Skoda Kushaq : హ్యాండ్సమ్‌ లుక్స్‌,  అదిరే ఫీచర్స్‌ , ఆఫర్లు | Skoda Kushaq Launched In India; Prices Start At rs 10.50 Lakh  | Sakshi
Sakshi News home page

Skoda Kushaq : హ్యాండ్సమ్‌ లుక్స్‌, అదిరే ఫీచర్స్‌ , ఆఫర్లు

Published Mon, Jun 28 2021 1:57 PM | Last Updated on Mon, Jun 28 2021 2:09 PM

Skoda Kushaq Launched In India; Prices Start At rs 10.50 Lakh  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:చాలా కాలంగాఎదురు చూస్తున్న  'స్కోడా'  తన పాపులర్‌ ఎస్‌యూవీని భారతీయ మార్కెట్లో  లాంచ్‌ చేసింది.  భారతీయ కొనుగోలుదారులను ఆకర్షించేలా  సరికొత్తగా  స్కోడా కుషాక్‌ను  ఆవిష్కరించింది.  తద్వారా  కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ  మార్కెట్లో ఒక కొత్త ప్రయాణానికి నాంది పలికింది.

యాక్టివ్, అంబిషన్, స్టైల్  అనే మూడు వేరియంట్లలో తీసుకొచ్చింది. ఇక ధర  విషయానికి వస్తే.. బేస్ వేరియంట్‌10.50 లక్షల ధరలతో ప్రారంభించి, టా ప్‌ ఎండ్‌   మోడల్‌ ధరను  17.60 లక్షలుగా నిర్ణయించింది. కస్టమర్లు ఆన్‌లైన్‌లో లేదా భారతదేశం అంతటా డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. జూలై 12 నుంచి  డెలివరీలు ప్రారంభం కానున్నాయి.'వన్ నేషన్. వన్ ప్రైస్' ఫిలాసఫీని ముందుకు తీసుకువెళుతున్నట్టు కంపెనీ ప్రకటించింది.

స్కోడా కుషాక్ ఫీచర్లు: సరికొత్త ఫీచర్లతో  భారతీయ కస్టమర్లకు అనుగుణంగా దీన్ని  రూపొందించింది. ఐకానిక్ ఫ్రంట్ గ్రిల్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్స్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు షార్క్ ఫిన్ యాంటెన్నా, రియర్ వైపర్ , బిగ్ రియర్ బంపర్ ఉన్నాయి. ఇంకా  డ్యూయల్-టోన్   అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, సన్‌రూఫ్ వంటివి  ప్రధానంగా ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, రెనాల్ట్ డస్టర్  లాంటి  మోడళ్లకు పోటీగా నిలవనుంది. భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఎంక్యూబీ-ఏవో-ఇన్‌ ప్లాట్‌పాంలో  స్కోడా కుషాక్ తొలి మోడల్‌  ఎస్‌యూవీ కావడం విశేషం.


రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్‌లో  ఇది లభ్యం. బేస్‌ వేరియంట్‌లో 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను జత చేసింది.  ఇ‍క టాప్-ఆఫ్-లైన్ మోడల్‌ ఎస్‌యూవీలో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చింది.1.5-లీటర్  వేరియంట్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 147.5 బిహెచ్‌పి మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్‌ఎమ్‌ను టార్క్ అందిస్తుంది. 1.0-లీటర్ ఇంజన్  వేరియంట్‌ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 114 బిహెచ్‌పి పవర్, 1,750 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.  హనీ ఆరెంజ్, టోర్నడో రెడ్, కాండీ వైట్, రిఫ్లెక్స్ సిల్వర్ , కార్బన్ స్టీల్ అనే ఐదు కలర్ వేరియంట్లలో  లభ్యం.నాలుగు సంవత్సరాల / 1,00,000 కిమీల వారంటీతో పూర్తి “పీస్ ఆఫ్ మైండ్” మీ సొంతం అంటోంది.  దీన్ని  ఆరు సంవత్సరాల వరకు లేదా, 1,50,000 కిమీ వరకు  పొడిగించుకోవచ్చు. అంతేకాదు  2 సంవత్సరాల పార్ట్స్ వారంటీ, 2 సంవత్సరాల బ్యాటరీ వారంటీ, 3 సంవత్సరాల పెయింట్ వారంటీ, 6 సంవత్సరాల తుప్పు వారంటీ 9 సంవత్సరాల వరకు విస్తరించిన రోడ్‌సైడ్  అసిస్టెన్స్‌ ప్రోగ్రాం కూడా అందిస్తుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement