High Security
-
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
-
సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్తత.. నిరుద్యోగుల అరెస్ట్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగులు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ముట్టడి నేపథ్యంలో సోమవారం(జులై 15) సెక్రటేరియట్ సమీపంలో భారీగా పోలీసులను మోహరించారు. దీంతో సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ముట్టడికి బయలుదేరిన నిరుద్యోగులను బీఆర్కేభవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్సీ వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. అంతకుముందు సెక్రటేరియట్‌కు వెళ్లే అన్ని దారుల్లో నిఘా పెంచారు. ముందస్తుగా నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ముట్టడికి బయలుదేరిన వారిలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, పోటీ పరీక్షలు వాయిదా వేయాలని రెండు రోజుల నుంచి అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. -
స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఐదు అంచెల భద్రత
-
అనకాపల్లి జిల్లాలో 1529 పోలింగ్ కేంద్రాలు..
-
సీఎం జగన్ కర్నూలు పర్యటనకు భారీ సెక్యూరిటీ..
-
సీఎం జగన్ సిద్ధం సభకు భారీ బందోబస్తు
-
ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు వచ్చిన బాంబుల బెదింపులు కలకలం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులను ఈ మెయిల్ ద్వారా పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హైకోర్టుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఢిల్లీ హైకోర్టులో భారీ బాంబు పేలుడు సంభిస్తుందని బుధవారం కోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ మెయిల్ వచ్చింది. ‘ఫిబ్రవరి 15న హైకోర్టులో బాంబు పేల్చుతా. ఈ పేలుడు ఢిల్లీలోనే అతిపెద్దది కానుంది. ఎంతమంది భద్రతా బలగాలైనా పెట్టుకోండి.. అందరినీ పేల్చివేస్తాం’ అని గుర్తు తెలియని దుండగులు ఈ మెయిల్లో బెదిరింపులకు పాల్పడ్డారు. ఇదే రోజు మరోవైపు బిహార్ డీజీపీకి వాట్సప్ ఆడియో క్లిప్ ద్వారా బాంబు బెదిరింపు రావటం గమనార్హం. అయితే ఈ ఘటనలో నిందితుడిని కర్ణాటకలో పటుకున్నామని పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి అతన్ని విచారణ కోసం పట్నా తరలించారు. నిందితుడిని అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. -
స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ట భద్రత
-
స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పటిష్ట బందోబస్త్
-
జైల్లో చంద్రబాబు భద్రతకు పూర్తిస్థాయి చర్యలు
-
స్ట్రాంగ్ రూమ్స్ లో ఈవీఎంలు...
-
తిరుమలలో పటిష్టమైన నిఘా, పోలీసుల భద్రత
-
అమరావతి అమరలింగేశ్వర ఆలయం వద్ద చర్చకు సిద్ధమైన నంబూరు
-
2500 మంది పోలీసులతో భద్రత
-
హైదరాబాద్: మొహర్రం సందర్భంగా పాతబస్తీలో భారీ బందోబస్తు
-
హాజరుకానున్న ప్రధాని... ఆ ప్రాంతాలను హై సెక్యూరిటీ జోన్‌గా...
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో మాదాపూర్‌లోని హెచ్ఐసీసీ సహా దాని చుట్టుపక్కల ప్రాంతాలను హై సెక్యూరిటీ జోన్‌గా ప్రకటించాలని రాష్ట్ర పోలీసు విభాగం యోచిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా అనేక మంది అత్యంత ప్రముఖులు వస్తుండటంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. వీరితో పాటు దేశంలోని 18 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు సైతం హాజరు కానుండటం, ఇక్కడే ఉండనుండటంతో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పాల్గొనడంతో పాటు ఆఖరి రోజు పరేడ్‌గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలోనూ పాల్గొననున్నారు. నగరంలోని రాజ్‌భవన్ లేదా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని హోటళ్లు నోవాటెల్, వెస్టిన్ లేదా ఐటీసీ కోహినూర్ల్లో ఏదో ఒకచోట మోదీ బస చేస్తారని తెలుస్తోంది. ఆయన భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులదే తుది నిర్ణయమని పోలీసులు చెబుతున్నారు. రాజ్‌భవన్‌తో పాటు ఆయా హోటళ్లలోనూ అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరిస్తున్నారు. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ హోటళ్లలో నో రూమ్స్... అత్యంత ప్రముఖులతో పాటు ఇతరులు, వారి భద్రతా సిబ్బంది బస చేయడానికి బీజేపీ పార్టీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. మాదాపూర్‌తో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న హోటళ్లను ఈ నెల 30 నుంచి వచ్చే నెల 3 వరకు బుక్ చేసేసింది. ప్రధాని సహా ప్రముఖులు దాదాపు 350 మంది రానున్నారని తెలుస్తోంది. వీరితో పాటు అనుచరులు, సహాయకులు సైతం పెద్ద సంఖ్యలోనే వస్తారు. దీంతో మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని స్టార్ హోటళ్లతో పాటు సాధారణ హోటళ్లలోని రూమ్‌లన్నీ బ్లాక్ చేసి ఉంచారు. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి వచ్చే వారు ఐటీ కారిడార్‌లోని హోటళ్లను బుక్ చేసుకుని అడ్వాన్స్‌లు కూడా చెల్లించారు. ఆ మూడు రోజు లూ సాధారణ కస్టమర్లకు హోటళ్లలో గదులు దొరకని పరిస్థితి ఉంది. మరోపక్క నగరంలోనూ కొన్ని హోటళ్లలోని రూమ్స్ బీజేపీ బుక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా అబిడ్స్, లక్డీకాపూల్లతో పాటు బేగంపేట్, అమీర్‌పేట్, సికింద్రాబాద్‌ల్లో ఉన్న హోటళ్లను బుక్ చేసి ఉంచారు. ప్రారంభమైన సెక్యూరిటీ వెట్టింగ్ ప్రక్రియ.. ప్రధాని, కేంద్ర మంత్రులు, సీఎంలు, బీజేపీ జాతీయ ముఖ్యనేతలు రానుండటంతో సైబరాబాద్ పోలీసులు బందోబస్తు, భద్రత ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. బందోబస్తు కోసం రాచకొండతో పాటు ఇతర జిల్లాల నుంచి అధికారులను రప్పించనున్నారు. భద్రత చర్యల్లో భాగంగా ఆయా హోటళ్లలో పని చేసే సిబ్బందికి సంబంధించి సెక్యూరిటీ వెట్టింగ్ చేపడుతున్నారు. వారి వివరాలు, ఆధార్ లేదా గుర్తింపుకార్డుల్ని సేకరిస్తున్నారు. వీటిని స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ పోలీసులు సాయంతో సరిచూస్తున్నారు. హెచ్ఐసీసీతో పాటు ఆయా హోటళ్ల పక్కన నిర్మాణంలో ఉన్న భవనాల పైనా పోలీసులు దృష్టి పెట్టారు. వాటిలో పని చేసే ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీల వివరాలు సేకరిస్తున్నారు. వీరందరి పూర్వాపరాలు, గత చరిత్ర, నేరాలు సంబంధాలు తదితరాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ సెక్యూరిటీ వెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ముఖ్య నేతలు బస చేసే హోటళ్ల వద్ద యాక్సెస్ కంట్రోల్ పాయింట్లు, చెక్ పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. అడుగడుగున వాహనాల తనిఖీలు చేపట్టనున్నారు. హోటల్ సిబ్బందితో పాటు బస చేస్తున్న వారికీ సరైన గుర్తింపు కార్డులు ఉంటేనే లోనికి అనుమతించనున్నారు. ఆయా హోటళ్లల్లో ఇప్పటికే ఉన్న వాటి పనితీరు పరిశీలించడంతో పాటు తోడు కొత్తగా పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. (చదవండి: బీజేపీ నేతల తీరు దుర్మార్గం: బాల్క సుమన్) -
Suriya: హీరో సూర్య ఇంటి వద్ద హై సెక్యూరిటీ
Jai Bhim Controversy: Suriya Gets Police Protection: హీరో సూర్య నటించిన జై భీమ్ సినిమా ఓటీవలె ఓటీటీలో విడుదలై సూపర్ హిట్టయ్యింది. ఓవైపు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమాపై అదే స్థాయిలో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. వన్నియర్ సంఘం తమ ప్రతిష్టను దిగజార్చారంటూ ఇప్పటికే చిత్ర యూనిట్‌కు లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. దీని తర్వాత కూడా సూర్యకు అనేక బెదిరింపులు వస్తుండటంతో పోలీసులు ఆయనకు భద్రత కల్పించారు. చెన్నైలోని సూర్య నివాసం వద్ద పోలీసులు భద్రత కల్పించారు. మరోవైపు సూర్యకు పలువురు ప్రముఖులు సహా అభిమానులు అండగా నిలుస్తున్నారు. ట్విట్టర్లో # WeStandwithSuriya అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. సూర్యకు మద్ధతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. -
నిఘా నీడన నిమజ్జనం
-
తమిళనాడులో ‘లష్కరే’ జాడ
సాక్షి, చెన్నై: తమిళనాడులోకి సముద్రమార్గం గుండా లష్కరే తోయిబా ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం రావటంతో పోలీసులు శుక్రవారం గట్టి భద్రత చర్యలు చేపట్టారు. ఒక పాకిస్తానీతో పాటు శ్రీలంకకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు కోయంబత్తూరులో తిష్ట వేసినట్టు తెలియడంతో వారి కోసం పోలీసులు జల్లెడపడుతున్నారు. తీవ్రవాదుల హిట్‌లిస్ట్‌లో చెన్నై, మధురై, కోయంబత్తూరు ఉన్నట్టుగా కేంద్ర నిఘావర్గాలు ఇప్పటికే హెచ్చరికలు జారీచేశాయి. ఇటీవల ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో సాగిన వరుసబాంబు పేలుళ్ల అనంతరం ఎన్ఐఏ తమిళనాడుపై దృష్టి పెట్టింది. ఐసిస్ మద్దతుదారులకు విదేశాల్లో శిక్షణనిచ్చి ఇక్కడ చొప్పించేందుకు ప్రయత్నించిన ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుల్ని ఎన్ఐఏ వర్గాలు అరెస్టు చేసి విచారణ కూడా జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. డీజీపీ త్రిపాఠి, అదనపు డీజీపీ జయంతి మురళి పర్యవేక్షణలో ఐజీలు, డీఐజీలు, ఎస్పీల స్థాయి నుంచి కింది స్థాయి పోలీసు వరకు రంగంలోకి దిగారు. నుదుట తిలకం పెట్టుకుని... కోయంబత్తూరులో చొరబడ్డ ఆరుగురు ఉగ్రవాదులు నుదుట తిలకం పెట్టుకుని ఉన్నారని, బాంబు పేలుళ్లే లక్ష్యంగా హిందూ సంఘాలు, బీజేపీ నేతల్ని సైతం గురిపెట్టారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సాయుధ బలగాలనూ రంగంలోకి దింపారు. చెన్నైలో ఐదువేల మంది పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు సాగుతున్నాయి. శ్రీలంకకు అతి సమీపంలో ఉన్న రామేశ్వరం, పాంబన్, వేదారణ్యం, ముత్తుపేట, నాగపట్నం తీర ప్రాంతాల్ని నిఘా వలయంలోకి తీసుకొచ్చారు. -
కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
కాకినాడ సిటీ: ఈ నెల 23వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాలతో పాటు, జిల్లాలో ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం లేకుండా పటిష్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో శనివారం పోలీసు సూపరింటెండెంట్లు, రిటర్నింగ్ అధికారులు, డీఎస్పీలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి కౌంటింగ్ ఏర్పాట్లను సమీక్షించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, అంతర వలయంలో సీఆర్పీఎఫ్ దళాలు, మధ్య వలయంలో ఏపీఎస్పీ దళాలు, బాహ్య వలయంలో స్థానిక పోలీస్ దళాలను మోహరించాలని సూచించారు. అభ్యర్థులు ప్రతిపాదించిన కౌంటింగ్ ఏజెంట్ల ప్రవర్తన, నేర చరిత్రలను పోలీసు శాఖ పరిశీలించి నివేదికను ఆర్వోలకు అందజేయాలన్నారు. ఓట్ల లెక్కింపు రోజున గుంపులు, సమూహాలు ఉత్సాహం, నైరాశ్యాలకు లోనై ఎవరూ శాంతిభద్రతలకు కలిగించకుండా కౌంటింగ్ కేంద్రాలతోపాటు అన్ని మండల కేంద్రాల్లో 144 సెక్షన్ విధించాలని ఆదేశించారు. పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లతో రిటర్నింగ్ అధికారులు, డీఎస్పీలు వారి వారి నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించి శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించేలా కోరాలని సూచించారు. కౌంటింగ్ పూర్తయిన తరువాత ఆర్వోలు, డీఎస్పీలు ఈవీఎంలను గోడౌన్‌కు, స్టాట్యుటరీ పత్రాల ట్రంక్ బాక్సులను కలెక్టరేట్‌కు సురక్షితంగా తరలించి భద్రపరచాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ విశాల్ గున్ని, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ షిమోషి బాజ్‌పాయ్ మాట్లాడుతూ కౌంటింగ్ సందర్భంగా 911 మంది పోలీసు సిబ్బందిని నియమించామన్నారు. కౌంటింగ్ రోజున అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జిల్లా వ్యాప్తంగా తగిన ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. కలెక్టర్ సూచనల మేరకు జేఎన్టీయూకేలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద మరో 150 నుంచి 200 మంది అదనపు సిబ్బందిని నియమిస్తామని చెప్పా రు. జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జున, రంపచోడవ రం ఐటీడీఏ పీవో నిషాంత్ కుమార్, సబ్ కలెక్టర్లు సా యికాంత్ వర్మ, వినోద్‌కుమార్, చింతూరు ఐటీడీఏ పీవో అభిషిక్త కిషోర్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ సుమీత్‌కుమార్ గాంధీ, డీఆర్వో ఎం వీ గోవిందరాజులు, సీఆర్పీఎఫ్ దళాల ఇన్చార్జి ము రళీ, రిటర్నింగ్ అధికారులు, డీఎస్పీలు పాల్గొన్నారు. -
ఇక వాహనంతో పాటే ‘హైసెక్యూరిటీ’
సాక్షి, హైదరాబాద్ : ఇక నుంచి హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ల (హెచ్ఎస్ఆర్పీ)తో పాటే వాహనాలు రోడ్డెక్కనున్నాయి. తాత్కాలిక రిజిస్ట్రేషన్లపై వాహనాలను విడుదల చేసే పద్ధతికి త్వరలో స్వస్తి చెప్పనున్నారు. బండి కొనుగోలు సమయంలో షోరూమ్‌లోనే శాశ్వత రిజిస్ట్రేషన్‌తో పాటు హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్‌ను బిగించి ఇవ్వనున్నారు. మే నెల నుంచి ఈ విధానాన్ని అమలు చేసేందుకు రవాణాశాఖ సన్నాహాలు చేపట్టింది. ఇటీవల కేంద్రం వాహన తయారీదార్లతో జరిపిన సమావేశంలో ఈ అంశంపై చర్చించింది. వాహనం తయారీతో పాటే హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్ ఏర్పాటు చేసి ఇవ్వడం సాంకేతికంగా సాధ్యం కాదని తయారీదార్లు తేల్చారు. అది డీలర్ల స్థాయి లోనే అమలు జరగాలని స్పష్టీకరించారు. ఈ మేరకు కేంద్రం తాజాగా విధివిధానాలను రూపొందించింది. దీంతో రవాణా శాఖ చర్యలు చేపట్టింది. త్వరలో ద్విచక్ర వాహనా లు, కార్లు, తదితర అన్ని రకాల వాహన డీలర్లతో సమావేశం జరిపి మే నెల నుంచి అమలు చేయనున్నట్లు సంయుక్త రవాణా కమిషనర్ సి.రమేష్ ‘సాక్షి’తో చెప్పారు. హెచ్ఎస్ఆర్పీ ఇలా.... వాహనాల భద్రత దృష్ట్యా హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ప్లేట్లను అమర్చాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. ఈ మేరకు రవాణాశాఖ 2013 నుంచి హెచ్‌ఎస్‌ఆర్‌పీని అమలు చేస్తోంది. రాష్ట్రంలో లింక్ ఆటోటెక్ సంస్థకు ఆ బాధ్యతలను అప్పగించారు. మొదట్లో ఆర్టీఏలో నమోదయ్యే వాహనాల డిమాండ్‌కు అనుగుణంగా నంబర్ప్లేట్లను తయారు చేసి ఇవ్వడంలో ఆ సంస్థ విఫలమైంది. ఒక్కో వాహనానికి కనీసం 2 నుంచి 3 నెలల వరకు సమయం పట్టేది.దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఏటా సుమారు 2 లక్షల వాహనాలు రోడ్డెక్కుతుండగా వాటిలో కనీసం సగానికి కూడా అందజేయలేకపోయారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు మరోసారి జోక్యం చేసుకోవడంతో ఆర్టీఏ అధికారులు దీనిపై దృష్టిసారించారు. అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లోనే లింక్ ఆటోటెక్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఆర్టీఏ అధికారుల పర్యవేక్షణలో నంబర్ప్లేట్లను అందజేసేవిధంగా చర్యలు చేపట్టారు. దీంతో 2016 నుంచి కొంత మార్పు వచ్చింది.పెండింగ్ వాహనాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ కనీసం 15 నుంచి 20 రోజుల పాటు వేచి ఉండాల్సి వచ్చేది. మరోవైపు ఈ జాప్యం కారణంగా వాహనదార్లే హెచ్ఎస్ఆర్పీ పట్ల విముఖత ప్రదర్శించారు. దీన్ని ఇప్పుడు అధిగమించే దిశగా రవాణా శాఖ అడుగులు వేస్తోంది. మరింత పకడ్బందీగా... తాజా ఆదేశాలతో బండి కొనుగోలు సమయంలో షోరూమ్‌లోనే హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్ ఏర్పాటు చేసి ఇవ్వనున్న దృష్ట్యా వినియోగదారుడు నిరాకరించే వీలుండదు. అంటే శాశ్వత రిజిస్ట్రేషన్‌తోనే వాహనం బయటకు వస్తుంది.వాహనం ఖరీదులో భాగంగానే దీనిని ఏర్పాటు చేసి ఇస్తారు. హెచ్ఎస్ఆర్పీ కోసం ప్రత్యేకంగా అదనపు రుసుము వసూలు చేయడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.శాశ్వత రిజిస్ట్రేషన్ల కోసం ఆర్టీఏ అధికారులను సంప్రదించవలసిన అవసరం ఉండదు. బండి విడుదలైన వారం, పది రోజుల్లో వాహన యజమాని ఇంటికే ఆర్సీ పత్రాలు స్పీడ్ పోస్టు ద్వారా చేరేలా చర్యలు తీసుకుంటారు. స్పెషల్ నంబర్లపైన ఆన్లైన్లో బిడ్డింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇందుకోసం మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. -
త్వరలో హైసెక్యూరిటీ పాస్‌పోర్ట్‌లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వాసులు మరో 3 నెలల్లో అత్యంత భద్రతా ఫీచర్లున్న హై సెక్యూరిటీ పాస్‌పోర్ట్‌లు అందుకోనున్నారు. ఉన్నత విద్య, వైద్యం, పర్యాటకం, తాత్కాలిక నివాసం తదితర అవసరాల నిమిత్తం విదేశీ పర్యటనలు చేసేందుకు పాస్‌పోర్ట్‌లు తప్పనిసరి. దీంతో మహానగరం పరిధిలో నెలకు లక్షకు పైగా నూతన పాస్‌పోర్ట్‌ల జారీ, పాతవాటి రెన్యువల్స్ జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో హైసెక్యూరిటీ గల ఈ–చిప్‌లు ఉండే పాస్‌పోర్ట్‌లను అందజేసేందుకు హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ అనుమతితో దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్‌ల డిమాండ్ అధికంగా ఉన్న నగరాలకు అత్యంత భద్రతా ఫీచర్లతో పాస్‌పోర్ట్‌లను ముద్రించే ప్రింటింగ్ యంత్రాలను సరఫరా చేయనున్నట్లు పాస్‌పోర్ట్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ యంత్రాలను నాసిక్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఆధ్వర్యంలో నిపుణుల పర్యవేక్షణలో తయారు చేస్తున్నట్లు వివరించారు. మరో 3 నెలల తర్వాత నూతనంగా పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకున్నవారికి, పాతవాటిని రెన్యువల్ చేసుకునేవారికి ఈ–చిప్‌లు ఉన్న అత్యంత భద్రమైన పాస్‌పోర్ట్‌లను అందజేయనున్నారు. నో ట్యాంపరింగ్..: పాస్‌పోర్ట్‌లో అత్యంత కీలకమైన పుట్టినతేదీ, తండ్రి, భార్య, భర్త పేరు, ఆధార్ నంబర్, ప్రస్తుత, శాశ్వత చిరునామా వంటి వ్యక్తిగత వివరాలకు అత్యంత భద్రత కల్పించేందుకే ఈ హైసెక్యూరిటీ పాస్‌పోర్ట్‌లు జారీ చేయాలని విదేశాంగ శాఖ సంకల్పించింది. ప్రస్తుతం జారీ చేస్తున్న 36 పేజీలు లేదా 60 పేజీల బుక్‌లెట్‌లా ఉండే హైసెక్యూరిటీ పాస్‌పోర్ట్‌లో అత్యంత నాణ్యత ఉండే కాగితాన్ని వినియోగించడంతోపాటు పేజీల్లో అంతర్లీనంగా ఈ–చిప్‌లను పొందుపరచనున్నారు. ఒకవేళ ఇతరుల ఫొటో పెట్టి ట్యాంపరింగ్‌కు ప్రయత్నిస్తే ఈ–చిప్‌ల ద్వారా పాస్‌పోర్ట్ కార్యాలయానికి సందేశం అందుతుందని పాస్‌పోర్ట్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. భద్రత పరంగా ఇవి అత్యంత సురక్షితమని తెలిపారు. ఇక ఈ–చిప్ ఉన్న పాస్‌పోర్ట్‌ల జారీకి ప్రస్తుతమున్న చార్జీలే వర్తిస్తాయని చెప్పారు. -
కేంద్ర బలగాలా? రాష్ట్ర బలగాలా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భద్ర త వ్యవహారంపై పీటముడి ఏర్పడింది. తనకు అధికార పార్టీతోపాటు పలువురు అధికారుల నుంచి ప్రాణహాని ఉందని, రాష్ట్ర పోలీసులు కాకుండా ఇతర స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన బలగాల నుంచి భద్రత కల్పించాలని రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై రేవంత్‌రెడ్డి కోరినట్లుగా భద్రత కల్పించాలని ప్రధాన ఎన్నికల అధికారితోపాటు డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గురువారం వికారాబాద్ ఎస్పీ టీఎస్ఎస్పీకి చెందిన 4+4 భద్రతను రేవంత్‌రెడ్డి ఇంటికి పంపించారు. అయితే రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఉండటంతో భద్రతా సిబ్బంది ఆయన వచ్చే వరకు వేచి ఉండాలని ఎస్పీ ఆదేశించారు. ఈ వ్యవహారంపై రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది రజనీకాంత్‌రెడ్డిని సంప్రదించగా తాము కేంద్ర బలగాలు లేదా రాష్ట్రానికి సంబంధం లేదని స్వతంత్ర విభాగం నుంచి భద్రత కోరామని చెప్పారు. అంతే కాకుండా రాష్ట్ర అధికారులపైనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, ఆ మేరకు న్యాయస్థానం పిటిషనర్ రేవంత్‌రెడ్డి కోరినట్లు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ఆదేశించినట్టు ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారమే.. పోలీస్ శాఖ మాత్రం హైకోర్టు ఆదేశాల ప్రకారమే తాము రాష్ట్ర భద్రతను కల్పించేందుకు సిబ్బందిని పంపించామని చెప్పారు. ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల ప్రకారం ఇక్కడ సిబ్బందితోనే భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఒకవేళ రేవంత్‌రెడ్డి ఆ భద్రతను వద్దనుకుంటే అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు సమాధానమిస్తామని స్పష్టం చేశారు. అటు రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది మాత్రం ఇది కోర్టు« ధిక్కరణ కిందకు వస్తుందని, తాము కోర్టు ఆదేశాల ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. -
చెన్నైలో బీజేపీ ఆఫీసు వద్ద భారీ భద్రత
-
బేగంపేట ఎయిర్‌పోర్టులో హైసెక్యూరిటీ
సాక్షి, హైదరాబాద్ : బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో తెలంగాణ ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాటు చేసింది. 28వ తేదీనుంచి ప్రారంభం కానున్న అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సుకు, మెట్రో రైలు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ విచ్చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టులో విమానం దిగనున్నారు. అందుకోసం బేగంపేట్ ఎయిర్‌పోర్టులో ఎస్పీజీ తనిఖీలు నిర్వహించింది. ధాని మోదీ ల్యాండింగ్, టేక్ ఆఫ్ ప్రాంతాలను పరిశీలించింది. ఇప్పటికే బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఎస్పీజీ అధీనంలో ఉంది. బేగంపేట్ పరిసర ప్రాంతాల్లోనూ పోలీసులు నిఘా పెంచారు. భద్రతా ఏర్పాట్లను సీపీ వి.వి.శ్రీనివాస్ రావు పరిశీలించారు. -
‘చలో అసెంబ్లీ’ కట్టడికి భారీ భద్రత
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. రైతు సమస్యలపై సర్కారు నిర్లక్ష్యానికి నిరసనగా శుక్రవారం భారీ స్థాయిలో అసెంబ్లీ ముట్టడి చేపడతామంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ‘చలో అసెంబ్లీ’ని నియంత్రించేందుకు పోలీసుశాఖ పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసింది. అసెంబ్లీకి మూడు కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ను అమల్లోకి తెస్తూ నగర పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం నలగురికి మించి ప్రజలు ఒకేచోట గుమిగూడటం, సమావేశాలు నిర్వహించడం నిషేదం. అయితే వేలాది మంది కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండటంతో వారిని కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా చెక్‌పోస్టులు, మూడంచెల బందోబస్తు వ్యవస్థను పోలీసులు ఏర్పాటు చేశారు. వివిధ మార్గాల నుంచి అసెంబ్లీ వైపునకు వచ్చే దారుల్లో ఆందోళనకారులను అరెస్ట్ చేసేందుకు వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించారు. బస్సులు, ఆటోల్లో అప్పటికప్పుడు అసెంబ్లీ ఎదుట దిగి ముట్టడికి యత్నించే వారిని నియంత్రించేందుకు అసెంబ్లీ దారిలో 500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. సచివాలయం, రవీంద్ర భారతి, నాంపల్లి రైల్వేస్టేషన్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఇందిరా పార్క్ తదితర ప్రాంతాల నుంచి ఆందోళనకారులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అసెంబ్లీకి కిలోమీటర్ దూరంలో ఒక దశ బందోబస్తు ఏర్పాటు చేయగా, గన్‌పార్క్, ట్రాఫిక్ కంట్రోల్ రూం, రవీంద్ర భారతి వద్ద రెండో దశ బందోబస్తు, అసెంబ్లీ వద్ద మూడో దశ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 3 వేల పోలీసులను బందోబస్తు కోసం మోహరించారు. జిల్లాల్లో ముందస్తు అరెస్టులు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో అన్ని జిల్లాల్లోని హెడ్క్వార్టర్లు, అర్బన్ ప్రాంతాల్లో కార్యకర్తలు, ఆందోళనకారులను పోలీసు యంత్రాగం ముందుగానే అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో బడా నేతలను ప్రత్యేక బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. హైదరాబాద్‌లో కాంగ్రెస్ యూత్, ఎన్ఎస్యూఐ నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
పంతం నెగ్గించుకున్న ఏపీ ప్రభుత్వం
-
శ్రీరామనవమి శోభాయాత్రకి భారీ భద్రత
-
తాజ్‌మహల్ వద్ద భద్రత కట్టు దిట్టం
-
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆంక్షలు
శంషాబాద్ జిల్లా: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అధికారులు ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ వేడుకలు, భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా పౌరవిమానయానశాఖ ఉత్వర్వుల మేరకు డిసెంబర్ 30 నుంచి జనవరి 30 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ సమయంలో విజిటర్స్ ని ఎయిర్‌పోర్టులోకి అనుమతించరు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఆంక్షలు అమలులో ఉంటాయని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. -
తెరపైకి హై సెక్యూరిటీ
తిరుపతి క్రైం: అర్థంకాని అక్షరాలు, సినీ హీరోల బొమ్మలు, రాజకీయ పార్టీల గుర్తులు, క్షుణ్ణంగా చూసినా గుర్తుపట్టలేని విధంగా వాహనాలకు నంబర్ బోర్డులు ఏర్పాటుచేసుకుంటున్నారు. వీటిని దుండగులు సులభంగా మార్చేసి చోరీలకు పాల్పడుతున్నారు. మరికొం దరు ఒకే బోర్డును రెండు మూడు వాహనాలకు అమర్చి ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతున్నారు. వీటికి చెక్ పెట్టడానికి హైసెక్యూరిటీ బోర్డు విధానాన్ని తీసుకురావాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశిం చింది. తొలిదశలో కొత్త వాహనాలకు, మలి దశలో పాత వాహనాలకు ఏర్పాటు చేయాలని సూచిం చిం ది. కోర్టు ఉత్తర్వులకనుగుణంగా ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. జిల్లాలో మార్చి 2014 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ పూర్తయిన వాహనాల కు హైసెక్యూరిటీ నంబర్ బోర్డుల ప్రక్రియను ప్రారంభించింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి పై కొరడా ఘుళిపించాలని కూడా నిర్ణయించింది. ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో హైసెక్యూరిటీ బోర్డుల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. 2001లోనే ప్రతిపాదనలు దేశంలో హైసెక్యూరిటీ విధానం అమలుకు 2001లో ప్రతిపాదనలు పెట్టారు. దేశరాజధాని ఢిల్లీలో 2003 లో ఈ విధానం అమలులోకి వచ్చింది. మిగిలిన రాష్ట్రాల్లో కూడా 2013 డిసెంబర్ 11 తర్వాత కొత్త రిజిస్ట్రేషన్ అయిన అన్ని వాహనాలకు బోర్డులు తప్పకుండా అమర్చాల్సిందేనని ఉత్తర్వులు వెలువడ్డాయి. పాత వాహనాలకు వర్తింపు అన్ని రకాల పాత వాహనాలకు హైసెక్యూరిటీ విధానాన్ని వర్తింపచేయాలని కోర్టు ఆదేశించింది. కేంద్ర మోటారు వాహనాల చట్టం 1989లోని రూల్ 50 ప్రకారం ప్రతి వాహనానికీ విధిగా హైసెక్యూరిటీ బోర్డు అమర్చాలి. ఇటీవల రవాణా కమిషనర్ పాత వాహనాలకు కూడా బోర్డులు అమర్చుకోవాలని ప్రకటించారు. ఆగస్టు 31 వరకు గడువు ఇచ్చారు. ఆచరణలో అది సాధ్యం కాలేదు. బోర్డుల పట్ల వాహనదారులు ఆసక్తి చూపలేదు. ప్రభుత్వ పరంగా కట్టుదిట్టమైన ఆదేశాలు లేకపోవడంతోనే పూర్తిస్థాయిలో అమలుకాలేదని అ«ధికారులు చెబుతున్నారు. ఉపయోగాలు ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినా, నిబంధనలు అతిక్రమించినా కెమెరాలు బంధిస్తాయన్న అవగాహన వాహనదారుల్లో ఉంటుంది. వాహనాల వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. దేశవ్యాప్తంగా యూనిక్ కోడ్‌తో వాహన వివరాలను రాబట్టవచ్చు. వాహనాల చోరీలు అరికట్టవచ్చు. యూనిక్ కోడ్ సాయంతో వాహనం ఎటువైపు ప్రయాణించిందో కూడా తెలుసుకోవచ్చు. విచ్చల విడిగా బోర్డుల తయారీని నియంత్రించవచ్చు అన్ని తరహా వాహనాలు ఒకే విధంగా బోర్డులు కలిగి ఉంటాయి. పటిష్టమైన లాకింగ్ సిస్టమ్‌తో బోర్డులు అమర్చడం, మళ్లీ వాటిని తీసేందుకు అవకాశం లేకపోవడం వల్ల భద్రత ఉంటుంది. అమలులో లోపాలు మార్కెట్లో అసలుతో పోటీగా నకిలీ బోర్డులు చెలామణి అవుతున్నాయి. పోల్చడం కష్టంగా మారింది. బోర్డుల్లో హోలోగ్రామ్, యూనిక్ కోడ్‌తో దూ రం నుంచి వాహనాలను పసిగట్టే చిప్ అమర్చలేదు. ∙హైసెక్యూరిటీ బోర్డులు అమర్చని పక్షంలో అపరాధ రుసుం, చట్టపరమైన చర్యలపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడం. ఇప్పటికే సరఫరా అయిన బోర్డుల్లో నాణ్యత లోపించడం, అక్షరాలు సరిగా కనిపించకపోవడంతో వాహనదారుల నుంచి అసంతప్తి వ్యక్తం కావడం. -
రొట్టెల పండుగకు భారీ బందోబస్తు
-
ఆక్నూర్ సెక్టార్లో ఆర్మీ అప్రమత్తం
-
బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత
– హైటెక్ టెక్నాలజీతో దొంగలకు చెక్ – 3వేల మందితో బందోబస్తు – గరుడ సేవకు అదనంగా 1000 మంది – 150 మందితో పోలీస్ సేవాదళ్æ – తిరునగరంపై డ్రోన్ కెమెరా కన్ను – డీఐజీ ప్రభాకరరావు తిరుపతి క్రై ం: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. హైటెక్ టెక్నాలజీతో దొంగలను నియంత్రించేందుకు ప్రత్యేక యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఏర్పాట్లు, భద్రతపై అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకరరావు ఏమన్నారంటే.. ఆయన మాటాల్లోనే.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పేజ్–1 క్రింద 3వేల మందితో గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నాం. గరుడ సేవ రోజున పేజ్–2 కింద అదనంగా మరో 1000 మంది సిబ్బందితో బందోబస్తును నిర్వహించనున్నాం. – వచ్చే నెల 8వ తేదీన పెరటాసి నెల 4వ వారం, దసరా సెలవులకు, ఈసారి గరుడసేవకు, పెరటాసి 5వ శనివారానికి సుమారు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు జనసందోహం ఉంటుందని అంచనా వేశాం. –ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. గరుడసేవ రోజున ద్విచక్రవాహనాలను తిరుమలకు అనుమతించం. తిరుపతిలోనే పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశాం. –తిరుమలలో ప్రై వేట్ వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు ప్రస్తుతం ఉన్న బాలాజీ బస్టాండ్‌లో ఏర్పాటు చేశాం. – ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా పీఎస్ఈ–3, రాంబగీచా వద్ద ఆగాలి. –శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. అందుకోసం తిరుమలలో 7 మొబైల్ సెంటర్లను ఏర్పాటు చేశాం. లేపాక్షి, ఆర్టీసీ బస్టాండ్, రాంబగీచ బస్టాండ్, ఎస్వీ మ్యూజియం, గోకులం, పాపవినాసం, అలిపిరి చెక్‌పోస్టు, మామండూరు ఔట్‌పోస్టు వద్ద ఈసెంటర్లు ఉన్నాయి. – అలాగే 14 మొబైల్ క్లినిక్‌లను ఏర్పాటు చేశాం. అందులో 6 మొబైల్ క్లినిక్‌లు ఘాట్‌రోడ్డులో తిరుగుతూ ఉంటాయి. అక్కడ నిలిచిపోయిన వాహనాలను మరమ్మతులు చేసి పంపుతుంటాయి. మిగతావన్నీ తిరుమల పరిసరప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయి. – తిరుపతిలో రైల్వేస్టేషన్, బస్టాండ్, అలిపిరి చెక్ పాయింట్, అలిపిరి లింక్ బస్టాండ్ వద్ద హెల్ప్సెంటర్లను ఏర్పాటు చేశాం. ఇక్కడ ప్రజలకు కావాల్సిన సమాచారం ఇస్తారు. అంతేకాకుండా ఇందులో ఓ ఎసై ్స స్థాయి అధికారి ఉంటారు. ఏదైనా సమస్య వస్తే అక్కడిక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. – దొంగలను నియంత్రించడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. క్రై ం ఏఎస్పీ ఆధ్వర్యంలో ఆ సిబ్బంది మొత్తం పని చేస్తారు. వీరి వద్ద 50 ఎఫ్‌ఐఎన్‌ఎస్ (ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అండ్ సర్చ్) మిషన్లు ఉంటాయి. ఇది అంతా హైటెక్ టెక్నాలజీ దొంగ దొరికిన వెంటనే ఫింగర్ ప్రింట్ తీసుకుంటాం. అందులో 6 లక్షల వేలిముద్రలు