వోల్వో కొత్త స్పోర్ట్స్ సెడాన్ | Volvo S60 T6 Launched in India | Sakshi
Sakshi News home page

వోల్వో కొత్త స్పోర్ట్స్ సెడాన్

Published Sat, Jul 4 2015 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 AM

వోల్వో  కొత్త స్పోర్ట్స్ సెడాన్

వోల్వో కొత్త స్పోర్ట్స్ సెడాన్

- ఎనిమిది గేర్ల కారు  
- ధర రూ.42 లక్షలు
చెన్నై:
వోల్వో కంపెనీ కొత్త స్పోర్ట్స్ సెడాన్-ఎస్60 టీ26 పెట్రోల్ వేరియంట్‌ను శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఎనిమిది గేర్లు(ఆటోమాటిక్)తో కూడిన ఈ కారు ధర రూ.42 లక్షలని(ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ) వోల్వో ఆటో ఇండియా ఎండీ, టామ్ వాన్ బాన్స్‌డాఫ్ చెప్పారు.  306 హార్స్‌పవర్ ఉన్న ఈ కారు జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీలైన ఆడి, బీఎండబ్ల్యూ బ్రాండ్ కార్లకు గట్టిపోటీనిస్తుందని పేర్కొన్నారు.  గతేడాది 1,200 కార్లు విక్రయించామని, లగ్జరీ కార్ల మార్కెట్లో తమ వాటా 3.5% ఉందని తెలిపారు.  వోల్వో కంపెనీ ప్రస్తుతం ఐదు లగ్జరీ మోడళ్లను-స్పోర్టీ సెడాన్ ఎస్60, ఎలిగెంట్ ఎస్80, లగ్జరీ హ్యాచ్‌బాక్ వీ40, వీ40 క్రాస్ కంట్రీ, లగ్జరీ ఎస్‌యూవీ ఎక్స్‌సీ60, 7 సీట్ల లగ్జరీ ఎస్‌యూవీ ఎక్స్‌సీ90 లను భారత్‌లో విక్రయిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement