![Reports: BCCI Release Tickets-ICC Cricket World Cup 2023-August 10th - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/29/WC-2023.jpg.webp?itok=K1lJrKsI)
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు టీమిండియా గడ్డపై వన్డే వరల్డ్‌కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మ్యాచ్‌లు జరిగే వేదికలు, మ్యాచ్ షెడ్యూల్ వివరాలను బీసీసీఐ ప్రకటించింది. తాజాగా వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన మ్యాచ్‌ల టికెట్లను ఆగస్టు 10 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం.
బీసీసీఐ కార్యదర్శి జై షా గురువారం ఢిల్లీలో.. మ్యాచ్‌లు జరగనున్న అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లతో గురువారం మీటింగ్ నిర్వహించారు. మీటింగ్‌లో పలు అంశాలపై చర్చించిన అనంతరం టికెట్ల జారీ విషయమై కీలక ప్రకటన చేశారు. వన్డే వరల్డ్‌కప్‌లో జరిగే మ్యాచ్‌లకు హాజరయ్యే అభిమానులు తప్పనిసరిగా ఫిజికల్ టికెట్లు(పేపర్ ప్రింటెడ్) తీసుకెళ్లాలని.. ఆన్‌లైన్ టికెట్లను(ఈ-టికెటింగ్) అనుమతించబోమని పేర్కొన్నారు. కాగా అభిమానులు ఫిజికల్ టికెట్లను పొందడానికి 7-8 కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపాడు.
జై షా మాట్లాడుతూ.. ''మేం ఈసారి ఈ-టికెట్‌ని ఉపయోగించలేం. ఫిజికల్ టిక్కెట్లు పొందడానికి 7-8 కేంద్రాలు ముందుగానే ప్లాన్ చేశాం. అహ్మదాబాద్, లక్నో వంటి పెద్ద కెపాసిటీ స్టేడియంలలో ఈ-టికెట్ల నిర్వహణ చాలా కష్టం. మేం ముందుగా ద్వైపాక్షిక సిరీస్‌లలో ఈ-టికెటింగ్‌ని అమలు చేసి ఆపై ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నమెంట్‌లకు తీసుకెళ్లాలని మా ప్రణాళిక. ప్రపంచకప్ టిక్కెట్ల ధరతో సహా అన్నీ త్వరలో ప్రకటిస్తాం'' అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం ప్రోటోకాల్‌లో భాగంగా ఐసీసీ, బీసీసీఐలు ఒక్కో గేమ్‌కు 300 హాస్పిటాలిటీ టిక్కెట్‌లను అందుకోనున్నాయి. ఇక రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్‌లు ఐసీసీకి 1295 లీగ్ గేమ్ టిక్కెట్లతో పాటు.. టీమిండియాకు సంబంధించిన 1355 టికెట్లను.. వీటితో పాటు సెమీ-ఫైనల్ మ్యాచ్‌ల టిక్కెట్లను కూడా అందించనుంది. మరో 500 జనరల్ టిక్కెట్లను మాత్రం సదరు క్రికెట్ అసోసియేషన్స్ బీసీసీఐకి ఉచితంగా అందించనున్నాయి.
చదవండి: Babar Azam: 'బ్రా' ధరించిన పాక్ కెప్టెన్.. షాక్ తిన్న ఫ్యాన్స్; వీడియో వైరల్
అతడిని ఎందుకు తీసుకున్నట్లు? ఫిఫ్టీ సాధించడం గొప్పేమీ కాదు.. కొత్తగా ఏం ఒరిగింది: మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment