హ్యుందాయ్‌ ‘ఆరా’.. ఆగయా | Hyundai Aura compact sedan revealed | Sakshi
Sakshi News home page

హ్యుందాయ్‌ ‘ఆరా’.. ఆగయా

Dec 20 2019 6:16 AM | Updated on Dec 20 2019 6:16 AM

Hyundai Aura compact sedan revealed - Sakshi

చెన్నై: హ్యుందాయ్‌ మోటార్‌ కంపెనీ తన కొత్త కాంపాక్ట్‌ సెడాన్‌ ‘ఆరా’ను ఆవిష్కరించింది. ఈ సెడాన్‌ను వచ్చే నెలలో మార్కెట్లోకి ప్రవేశపెడతామని హ్యుందాయ్‌ ఇండియా తెలియజేసింది. ఈ సెగ్మెంట్లో ఎక్సెంట్‌ తర్వాత ఈ కంపెనీ అందిస్తున్న మరో కారు ఇది. స్పోర్ట్స్‌ యుటిలిటి వెహికల్‌ (ఎస్‌యూవీ), కాంపాక్ట్‌ హ్యాచ్‌బాక్‌ సెగ్మెంట్లలో మంచి అమ్మకాలు సాధిస్తున్నామని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ ఎస్‌.ఎస్‌. కిమ్‌ పేర్కొన్నారు. కాంపాక్ట్‌ సెడాన్‌ సెగ్మెంట్లో వెనకబడి ఉన్నామని, కొత్త ఆరా కారుతో ఆ సెగ్మెంట్లో కూడా మంచి అమ్మకాలు సాధించగలమని ఆయన ధీమా వ్యక్తంచేశారు.

బీఎస్‌ 6 పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఈ కారును రూపొందించామని, పెట్రోల్, డీజిల్‌ వేరియంట్లలో ఇది లభ్యమవుతుందని చెప్పారాయన. ఆటోమేటిక్‌ ట్రాన్సిమిషన్, వైర్లెస్‌ చార్జింగ్, డ్రైవర్‌ రియర్‌ వ్యూ మానిటర్, స్వెప్ట్‌బ్యాక్‌ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్, బూమరాంగ్‌ షేప్‌లో ఉండే ఎల్‌ఈడీ డే రన్నింగ్‌ లైట్స్‌ తదితర ఫీచర్లున్నాయని తెలియజేశారు.  కాగా ఈ కారు ధర వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల (ఎక్స్‌షోరూమ్‌ ధరలు) శ్రేణిలో ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ కారు మారుతీ డిజైర్, హోండా అమేజ్, ఫోక్స్‌వ్యాగన్‌ అమియో, ఫోర్డ్‌ ఆస్పైర్, టాటా టిగొర్, టొయోటా యారీలకు గట్టి పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement