సాక్షి, ముంబై: మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ హ్యాచ్‌బ్యాక్ కారు స్విఫ్ట్‌లో అప్‌డేట్ వెర్షన్‌ను తీసుకొచ్చింది. 2021 స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్‌ను దేశంలో విడుదల చేసింది. దీని ధర 5.73 లక్షలు (ఎక్స్-షోరూమ్,న్యూఢిల్లీ) నుండి ప్రారంభం. జనాదరణ పొందిన మారుతి స్విఫ్ట్ కారు ఇంటీరియర్ డిజైన్, కాస్మొటిక్స్ మార్పులతోపాటు భద్రతాపరంగా మెరుగైన ఫీచర్లను జోడింది. 10.67 సెం.మీ మల్టీ-ఇన్ఫర్మేషన్ కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, కొత్త గ్రిల్, మోడల్ కాంట్రాస్ట్ రూఫ్, కొత్త డ్యూయల్-టోన్ ఎక్స్‌టిరియర్ లాంటి అప్‌గ్రేడ్స్ ఉన్నాయి.
కొత్త స్విఫ్ట్‌లో ఐడిల్ స్టార్ట్ స్టాప్ (ఐఎస్ఎస్) టెక్నాలజీతో నెక్ట్స్ జనరేషన్ కే-సిరీస్ డ్యూయల్ జెట్ డ్యూయల్ వీవీటీ ఇంజిన్ అందించినట్టు మారుతి సుజుకి ప్రకటించింది. అలాగే కూల్డ్ ఎగ్జాస్ట్ గ్యాస్ రీరిక్యులేషన్ (ఇజిఆర్) వ్యవస్థతో పాటు కొత్త స్విఫ్ట్ తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తుందని, అధిక ఇంధన సామర్థ్యం దీని సొంతమని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment