వన్డే ప్రపంచకప్-2023 భారత్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. దాదాపు పుషర్కకాలం తర్వాత ఈ ప్రధాన టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తోంది.
ఓవరాల్‌గా ఈ మెగా టోర్నీ భారత్‌లోని పది వేదికల్లో ఆక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది. అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‍కతా, చెన్నై, లక్నో, ధర్మశాల, పుణె, హైదరాబాద్ వేదికగా వరల్డ్ కప్ మ్యాచ్‍లు జరుగుతాయి.
పిచ్ క్యూరేటర్‌లకు ఐసీసీ కీలక సూచనలు
ఇక వరల్డ్‌కప్ నేపథ్యంలో ఆయా స్టేడియంల పిచ్ క్యూరేటర్‌లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వరల్డ్‌కప్ జరిగే ఆక్టోబర్-నవంబర్‌లో మంచు ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టు చర్యలు తీసుకోవాలని క్యూరేటర్‌లను ఐసీసీ సూచించింది. టాస్ విన్నింగ్‌లో మంచు ప్రభావం చూపకూడదనే భావనతో ఐసీసీ ఈ సూచనలు చేసింది.
బ్యాటింగ్, బౌలింగ్‌కు రెండింటికి అనుకూలించేలా వికెట్‌ను తయారు చేయాలని ఐసీసీ ఆదేశించింది. అందుకోసం పిచ్‌లపై ఎక్కువ గడ్డి ఉండేలా చర్యలు చేపట్టాలని ఐసీసీ పేర్కొంది. అదే విధంగా ప్రతీ స్టేడియం బౌండరీలు 70 మీటర్ల కంటే ఎక్కువ దూరం ఉండాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సూచింది. అంతేకాకుండా ప్రపంచకప్ మ్యాచ్‍లు జరిగే మైదానాల్లో ఔట్ ఫీల్డ్ వేగంగా ఉండేలా చూడాలని ఐసీసీ తెలిపింది.
చదవండి: Asian Games 2023: మలేషియాతో మ్యాచ్ రద్దు.. సెమీఫైనల్‌కు చేరిన టీమిండియా
Comments
Please login to add a commentAdd a comment