జిప్సీ అవుట్.. సఫారీ ఇన్
జిప్సీ అవుట్.. సఫారీ ఇన్
Published Sat, Dec 10 2016 3:49 PM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM
న్యూఢిల్లీ : ఆర్మీ వాహనాలుగా గత 25 ఏళ్లుగా సేవలందిస్తున్న మారుతీ జిప్సీ రిటైర్ కాబోతుంది. ఈ ఐకానిక్ మారుతీ జిప్సీ స్థానంలో కొత్త రేంజ్లోని ఎస్యూవీలు ఆర్మీ కొత్త వాహనాలుగా ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. వీటికోసం టాటా సఫారీ స్టోర్మ్లను తమ కొత్త వాహనాలుగా ఆర్మీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మొదటగా 3198 వాహనాలకు టాటా మోటార్స్కు ఆర్మీ ఆర్డర్ ఇచ్చిందని... వచ్చే ఏళ్లలో వీటిని 10 సార్లు పెంచబోతుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఆర్మీకి వాహనాలు అందించడానికి మహింద్రా అండ్ మహింద్రా, టాటా మోటార్స్ పోటాపోటీగా తలపడ్డాయి. మహింద్రా అండ్ మహింద్రా తన స్కార్పియో ఎస్యూవీలను ఆర్మీకి ఆఫర్ చేసింది. కానీ ఈ బిడ్ను టాటా మోటార్స్ కైవసం చేసుకుంది.
కొత్త వాహనాల కోసం ఆర్మీ 2013లో మొదటి బిడ్ జారీచేసింది. ఆర్మీ నిర్వహించిన అన్నీ టెక్నికల్ ట్రయల్స్లో ఈ రెండు కంపెనీలు మెరుగైన ప్రదర్శననే కనబర్చాయి.. అయితే టాటా గ్రూప్ మంచి ఫైనాన్సియల్ డీల్ను ఆర్మీ ముందుంచడంతో టాటా మోటార్స్ వెహికిల్స్కే ఆర్మీ మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. దీంతో జిప్సీ స్థానంలో టాటా సఫారీలు ఆర్మీ వాహనాలుగా ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఇంకా దీనిపై ఆర్మీ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ డీల్ టాటా మోటార్స్కు ఈ ఏడాదిలో రెండో మేజర్ డీల్ కాబోతుంది. ఇప్పటికే ఆర్మీకి అత్యాధునికమైన మిలటరీ ట్రక్కులను అందించడానికి జనవరిలో రూ.1,300 కోట్లను డీల్ను టాటా మోటార్స్ కుదుర్చుకుంది. ప్రస్తుతం 30,000 మారుతీ జిప్సీలు ఆర్మీ వాహనాలుగా సేవలందిస్తున్నాయి.
Advertisement
Advertisement