WC 2023: టికెట్‌ దొరకలేదా? పర్లేదు.. బీసీసీఐ గుడ్‌న్యూస్‌.. ఏకంగా.. | An announcement to fans from bcci | Sakshi
Sakshi News home page

WC 2023: టికెట్‌ దొరకలేదా? పర్లేదు.. బీసీసీఐ గుడ్‌న్యూస్‌.. ఏకంగా..

Published Thu, Sep 7 2023 2:03 AM | Last Updated on Thu, Sep 7 2023 8:39 AM

An announcement to fans from bcci - Sakshi

న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలనుకొని టికెట్లు దక్కని అభిమానులకు ఊరట కలిగించే ప్రకటన బీసీసీఐ నుంచి వచ్చింది. అభిమానుల కోసం మరో 4 లక్షల టికెట్లను అమ్మకానికి ఉంచుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ నెల 8న రాత్రి 8 గంటల నుంచి అధికారిక వెబ్‌సైట్‌  https://tickets.cricketworldcup.com లో టికెట్లు కొనుక్కోవచ్చు.

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది. టికెట్లు అమ్మకానికి ఉంచిన గంటల్లోనే ‘సోల్డ్‌ అవుట్‌’ అని రావడం, అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో రాష్ట్ర సంఘాలతో చర్చించి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఏ మ్యాచ్‌ కోసం ఎన్ని టికెట్లు అందుబాటులో ఉన్నాయో, అందులో భారత్‌ ఆడే మ్యాచ్‌లకు ఎంత శాతం టికెట్లు కేటాయించారనేదానిపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు.

చదవండి: Rohit Sharma: సిగ్గుపడాలి రోహిత్‌! నువ్వు చేసిన చెత్త పని ఏంటో తెలుస్తోందా? నెటిజన్స్‌ ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement