ముంబై: లగ్జరీ కార్ల తయారీ సంస్థ స్కోడా తన ఫ్టాగ్‌షిప్ కొడియాక్ 2023 వెర్షన్ కారును లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 37,49,000 (ఎక్స్-షోరూమ్). ఎంట్రీ-లెవల్ లగ్జరీ 4×4 SUV స్టైల్, స్పోర్ట్‌లైన్ , ఎల్ అండ్ కే మూడు వేరియంట్‌లు అందుబాటులో ఉంటాయి. అయితే 2023 స్కోడా కొడియాక్ ధర రూ. టాప్-ఎండ్ ఎల్ అండ్ కే వేరియంట్ ధర 39.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ ప్రకటించింది.
అయితే ఇవి ఆఫర్ ధరలు మాత్రమే. 2023, మార్చి వరకు మాత్రమే ఈ ఆఫర్ ధరలు అందుబాటులో ఉంటాయి స్కోడా వెల్లడించింది. ప్రస్తుతం బుకింగ్‌లు అందుబాటులో ఉన్నాయి. 50వేలు చెల్లించి అన్ని స్కోడా డీలర్‌షిప్‌లలో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి, మార్చి మధ్య డెలివరీలు అవుతాయి. గత జనవరిలో లాంచ్ చేసిన స్కోడా మోడల్ 2022 ఎస్‌యూవీ 48 గంటల్లో మొత్తం 1,200 యూనిట్లు రికార్డ్ స్థాయి సేల్స్‌ను నమోదు చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది మోడల్‌తో పోలిస్తే దాదాపు లక్షన్నన్నర రూపాయల రేటు పెంచింది.
2023 స్కోడా కొడియాక్ ఇంజన్, ఫీచర్లు
వోక్స్‌వ్యాగన్ గ్రూప్ 2-లీటర్ TSI పెట్రోల్ ఇంజన్‌ను అమర్చింది. ఇది 187.7 HP , 320 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రామాణిక 7 స్పీడ్ DSG ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందించింది. ఇది 7.8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం పుంజుకుంటుంది. 6 డ్రైవింగ్ మోడ్‌లలో ఇది లభ్యం. డైనమిక్ ఛాసిస్ కంట్రోల్ (డీసీసీ) CANTON 12-స్పీకర్ 625W సరౌండ్ సౌండ్ సిస్టమ్ వంటి కొన్ని కూల్ సెగ్మెంట్-ఎక్స్‌క్లూజివ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. బ్లైండ్‌లు, బ్లాంకెట్స్,అంబరిల్లా, హోల్డర్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అనేక సూపర్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
2023 స్కోడా కొడియాక్ జీప్ కంపాస్, మెరిడియన్, సిట్రోయెన్ సీ5 ఎయిర్‌క్రాస్, వోక్స్‌వ్యాగన్ టిగువాన్,2023 హ్యుందాయ్ టక్సన్ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment