ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న మహీంద్రా థార్ రాక్స్ ఎట్టకేలకు లాంచ్ అయింది. అయితే బుకింగ్స్, టెస్ట్ డ్రైవ్, డెలివరీల కోసం మాత్రం కొంత సమయం వేచిఉండాలి. కాగా ఈ క్రేజీ ఎస్‌యూవీ గురించిన కొన్ని వివరాలను కంపెనీ వెల్లడించింది.
మహీంద్రా థార్ రాక్స్ ధరలు (ఎక్స్-షోరూమ్) రూ.12.99 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 14 నుంచి టెస్ట్ డ్రైవ్‌లు అందుబాటులోకి రానున్నాయి. అయితే బుకింగ్‌లు మాత్రం అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతాయి. డెలివరీల విషయానికొస్తే దసరా నాటికి వినియోగదారులకు వాహనాలను అందజేయడం ప్రారంభిస్తుంది.
వేరియంట్లు, ధరలు
థార్ రోక్స్ MX1, MX3, MX5, AX3, AX5, AX7 వంటి అనేక రకాల ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. కానీ మహీంద్రా కేవలం ఎంపిక చేసిన కొన్ని పెట్రోల్, డీజిల్ వేరియంట్‌ల ధరలను మాత్రమే ప్రకటించింది.
పెట్రోల్ వేరియంట్లు
» మహీంద్రా థార్ రాక్స్ MX1 MT RWD: రూ. 12.99 లక్షలు
» మహీంద్రా థార్ రాక్స్ MX3 AT RWD: రూ. 14.99 లక్షలు
డీజిల్ వేరియంట్లు
» మహీంద్రా థార్ రాక్స్ MX1 MT RWD: రూ. 13.99 లక్షలు
» మహీంద్రా థార్ రాక్స్ MX3 MT RWD: రూ. 15.99 లక్షలు
» మహీంద్రా థార్ రాక్స్ AX3L MT RWD: రూ. 16.99 లక్షలు
» మహీంద్రా థార్ రాక్స్ MX5 MT RWD: రూ. 16.99 లక్షలు
» మహీంద్రా థార్ రాక్స్ AX5L AT RWD: రూ. 18.99 లక్షలు
» మహీంద్రా థార్ రాక్స్ AX7L MT RWD: రూ. 18.99 లక్షలు
ఇంజిన్, గేర్‌బాక్స్
మహీంద్రా థార్ రాక్స్ 2.0L mStallion టర్బో-పెట్రోల్, 2.2L mHawk టర్బో-డీజిల్ అనే రెండు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. టర్బో-పెట్రోల్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో గరిష్టంగా 162 హెచ్‌పీ పవర్ అవుట్‌పుట్, 330 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఆటోమేటిక్‌లో అయితే గరిష్ట అవుట్‌పుట్‌లు 177 హెచ్‌పీ, 380 ఎన్‌ఎం వరకు పెరుగుతాయి. ఆయిల్ బర్నర్ విషయానికి వస్తే ఇది స్టిక్ షిఫ్ట్‌తో 152 హెచ్‌పీ, 330 ఎన్ఎం అవుట్‌పుట్‌ను అందిస్తుంది. అయితే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ 175 హెచ్‌పీ, 370 ఎన్ఎమ్‌లను అందుకుంటుంది.
కలర్ ఆప్షన్లు, ఫీచర్లు
థార్ రాక్స్ మొత్తం ఏడు రంగుల్లో లభిస్తుంది. స్టెల్త్ బ్లాక్, టాంగో రెడ్, ఎవరెస్ట్ వైట్, డీప్ ఫారెస్ట్, నెబ్యులా, బాటిల్‌షిప్ గ్రే, బర్న్ట్ సియెన్నా కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ పెయింట్ స్కీమ్‌లన్నీ బ్లాక్-పెయింటెడ్ రూఫ్‌తో జత చేయబడి ఉంటాయి. 60:40 రియర్ స్ప్లిట్, 10.25-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, పవర్డ్ సీట్లు, రెండు సన్‌రూఫ్ ఆప్షన్లు, కనెక్టెడ్ కార్ టెక్, లెవెల్-2 ADAS, అకౌస్టిక్ గ్లాసెస్, 9-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment