petrol variant
-
హోండా సిటీ : కొత్త వేరియంట్స్
సాక్షి, ముంబై: హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సిఐఎల్) తన పాపులర్ సెడాన్ హోండా సిటీ 2020ని మంగళవారం లాంచ్ చేసింది. హోండీ సిటీ కి చెందిన నాల్గవ తరం రెండు పెట్రోల్ వేరియంట్లను తాజాగా ఆవిష్కరించింది. 9.29 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) నుంచి ప్రారంభధరగా నిర్ణయించింది. ఇటీవలే హోండా సిటీ సెడాన్ సరికొత్త 5 వ తరం వెర్షన్‌ను విడుదల చేసిన సంస్థ, 4 వ తరం కారును ఎస్ వీ, వి గ్రేడ్ అనే రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. బీఎస్ -6 ప్రమాణాలకనుగుణంగా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో (మాన్యువల్ ట్రాన్స్ మిషన్) ఈ కారును అందుబాటులోకి తెచ్చింది. బీఎస్ -6 ప్రమాణాలతో , సమకాలీన స్టైలింగ్‌తో తమ పాపులర్ మోడల్ 4వ తరం హోండా సిటీ అమ్మకం కొనసాగించాలని ఆశిస్తున్నామని హెచ్‌సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ , మార్కెటింగ్ అండ్ సేల్స్ డైరెక్టర్ రాజేష్ గోయెల్ తెలిపారు. (చదవండి : ఒకినావా ఆర్30 ఈ స్కూటర్) -
విటారా బ్రెజా కొత్త వేరియంట్
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ తన పాపులర్ ఎస్యూవీ మోడల్, విటారా బ్రెజాలో పెట్రోల్ వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ధరలు రూ.7.34 లక్షల నుంచి రూ.11.4 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) రేంజ్లో నిర్ణయించామని మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ ఎమ్డీ, సీఈఓ కెనిచి అయుకవ చెప్పారు. బీఎస్–సిక్స్ పెట్రోల్ విటారా బ్రెజాను 1.5 లీటర్ కె–సిరీస్ ఇంజిన్‌తో రూపొందించామని పేర్కొన్నారు. పెట్రోల్ వేరియంట్లో 5 గేర్లు(మాన్యువల్) వెర్షన్‌తో పాటు ఏఎమ్‌టీ(ఆటోమేటిక్ ట్రాన్సిషన్)ను కూడా అందిస్తున్నామని తెలిపారు. డీజిల్ కార్లకు టాటా... ఈ కొత్త విటారా బ్రెజాకు వినియోగదారుల నుంచి మంచి స్పందనే లభించగలదన్న ధీమాను కెనిచి అయుకవ వ్యక్తం చేశారు. బీఎస్–సిక్స్ పర్యావరణ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుండటంతో డీజిల్ ఇంజిన్ కార్ల ఉత్పత్తి నుంచి వైదొలుగుతున్నామని తెలిపారు. విటారా బ్రెజాలో డీజిల్ వేరియంట్‌ను దశలవారీగా ఉపసంహరిస్తామని వివరించారు. 2016లో విటారా బ్రెజా (డీజిల్) మోడల్‌ను మారుతీ సుజుకీ కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది. అనతికాలంలోనే యుటిలిటి వెహికల్ సెగ్మెంట్లో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకూ ఐదు లక్షల విటారా బ్రెజాలు అమ్ముడయ్యాయి. -
హ్యుందాయ్ ‘ఆరా’.. ఆగయా
చెన్నై: హ్యుందాయ్ మోటార్ కంపెనీ తన కొత్త కాంపాక్ట్ సెడాన్ ‘ఆరా’ను ఆవిష్కరించింది. ఈ సెడాన్‌ను వచ్చే నెలలో మార్కెట్లోకి ప్రవేశపెడతామని హ్యుందాయ్ ఇండియా తెలియజేసింది. ఈ సెగ్మెంట్లో ఎక్సెంట్ తర్వాత ఈ కంపెనీ అందిస్తున్న మరో కారు ఇది. స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ (ఎస్యూవీ), కాంపాక్ట్ హ్యాచ్‌బాక్ సెగ్మెంట్లలో మంచి అమ్మకాలు సాధిస్తున్నామని కంపెనీ ఎమ్డీ, సీఈఓ ఎస్.ఎస్. కిమ్ పేర్కొన్నారు. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో వెనకబడి ఉన్నామని, కొత్త ఆరా కారుతో ఆ సెగ్మెంట్లో కూడా మంచి అమ్మకాలు సాధించగలమని ఆయన ధీమా వ్యక్తంచేశారు. బీఎస్ 6 పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఈ కారును రూపొందించామని, పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఇది లభ్యమవుతుందని చెప్పారాయన. ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, వైర్లెస్ చార్జింగ్, డ్రైవర్ రియర్ వ్యూ మానిటర్, స్వెప్ట్‌బ్యాక్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, బూమరాంగ్ షేప్‌లో ఉండే ఎల్ఈడీ డే రన్నింగ్ లైట్స్ తదితర ఫీచర్లున్నాయని తెలియజేశారు. కాగా ఈ కారు ధర వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల (ఎక్స్‌షోరూమ్ ధరలు) శ్రేణిలో ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ కారు మారుతీ డిజైర్, హోండా అమేజ్, ఫోక్స్‌వ్యాగన్ అమియో, ఫోర్డ్ ఆస్పైర్, టాటా టిగొర్, టొయోటా యారీలకు గట్టి పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
ఆడి ‘ఏ6 మ్యాట్రిక్స్’లో పెట్రోల్ వేరియంట్
ధర రూ.52.75 లక్షలు న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘ఆడి’ తన ‘ఏ6 మ్యాట్రిక్స్ 35 టీఎఫ్ఎస్ఐ’ సెడాన్ కారు మోడల్లో తాజాగా పెట్రోల్ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.52.75 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఇందులో 1.8 లీటర్ పెట్రోల్ ఇం జిన్, 7 స్పీడ్ ట్రాన్స్మిషన్, అడ్వాన్స్డ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 8 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలేషన్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ డిస్ప్లే వంటి ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని 7.9 సెకన్లలో అందుకుంటుందని తెలిపింది. -
మెర్సిడెస్ అన్ని మోడళ్లలో పెట్రోల్ వేరియంట్లు!
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్-బెంజ్’ తాజాగా తను భారత్‌లో విక్రయించిన అన్ని మోడళ్లకీ పెట్రోల్ వేరియంట్లను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే నెలలో ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశముంది. జీఎల్ఈ 400లో పెట్రోల్ వేరియంట్ కంపెనీ తాజాగా తన పాపులర్ ఎస్యూవీ ‘జీఎల్ఈ 400’లో పెట్రోల్ వేరియంట్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ.74.90 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. ఇందులో శక్తివంతమైన 2,996 సీసీ ఇంజిన్‌ను అమర్చారు. ఎస్యూవీ విభాగంలో పెట్రోల్ వేరియంట్ల పోర్ట్‌ఫోలియోను విస్తరించాలనే లక్ష్యంలో భాగంగా ఈ వెహికల్‌ను మార్కెట్లోకి తెచ్చామని కంపెనీ పేర్కొంది. కంపెనీ మొత్తం వాహన విక్రయాల్లో ప్రస్తుతం 20 శాతంగా ఉన్న పెట్రోల్ వేరియంట్ల విక్రయాలు రానున్న కాలంలో 30%కి చేరొచ్చని అంచనా వేసింది. -
వోల్వో కొత్త స్పోర్ట్స్ సెడాన్
- ఎనిమిది గేర్ల కారు - ధర రూ.42 లక్షలు చెన్నై: వోల్వో కంపెనీ కొత్త స్పోర్ట్స్ సెడాన్-ఎస్60 టీ26 పెట్రోల్ వేరియంట్‌ను శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఎనిమిది గేర్లు(ఆటోమాటిక్)తో కూడిన ఈ కారు ధర రూ.42 లక్షలని(ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ) వోల్వో ఆటో ఇండియా ఎండీ, టామ్ వాన్ బాన్స్డాఫ్ చెప్పారు. 306 హార్స్పవర్ ఉన్న ఈ కారు జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీలైన ఆడి, బీఎండబ్ల్యూ బ్రాండ్ కార్లకు గట్టిపోటీనిస్తుందని పేర్కొన్నారు. గతేడాది 1,200 కార్లు విక్రయించామని, లగ్జరీ కార్ల మార్కెట్లో తమ వాటా 3.5% ఉందని తెలిపారు. వోల్వో కంపెనీ ప్రస్తుతం ఐదు లగ్జరీ మోడళ్లను-స్పోర్టీ సెడాన్ ఎస్60, ఎలిగెంట్ ఎస్80, లగ్జరీ హ్యాచ్‌బాక్ వీ40, వీ40 క్రాస్ కంట్రీ, లగ్జరీ ఎస్యూవీ ఎక్స్‌సీ60, 7 సీట్ల లగ్జరీ ఎస్యూవీ ఎక్స్‌సీ90 లను భారత్‌లో విక్రయిస్తోంది. -
మహీంద్రా నుంచి పెట్రోల్ కార్లు
కంపెనీ ప్రెసిడెంట్ పవన్ గోయెంకా కోల్‌కత: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రయాణికుల కార్ల సెగ్మెంట్లో పెట్రోల్ వేరియంట్లను అందించనున్నది. డీజిల్‌పై నియంత్రణ తొలగడం, చమురు ధరలు తగ్గుతుండడం వంటి కారణాల వల్ల డీజిల్ కార్లకు ప్రాధాన్యత తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ అన్ని డీజిల్ కార్లనే అందిస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ పెట్రోల్ ఇంజిన్లతో కూడిన ప్రయాణికుల కార్లను అందించాలని యోచిస్తోంది. భవిష్యత్తులో ప్రయాణికుల కార్ల సెగ్మెంట్లో పెట్రోల్, డీజిల్ వేరియంట్లను సమానంగా అందిస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్(ఆటోమొబైల్, ఫార్మ్ ఎక్విప్మెంట్) పవన్ గోయెంకా చెప్పారు. తాము ఇప్పటికే 1.2 లీటర్, 1.6 లీటర్, 2.2 లీటర్లలో పెట్రోల్ ఇంజిన్లను అభివృద్ధి చేశామని వివరించారు. అయితే ఫుల్ సైజ్ ఎస్యూవీ వాహనాలను మాత్రం డీజిల్ వేరియంట్లలోనే అందిస్తామని పేర్కొన్నారు. స్పోర్ట్స్‌యుటిలిటి వెహికల్స్(ఎస్యూవీ), యుటిలిటి వెహికల్స్(యూవీ)లకే ప్రాధాన్యత ఇస్తామని, ప్రయాణికుల వాహనాలకు కాదని స్పష్టం చేశారు. ఇప్పుడు డీజిల్ వేరియంట్లోనే అందిస్తున్న తమ ఏకైక ప్రయాణికుల కారు వెరిటోను త్వరలో ఎలక్ట్రిక్ వేరియంట్లో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. దీంతో పాటు తేలిక రకం వాణిజ్య వాహనం (ఎల్సీవీ), మాక్సిమోను కూడా ఎలక్ట్రిక్ మోడల్లో అందిస్తామని వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలను నార్వే, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వంటి పశ్చిమ యూరప్ దేశాలకు ఎగుమతి చేయాలని యోచిస్తున్నామని గోయెంకా తెలిపారు. తమ ఎలక్ట్రిక్ వాహనాలు ఆశించిన అమ్మకాలు సాధించడం లేదని అంగీకరించారు. ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లకు రాష్ట్రప్రభుత్వాలు తగిన తోడ్పాటునివ్వడం లేదని చెప్పారు. -
జాగ్వార్ ఎక్స్‌జే @ రూ. 93.24 లక్షలు
న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ దేశీయంగా తయారు చేసిన జాగ్వార్ ఎక్స్‌జే 2.0 ఎల్ లగ్జరీ కారును మంగళవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ పెట్రోల్ లగ్జరీ సలూన్ ధర రూ.93.24 లక్షలని (ఎక్స్ షోరూమ్, ముంబై) జేఎల్ఆర్ వైస్ ప్రెసిడెంట్ రోహిత్ సూరి తెలిపారు. ఈ సెగ్మెంట్లో 2.0 లీ. పెట్రోల్ ఇంజిన్‌తో దేశీయంగా తయారైన లగ్జరీ కారు ఇదేనని వివరించారు. పుణే ప్లాంట్‌లో తయారు చేసిన ఈ కారులో వివిధ లగ్జరీ ఫీచర్లున్నాయని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో వెనకవైపు సీట్లను అడ్జెస్ట్ చేసుకోవచ్చని, మూడు ఇంటెన్సిటీ సెట్టింగ్‌లతో కూడిన మస్సాజ్ ఫంక్షన్ కూడా ఉందని, వెనక భాగంలో అధికమైన హెడ్‌రూమ్, 10 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్లు రెండు(ముందు సీట్ల వెనక భాగంలో), ఎలక్ట్రిక్ రియర్ సైడ్ విండో బ్లైండ్స్, 825 వాట్ల మెరిడియన్ ఆడియో సిస్టమ్, ఎల్ఈడీ రీడింగ్ లైట్లు, వెనక వరుసలో బిజినెస్ టేబుళ్లు తదితర ఫీచర్లున్నాయని వివరించారు. ఈ ఏడాది మొదట్లో దేశీయంగా తయారు చేసిన జాగ్వార్ ఎక్స్‌జే 3.0లీ. డీజిల్ లగ్జరీ కారును అందించామని పేర్కొన్నారు. ఆ కారుకు మంచి స్పందన వస్తోందని, ఆ ఉత్సాహాంతోనే తాజాగా ఈ కారును అందిస్తున్నామని రోహిత్ సూరి వివరించారు.