వోల్వో కొత్త స్పోర్ట్స్ సెడాన్
- ఎనిమిది గేర్ల కారు
- ధర రూ.42 లక్షలు
చెన్నై: వోల్వో కంపెనీ కొత్త స్పోర్ట్స్ సెడాన్-ఎస్60 టీ26 పెట్రోల్ వేరియంట్‌ను శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఎనిమిది గేర్లు(ఆటోమాటిక్)తో కూడిన ఈ కారు ధర రూ.42 లక్షలని(ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ) వోల్వో ఆటో ఇండియా ఎండీ, టామ్ వాన్ బాన్స్డాఫ్ చెప్పారు. 306 హార్స్పవర్ ఉన్న ఈ కారు జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీలైన ఆడి, బీఎండబ్ల్యూ బ్రాండ్ కార్లకు గట్టిపోటీనిస్తుందని పేర్కొన్నారు. గతేడాది 1,200 కార్లు విక్రయించామని, లగ్జరీ కార్ల మార్కెట్లో తమ వాటా 3.5% ఉందని తెలిపారు. వోల్వో కంపెనీ ప్రస్తుతం ఐదు లగ్జరీ మోడళ్లను-స్పోర్టీ సెడాన్ ఎస్60, ఎలిగెంట్ ఎస్80, లగ్జరీ హ్యాచ్‌బాక్ వీ40, వీ40 క్రాస్ కంట్రీ, లగ్జరీ ఎస్యూవీ ఎక్స్‌సీ60, 7 సీట్ల లగ్జరీ ఎస్యూవీ ఎక్స్‌సీ90 లను భారత్‌లో విక్రయిస్తోంది.