మార్కెట్లోకి మరో కొత్త మోడల్ బెంజ్ కారు!
Published Mon, Dec 2 2013 6:03 PM | Last Updated on Sat, Sep 2 2017 1:11 AM
కొత్త లగ్జరీ కారును జర్మనీ కార్ల ఉత్పత్తి సంస్థ మెర్సిడేజ్ బెంజ్ మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. ఎస్ఎల్ కే 55 ఏఎమ్ జీ అనే మోడల్ కారును ప్రవేశపెట్టినట్టు బెంజ్ ఇండియా మేనేజర్ తెలిపారు. ఎక్స్ షో రూమ్ ధర 1.26 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు.
రెండు సీట్లు, 5.5 లీటర్ల వీ8 పెట్రోల్ ఇంజన్ దీని ప్రత్యేకత అని తెలిపారు. భారత్ లో ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన కార్లలో ఇది ఎనిమిదవది అని తెలిపారు. భారత వినియోగదారుల కోసం తమ గ్లోబల్ పోర్ట్ ఫోలియో నుంచి ప్రత్యేకంగా అందించామని సీఈఓ ఎబెర్ హార్డ్ కెర్న్ తెలిపారు.
ఈ సంవత్సరంలో కాంపాక్ట్ లగ్జరీ కార్ ఏ క్లాస్, బీ క్లాస్ డీజిల్, జీఎల్ క్లాస్ లు ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన వాటిలో ఉన్నాయి. బెంజ్ కార్లకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది అని కెర్న్ సంతోషం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement