
మెర్సిడెస్ అన్ని మోడళ్లలో పెట్రోల్ వేరియంట్లు!
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్-బెంజ్’ తాజాగా తను భారత్‌లో విక్రయించిన అన్ని మోడళ్లకీ పెట్రోల్ వేరియంట్లను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే నెలలో ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
జీఎల్‌ఈ 400లో పెట్రోల్ వేరియంట్ కంపెనీ తాజాగా తన పాపులర్ ఎస్‌యూవీ ‘జీఎల్‌ఈ 400’లో పెట్రోల్ వేరియంట్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ.74.90 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. ఇందులో శక్తివంతమైన 2,996 సీసీ ఇంజిన్‌ను అమర్చారు. ఎస్‌యూవీ విభాగంలో పెట్రోల్ వేరియంట్ల పోర్ట్‌ఫోలియోను విస్తరించాలనే లక్ష్యంలో భాగంగా ఈ వెహికల్‌ను మార్కెట్‌లోకి తెచ్చామని కంపెనీ పేర్కొంది. కంపెనీ మొత్తం వాహన విక్రయాల్లో ప్రస్తుతం 20 శాతంగా ఉన్న పెట్రోల్ వేరియంట్ల విక్రయాలు రానున్న కాలంలో 30%కి చేరొచ్చని అంచనా వేసింది.