హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న ఆడి ఇండియా ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ మధ్య 2,947 యూనిట్లను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 29 శాతం వృద్ధి. ఏ8, క్యూ7 మోడళ్లు ఈ వృద్ధిని నడిపించాయని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ఈ–ట్రాన్ శ్రేణి, ఏ4, ఏ6, క్యూ5, ఆర్‌ఎస్ పెర్ఫార్మెన్స్ శ్రేణి మోడళ్లకు సైతం డిమాండ్ ఉందని వెల్లడించింది.
ప్రీ–ఓన్డ్ కార్ల వ్యాపారం అయిన ఆడి అప్రూవ్డ్ ప్లస్ 73 శాతం వృద్ధి నమోదు చేసిందని తెలిపింది. సెమీకండక్టర్ల కొరతతోపాటు ప్రపంచవ్యాప్తంగా సరఫరా సమస్యలు ఉన్నప్పటికీ బలమైన వృద్ధి సాధించడం బ్రాండ్, విస్తృత ఉత్పత్తులపట్ల కస్టమర్ల ఉత్సాహాన్ని పునరుద్ఘాటిస్తుందని ఆడి ఇండియా హెడ్ బల్‌బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. స్థిర డిమాండ్ నేపథ్యంలో ప్రస్తుత పండుగల సీజన్‌లో మెరుగైన వృద్ధి సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఆడి అప్రూవ్డ్ ప్లస్ కేంద్రాలు ప్రస్తుతం 18 ఉన్నాయి. డిసెంబర్ నాటికి మరో నాలుగు జోడించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment