ఆటో ఎక్స్‌పోలో కియో స్పెషల్ ఎస్‌యూవీ ఎస్‌పీ లాంఛ్
సాక్షి, న్యూఢిల్లీ : కొరియన్ ఆటో దిగ్గజం కియా మోటార్స్ భారత్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన కాన్సెప్ట్ ఎస్‌యూవీని బుధవారం ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ఎస్‌పీ కాన్సెప్ట్‌తో పిలిచే ఈ కార్లు 2019లో భారత రోడ్లపై సందడి చేస్తాయని తెలిపింది. మార్కెట్ ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా ధర నిర్ణయిస్తామని కియా మోటార్స్ ఇండియా సేల్స్ హెడ్ మనోహర్ భట్ చెప్పారు. ఏపీలో మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ను నెలకొల్పనున్న కియా మోటార్స్ భారత్‌లో తొలుత ప్రవేశపెట్టనున్న ఎస్‌యూవీని ఆటో ఎక్స్‌పో వేదికగా ఆవిష్కరించింది.
భారత్‌లో రూ 7000 కోట్లు పైగా పెట్టుబడులు పెట్టనున్న కంపెనీ ఏడాదికి మూడు లక్షల కార్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. భారత్‌లో రాబోయే రోజుల్లో ఎలక్ర్టిక్ వాహనాలకు మెరుగైన డిమాండ్ ఉంటుందని కియో అంచనా వేస్తోంది.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment