petrole
-
జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్‌పై కీలక ప్రకటన
న్యూఢిల్లీ: జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను తీసుకురావడం ఇప్పట్లో సాధ్యం కాని విషయమని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుశీల్‌కుమార్ మోదీ తేల్చేశారు. జీఎస్టీ కిందకు వస్తే వార్షికంగా రూ.2 లక్షల కోట్ల మేర ఆదాయాన్ని రాష్ట్రాలు కోల్పోవాల్సి వస్తుందంటూ.. ఇందుకు ఏ రాష్ట్రం కూడా సుముఖంగా లేదన్నారు. రాష్ట్రాలకు రూ.2లక్షల కోట్ల నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలంటూ ప్రశ్నించారు. జీఎస్టీ కిందకు పెట్రోలియం ఉత్పత్తులను తీసుకువచ్చేందుకు మరో 8–10 ఏళ్ల పాటు వేచి చూడాల్సి రావచ్చని పేర్కొన్నారు. ఆర్థిక బిల్లుకు మద్దతుగా రాజ్యసభలో బుధవారం సుశీల్‌మోదీ మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రాలు కలసి ఉమ్మడిగా పెట్రోలియం ఉత్పత్తులపై ఏటా రూ.5 లక్షల కోట్ల మేర పన్నులు వసూలు చేస్తున్నట్టు చెప్పారు. జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే గరిష్ట రేటు అయిన 28 శాతమే పన్ను అమలవుతుందని.. ప్రస్తుతం అయితే వాటి విక్రయ ధరలో 60 శాతం వరకు పన్ను అమలవుతున్నట్టు తెలిపారు. ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు చారిత్రక గరిష్టాలకు చేరడంతో ధరలు దిగివచ్చేందుకు జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లు వినిపిస్తుండడం తెలిసిందే. ప్రతిపక్ష నేతలు బహిరంగంగా ప్రకటనలు అయితే ఇస్తారు కానీ.. ఈ అంశాలను జీఎస్టీ కౌన్సిల్ ముందు ప్రస్తావించరంటూ ఆయన విమర్శించారు. జీఎస్టీ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఇందులో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల మంత్రులు కూడా ఉన్న నేపథ్యంలో సుశీల్ ఈ విమర్శ చేశారు. బిహార్ మంత్రిగా పనిచేసిన సమయంలో జీఎస్టీ కౌన్సిల్‌కు సుశీల్ ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్రాలు ముందుకు వస్తే తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ కిందకు తీసుకురావడంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి సీతారామన్ మంగళవారం ప్రకటన చేసిన విషయం గమనార్హం. -
వరుసగా మూడో రోజు పెరిగిన పెట్రో ధరలు
సాక్షి, ముంబై: పెట్రో ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గతరెండు రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న పెట్రోలు, డీజిలు ధరలు మూడు రోజు (శనివారం) కూడా పైకే చూస్తున్నాయి. లీటరు పెట్రోల్‌పై19 పైసలు, లీటర్ డీజిల్ ధర 29పైసలు చొప్పున పెరిగింది. అంతర్జాతీయంగా చమురు ధరలు 2శాతం తగ్గుముఖం పట్టినా, దేశీయంగా ధరలు పెరుగుతూండటం గమనార్హం. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోలు లీటరు ధర రూ.69.26కు చేరగా, డీజిల్ ధర రూ. 63.10వద్ద ఉంది. ముంబై : లీటర్ పెట్రోల్ ధర రూ. 75 డీజిల్ రూ.66 కోల్‌కతా : పెట్రోల్ ధర లీటరు ధర రూ. 71.39, డీజిల్ రూ .64.87 చెన్నై: లీటరు పెట్రోలు ధర రూ. 71.87 , ఉండగా డీజిల్ ధర రూ. 66.62గా ఉంది. హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర రూ. 73.41గా పలుకుతుండగా... డీజిల్ ధర రూ. 68.57గా ఉంది. విజయవాడ : లీటరు పెట్రోలు ధర రూ. 72.95 , ఉండగా డీజిల్ ధర రూ. 67.76గా ఉంది. -
బీఎండబ్ల్యూ ఎక్స్ 3 పెట్రోల్ వెర్షన్ లాంచ్
బీఎండబ్ల్యూ కంపెనీ కొత్త కారును భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. పూర్తిగా చెన్నైప్లాంట్లో రూపొందించిన ఎక్స్ 3 ఎస్యూవీ పెట్రోల్ వేరియంట్‌ను విడుదల చేసింది. కంపెనీ డీలర్‌షిప్‌ల ద్వారా నేటినుంచే లభ్యంకానుంది. లగ్జరీ డిజైన్‌తో రూపొందించిన ఈ కారుధరను రూ.56.90లక్షలు( ఎక్స్‌షోరూం)గా నిర్ణయించింది. 2.0 లీటర్ల పెట్రోల్ ఇంజీన్, నాలుగు సిలిండర్ల టర్బో 252 హెచ్‌పీ, 350ఎన్ఎం టార్క్, 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఎక్స్‌డ్రైవ్ ఆల్-వీల్ డ్రైవ్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. 6.3 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం అందుకుటుందని కంపెనీ పేర్కొంది. సెకండ్ జనరేషన్మోడల్తో పోలిస్తే ఇంటీరియర్‌లో 12.3 ఇంచెల్ మల్టీ ఫంక్షన్ ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లేతో పాటు ఇతర భారీ మార్పులు చేసింది. -
12వ రోజూ తగ్గిన పెట్రోల్ ధర
సాక్షి, ముంబై: ఆయిల్ కంపెనీలు పెట్రోల్,డీజిల్ ధరలపై ప్రజలకు స్వల్ప ఉపశమనం కలిగించాయి. వరుసగా పన్నెండో రోజూ పెట్రోల్ ధరలు తగ్గాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇచ్చిన వివరాల ప్రకారం ప్రస్తుతం న్యూఢిల్లీలో ఆదివారం లీటరు పెట్రోల్ ధర 24 పైసలు తగ్గి 76.78గా ఉంది. కోల్‌కతాలో 24పైసలు తగ్గగా.. చెన్నైలో 26పైసలు, ముంబయిలో 23పైసలు తగ్గింది. వరుసగా పన్నెండో రోజు కూడా పెట్రోల్ధర తగ్గుముఖం పట్టడంతో పట్రోల్ లీటరు ధర ముంబైలోరూ.84.61 గా, కోలకతాలో రూ.79.44, చెన్నైలో రూ.79.95 గా ఉంది. దీంతో ఇప్పటి వరకూ పెట్రోల్ ధరలు లీటరుపై దిల్లీలో రూ.1.65, కోల్‌కతాలో రూ.1.62, ముంబయిలో రూ.1.63, అత్యధికంగా చెన్నైలో రూ.1.74 తగ్గింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ. రూ. 81.33గా ఉండగా ఇతర నగరాల్లో బెంగుళూరులో రూ. 78.03, భోపాల్ రూ. రూ .75.60, భువనేశ్వర్‌లో రూ. 75.60, చండీగఢ్‌లో రూ. 73.84, డెహ్రాడూన్లోరూ. 78.04, జైపూర్లోరూ. 79.53, లక్నోలో రూ. 77.52, పాట్నా, రాయపూర్‌లో రూ. 77.18, శ్రీనగర్‌లో రూ. 81.19.గా వుంది. డీజిల్ ధరలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. ఆదివారం 18పైసలు వరకూ ధర తగ్గింది. ముంబయి, చెన్నైలో 19 పైసలు తగ్గి లీటరు ధర రూ. 68.10, కోల్‌కతాలో రూ.70.65, ముంబయిలో రూ. 72.51, చెన్నైలో రూ. 71.89కు చేరింది. నిన్న రికార్డు స్థాయిలో లీటరు పెట్రోల్‌పై 40-42 పైసలు తగ్గిన విషయం తెలిసిందే. అలాగే గత పదిరోజుల్లో పెట్రోల్ ధర ఒక రూపాయి తగ్గింది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్‌లో 76.69డాలర్లుగా ఉంది. -
కోవూరు బైపాస్‌పై పెట్రోల్ ట్యాంకర్ బోల్తా
కోవూరు: నెల్లూరు జిల్లా కోవూరు జాతీయరహదారిపై శనివారం ఉదయం పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటనలో పెనుప్రమాదం తప్పింది. విజయవాడ విమానాశ్రయం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి వైట్ పెట్రోల్‌ను తరలిస్తున్న ట్యాంకరు అదుపుతప్పి నందలగుంట వద్ద బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లారీక్లీనర్ మహేష్‌కు స్వల్పగాయాలయ్యాయి. డ్రైవర్ మల్లేష్ సురక్షితంగా బయటపడ్డాడు. మరోవైపు ట్యాంకర్ బోల్తా పడటంతో స్థానికులు ఆ పెట్రోల్‌ను పట్టుకునేందుకు క్యూ కట్టారు. ఏకంగా బిందెలు, బక్కెట్లు, క్యాన్లతో పెట్రోల్ పట్టుకునేందుకు ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. అయితే ఏ మాత్రం చిన్న అగ్గి రవ్వ పడినా పెను ప్రమాదం జరుగుతుందనే విషయాన్ని కూడా పక్కనపెట్టి జనాలు మరీ పెట్రోల్ కోసం బారులు తీరారు. కొద్దిదూరంలో ఒక ఆకతాయి ఈ పెట్రోలు మండుతుందా లేదా ప్రయత్నించగా కొందరు స్థానికులు అతనిని దూరంగా తరిమివేశారు. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ట్యాంక్‌లో 20 వేల లీటర్ల పెట్రోల్ ఉన్నట్లు డ్రైవర్ తెలిపాడు. విషయం తెలుసుకొన్న ఎస్ఐ సుధాకర్‌రెడ్డి, ఏఎస్ఐ సుబ్రహ్మణ్యంలు సంఘటనస్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాల్ని అడిగి తెలుసుకొన్నారు. ప్రమాదంలో లారీ పూర్తిగా ధ్వంసమైంది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. -
ఎన్నిసార్లు పెంచుతారు.. దోచుకోవడానికా..!
-
ఎన్నిసార్లు పెంచుతారు.. దోచుకోవడానికా..!
కరీంనగర్: పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు పెట్రో ధరలను పెంచడాన్ని నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం కరీంనగర్ పట్టణంలో సీపీఎం పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. సామాన్య ప్రజలపై పెట్రో భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ముకుందారెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలను దోచుకోవడం కోసం ఈ చర్య తీసుకున్నారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.