
బీఎండబ్ల్యూ కంపెనీ కొత్త కారును భారతీయ మార్కెట్‌లో లాంచ్ చేసింది. పూర్తిగా చెన్నైప్లాంట్‌లో రూపొందించిన ఎక్స్ 3 ఎస్‌యూవీ పెట్రోల్ వేరియంట్‌ను విడుదల చేసింది. కంపెనీ డీలర్‌షిప్‌ల ద్వారా నేటినుంచే లభ్యంకానుంది. లగ్జరీ డిజైన్‌తో రూపొందించిన ఈ కారుధరను రూ.56.90లక్షలు( ఎక్స్‌షోరూం)గా నిర్ణయించింది.
2.0 లీటర్ల పెట్రోల్ ఇంజీన్, నాలుగు సిలిండర్ల టర్బో 252 హెచ్‌పీ, 350ఎన్‌ఎం టార్క్, 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఎక్స్‌డ్రైవ్ ఆల్-వీల్ డ్రైవ్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. 6.3 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం అందుకుటుందని కంపెనీ పేర్కొంది. సెకండ్ జనరేషన్‌మోడల్‌తో పోలిస్తే ఇంటీరియర్‌లో 12.3 ఇంచెల్ మల్టీ ఫంక్షన్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లేతో పాటు ఇతర భారీ మార్పులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment