దేశంలో కార్ల వినియోగం రోజోరోజుకు పెరిగిపోతుంది. ఆకట్టుకునే ఫీచర్లు, టెక్నాలజీతో పాటు రకరకాల మోడళ్లతో వాహన దారుల్ని కనువిందు చేస‍్తున్నాయి. దీంతో వాహన దారులు సరసమైన ధరల్లో తమకు కావాల్సిన కార్లను సొంతం చేసుకునేందుకు వెనకడుగు వేయడం లేదు. ముఖ్యంగా సన్ రూఫ్ ఆప్షన్ ఉన్న ఎస్‌యూవీ వాహనాలు కనిపిస్తే చాలు కొనుగోలు చేస్తున్నారని మార్కెట్ నిపుణులు చెబుతుండగా..ఆయా ఆటోమొబైల్ సంస్థలు ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్)వాహనాల్లో ఈ సన్ రూఫ్ ఫీచర్ తప్పనిసరిగా మారుతోంది.
లగ్జరీ టూ బడ్జెట్ కార్లు
సన్ రూఫ్..! లాంగ్ డ్రైవ్‌లో వెదర్‌ను ఎంజాయ్ చేసేందుకు వెస్ట్రన్ కంట్రీస్‌కు చెందిన ఆటోమొబైల్ సంస్థలు లగ్జరీ కార్లలో ఈ ఫీచర్‌ను యాడ్ చేసేవి. ఆ తర్వాత భారత మార్కెట్‌లో హై ఎండ్ కార్లలో ఈ ఫీచర్ ఉండేది. అయితే గత మూడేళ్లుగా మిడ్ రేంజ్ ఎస్‌యూవీలలో సన్‌రూఫ్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టారు. దీంతో ఆ కార్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. రానురాను సన్‌రూఫ్ అనేది కార్లకు తప్పనిసరి ఫీచర్‌గా మారింది. వాహన తయారీ సంస్థలు సైతం వివిధ బడ్జెట్లలో గ్లాస్ రూఫ్, సన్ రూఫ్, పనోరమిక్ సన్‌రూఫ్, స్కై రూఫ్ ఆప్షన్లను ప్రవేశపెడుతున్నాయి. అందుకు తగ్గట్టే అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. దీంతో మార్కెట్‌లో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఈ సన్ రూఫ్ ఆప్షన్ ఒక భాగమైంది. ఎస్ యూవీ వాహనాల్లో ఈ సన్ రూఫ్ ఫీచర్ ఉండడంతో సేల్స్ పెరిగిపోతున్నాయని ఆటో మొబైల్ రీసెర్చ్ సంస్థ 'జాటో' తెలిపింది.
సర్వేలు ఏం చెబుతున్నాయి
సన్‌రూఫ్ ఫీచర్‌కి సంబంధించి 2019తో ఇప్పటి పరిస్థితులను పోల్చితే .. సన్‌రూఫ్ ఆప్షన్ ఉన్న కార్ల అమ్మకాల సంఖ్య నాలుగు రెట్లు పెరిగినట్టు జాటో తెలిపింది. ఈ ఫీచర్ ఉండటం వల్ల కారు ప్రయాణంలో కొత్త రకం అనుభూతిని పొందడంతో పాటు ... కారు శుభ్రంగా ఉండడమే కాకుండా, శబ్ధ కాలుష్యం నుంచి దూరంగా ఉండొచ్చనే అభిప్రాయం వినియోగదారుల్లో పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment