మెర్సిడెస్‌ బెంజ్‌ నుంచి అదిరిపోయే హ్యాచ్‌బ్యాక్‌ కార్‌..! ధర ఎంతంటే..? | Mercedes-Benz India Launches New Luxury Hatchback | Sakshi
Sakshi News home page

Mercedes-Benz: మెర్సిడెస్‌ బెంజ్‌ నుంచి అదిరిపోయే హ్యాచ్‌బ్యాక్‌ కార్‌..! ధర ఎంతంటే..?

Published Sat, Nov 20 2021 8:48 PM | Last Updated on Sat, Nov 20 2021 9:01 PM

Mercedes-Benz India Launches New Luxury Hatchback - Sakshi

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌-బెంజ్‌ భారత మార్కెట్లలోకి సరికొత్త హ్యాచ్‌బ్యాక్‌ కారును శుక్రవారం (నవంబర్‌ 19)న లాంచ్‌ చేసింది. ఏఎమ్‌జీ ఏ 45ఎస్‌ 4మ్యాటిక్‌ప్లస్‌ ఎడిషన్‌ హ్యచ్‌బ్యాక్‌ కారును మెర్సిడెస్‌ బెంజ్‌ విడుదల చేసింది. ఈ కారు ధర రూ. 79.50 లక్షలుగా(ఎక్స్‌ షోరూమ్‌) ఉండనుంది. 

ఈ కారు ఇంజిన్‌ విషయానికి వస్తే..టర్బోఛార్జ్‌డ్‌ ఫోర్‌ సిలిండర్‌ ఇంజిన్‌ను కారులో అమర్చారు. 3.9 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠ వేగం గంటకు 270 కి.మీలుగా ఉంది.

హ్యచ్‌ బ్యాక్‌ కారు లాంచ్‌తో   ఏ-క్లాస్‌ పోర్ట్‌ఫోలియోను మరింతగా బలోపేతం చేస్తున్నామని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరక్టర్‌, సీఈవో మార్టిన్‌ వెల్లడించారు . అంతేకాకుండా  దేశంలోనే అత్యంత వేగవంతమైన హ్యచ్‌బ్యాక్‌ కార్లలో  ఏఎమ్‌జీ ఏ 45ఎస్‌ 4మ్యాటిక్‌ప్లస్‌ నిలుస్తోందని తెలిపారు. ఈ కొత్త కారును మెర్సిడెస్‌ బెంజ్‌ డీలర్ల వద్ద, ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
చదవండి: వచ్చే ఏడాది విడుదలయ్యే సూపర్‌ బైక్స్‌ ఇవే..!


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement