యూకే పర్యటనలో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. స్కాట్లాండ్‌తో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో సిరీస్‌ను కూడా విజయంతో ఆరంభించింది. సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి టీ20లో 28 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.
180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో లివింగ్‌స్టోన్(37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో సీన్ అబాట్ 3 వికెట్లు పడగొట్టగా.. హాజిల్ వుడ్, జంపా తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు బ్రాట్‌లెట్, గ్రీన్, స్టోయినిష్ చెరో వికెట్ పడగొట్టారు.
హెడ్ విధ్వంసం..
ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 19.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 23 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 59 పరుగులు చేశాడు.
అతడితో పాటు మాథ్యూ షార్ట్(41), ఇంగ్లిష్(37) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో లివింగ్‌స్టోన్ 3 వికెట్లు పడగొట్టగా.. ఆర్చర్, మహ్మద్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఇరు జట్ల మధ్య రెండో టీ20 సెప్టెంబర్ 13న కార్డిప్ వేదికగా జరగనుంది.
చదవండి: Duleep Trophy 2024: రింకూ, శ్రేయస్, సుందర్‌లపై దృష్టి
Comments
Please login to add a commentAdd a comment