పుష్కర కాలం తర్వాత ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆక్టోబర్- నవంబర్‌లో ఈ మెగా ఈవెంట్ జరనుగంది. కాగా ఈ మెగా టోర్నీకి భారత్ పూర్తి స్థాయి ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. అంతకుముందు 2011 వన్డే ప్రపంచకప్‌ను బంగ్లాదేశ్, శ్రీలంకతో కలసి భారత్ నిర్వహించింది.
అదే విధంగా 1996, 1987లో కూడా మరోదేశంతో భారత్ హక్కులను పంచుకుంది. ఇక ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్- ఇంగ్లండ్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ షురూ కానుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది.
ప్రపంచ కప్ ప్రారంభోత్సవ వేడుక.. ఎప్పుడంటే?
కాగా వన్డే ప్రపంచకప్‌కు ముందు ప్రారంభోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 4న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీ జరగనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ఈ ప్రారంభోత్సవ వేడుకకు ఐసీసీ సభ్యులతో పాటు మిగితా క్రికెట్ బోర్డు మెంబర్స్‌ను కూడా ఆహ్హానించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా ఈ ప్రారంభ వేడుకలకు టోర్నీలో పాల్గొనే 10 జట్ల కెప్టెన్లు కూడా హాజరుకానున్నారు. కెప్టెన్లందరూ ఈ మెగా ఈవెంట్ ప్రారంభానికి ముందు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.
అప్పుడు బంగ్లాదేశ్‌లో..
సరిగ్గా 12 సంవత్సరాల క్రితం జరిగిన వన్డే ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్‌తో కలిసి సంయుక్తంగా భారత్ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ప్రపంచ కప్ ప్రారంభ వేడుకలు జరిగాయి.
కెప్టెనందరూ రిక్షాలో స్టేడియంకు వచ్చి అందరిని మంత్రముగ్ధులు చేశారు. ఈ సారి భారత్ కూడా ప్రత్యేకంగా ఈ ఆరంభ వేడుకలను నిర్వహించాలని భావిస్తున్నట్లు క్రిక్‌బజ్ తమ రిపోర్టులో పేర్కొంది. అయితే దీనిపై బీసీసీఐ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.
చదవండి: భారత ట్రిపుల్ సెంచరీ వీరుడి సంచలన నిర్ణయం.. ఇకపై!
Comments
Please login to add a commentAdd a comment