![Skoda Kushaq launch Bookings To Commence In June - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/19/2021%20Skoda%20Kushaq.jpg.webp?itok=fO6WFOzh)
సాక్షి, ముంబై: చెక్ దేశపు వాహన తయారీ సంస్థ స్కోడా గురువారం తన కొత్త కుషాక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. కంపెనీ తలపెట్టిన ఇండియా 2.0 ప్రాజెక్ట్‌లో భాగంగా తయారయ్యే తొలి ఉత్పత్తిగా కుషాక్ ఘనతకెక్కనుంది.
మధ్య తరహా ఎస్‌యూవీ విభాగంలోని హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మోడళ్లకు సరికొత్త కుషాక్ పోటీ ఇవ్వనుంది. స్కోడా కుషాక్ రెండు టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు కలిగి ఉంటుంది. ఇందులో మొదటిది 1.0 లీటర్ మూడు సిలిండర్ల టీఎస్‌ఐ పెట్రోల్ ఇంజిన్ 115 బీహెచ్‌పీ శక్తిని, 175 ఎన్‌ఎమ్ టార్క్ అందిస్తుంది. రెండోది 1.5 లీటర్ టీఎస్‌ఐ పెట్రోల్ ఇంజిన్ 150 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేసింది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డీఎస్‌జీ గేర్‌బాక్స్ కలిగి ఉంది.
స్కోడా కుషాక్ ధరలు జూన్ లేదా జూలైలో ప్రకటించనున్నారు. బుకింగ్స్ జూన్‌లో ప్రారంభమవుతాయి, జూలై 2021 నాటికి కుషాక్ కార్ల డెలివరీలు ప్రారంభం కావచ్చని స్కోడా సంస్థ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment