథ్య నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో హోటల్స్, భోజనం, వసతి, రవాణ, ఆహార పదార్థాలు, పానీయాల విక్రయంతో కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది’ అని ఐసీసీ ఆ నివేదికలో పేర్కొంది.
టోర్నీ జరిగింత కాలం కొనుగోలు శక్తి పెరిగిందని, టికెట్ల రూపంలోనూ భారీ ఆదాయం వచి్చందని, ఏకంగా 12.50 లక్షల మంది ప్రేక్షకులు క్రికెట్ మ్యాచ్‌ల్ని చూసేందుకు ఎగబడ్డారని అందులో తెలిపింది.
ఐసీసీ ప్రపంచకప్‌ల చరిత్రలోనే ఇది ఘననీయమైన వృద్ధని, సగటున 75 శాతం ప్రేక్షకుల హాజరు నమోదు కావడం ఇదే తొలిసారని ఐసీసీ తెలిపింది. పర్యాటకులు, దేశీ ప్రేక్షకులకు సేవలందించడం ద్వారా 48 వేల మంది ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ ఉద్యోగాలతో ఉపాధి పొందారని ఐసీసీ వివరించింది.
చదవండి: AUS vs ENG: హెడ్ విధ్వంసం.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్
Comments
Please login to add a commentAdd a comment