ఉన్నాయి. వాడు పాతనేరస్తుడైతే స్పాట్లోనే వాడి చిట్టా బయటకు వస్తుంది. జీరో శాతం క్రై ంలు నమోదైయేందుకు చర్యలు తీసుకుంటున్నాం. –పుష్కరాల తరహాలో మొదటి సారిగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 150 మందితో పోలీస్ సేవాదళ్‌ను ఏర్పాటు చేశాం. వీరు కేవలం వృద్ధులకు, మహిళలు, చిన్నపిల్లలకు ప్రత్యేక ప్రతిభావంతులకు వాహన సేవలను చూపించేందుకు సహకరిస్తారు. వీరు కేవలం ఈ పనులకే కేటాయించాం. –తిరుపతిలో ఉన్న వసతి గృహాల్లో కూడా బ్రహ్మోత్సవాల వరకు సిబ్బందిని ఏర్పాటు చేస్తాం. – తిరుమలలో ఇప్పటికే 400 పైగా కెమెరాలు ఉన్నాయి. వీటిని పెంచి రాంబగీచ వద్ద ఓ పోలీస్ కంట్రోల్‌ను ఏర్పాటు చేస్తాం. – 5 సంవత్సరాల లోపు చిన్నారులకు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద, తిరుమలకు వెళ్లే 2వైపులా ఉన్న నడకదారుల భక్తులకు ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కంకణం కడుతాం. దానిపై వారి కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్ రాస్తాం. దీనిద్వారా ఎవరైనా తప్పిపోయినా సకాలంలో తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. దీన్ని అమలు చేసేందుకు చూస్తున్నాం. – నగరంపై ఒక డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేస్తాం. ముందుగా ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా కమాండెంట్ కంట్రోల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తాం. విజయవంతంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. – గతంలో 2011లో ఒక బ్రహ్మోత్సవం, 2012లో ఒక బ్రహ్మోత్సవం అర్బన్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉంది. తిరిగి ఇదే జోన్‌కు డీఐజీగా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. -
బోనాలకు భారీ భద్రత
-
‘హై సెక్యూరిటీ’ గందరగోళం
పాత వాహనాలకు తప్పనిసరి బోర్డుల తయారీలో నాణ్యతా లోపం వాహనదారుల గగ్గోలు మర్రిపాలెం : రక్షణ, భద్రత లక్ష్యంగా అమలులోకి తెచ్చిన ‘హై సెక్యూరిటీ’ నంబర్ బోర్డుల ప్రక్రియ తొలి నుంచి విమర్శలకు దారితీస్తోంది. మోటార్ వాహనాల చట్టంలో ప్రమాణాలను తయారీ సంస్థ పాటించడం లేదు. ధరలకు తగ్గట్టుగా బోర్డులు ఉండటం లేదు. జిల్లాలో 2014 మార్చి 10 నుంచి ై‘హె సెక్యూరిటీ’ బోర్డుల ప్రక్రియ అమలులోకి వచ్చింది. 2013 డిసెంబర్ 11 తర్వాత రిజిస్ట్రేషన్ కాబడ్డ వాహనాలకు ‘హై సెక్యూరిటీ’ తప్పనిసరి చేశారు. అన్ని తరహా పాత వాహనాలు 2015 డిసెంబర్ 15 లోపుగా బోర్డులు అమర్చుకోవాలని సర్వోన్నత న్యాయ స్థానం తీర్పులో వెల్లడించింది. గడువు ముగియడంతో ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు తెరపైకి తెచ్చింది. ఆగస్టు 31లోగా అన్ని తరహా పాత వాహనాలు ‘హై సెక్యూరిటీ’ కలిగి ఉండాలని ప్రకటించడంతో ఉత్కంఠ నెలకొంది. వాహనదారుల గగ్గోలు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కు ‘హై సెక్యూరిటీ’ని ముడిపెట్టడంతో ఇప్పటికే వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. బోర్డు ధర చెల్లించిన తరువాత రిజిస్ట్రేషన్ జరపడంతో సర్వత్రా విమర్శిస్తున్నారు. నాణ్యత లేని బోర్డులు బలవంతంగా అప్పగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రెండు, మూడు నెలల వ్యవధిలో బోర్డులో అక్షరాలు చెరిగిపోవడంతో డొల్లతనం బయటపడుతోంది. హై సెక్యూరిటీ బోర్డుకు ధర చెల్లించి మళ్లీ స్టిక్కరింగ్ వ్యాపారుల వద్ద బోర్డులు కొనుగోలు చేయడం జరుగుతోంది. అట కెక్కిన ముఖ్యమంత్రి ప్రకటన ‘హై సెక్యూరిటీ బోర్డు’ ప్రక్రియ అమలు సక్రమంగా జరగకపోవడంతో కొత్తగా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెండిటీ(ఆర్ఎఫ్ఐడీ) విధానం తెరపైకి తెచ్చింది. గతేడాది మే నెలలో రవాణా అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్ఎఫ్ఐడీ విధానం అమలు చేయాలని అందుకు తగ్గట్టుగా ప్రతిపాదనలు జరగాలని ఆదేశించారు. సింగపూర్, మలేషియా, జపాన్, తదితర దేశాలలో ఆర్ఎఫ్ఐడీ విధానం అమలులో ఉంది. బోర్డులో ఒక చిప్ అనుసంధానంతో వాహన వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. వాహనం ఎక్కడి నుంచి ఎటువైపు ప్రయాణిస్తుందో పసిగట్టడటం ఆర్ఎఫ్ఐడీ ప్రత్యేకత. కానీ సీఎం ప్రకటన అటకెక్కింది. దాని గురించి మళ్లీ ఆలోచన కూడా చేయలేదు. నిబంధనలు బేఖాతర్ నాణ్యత గల లోహంతో బోర్డుల తయారీ జరగాలి. ప్రభుత్వ చిహ్నంతో హాలోగ్రామ్ ఉండాలి. యూనిక్ కోడ్‌తో దూరంలో గల వాహనాలను పసిగట్టే లేజర్ చిప్ అమర్చాలి. అయితే పరిశీలనలో తక్కువ నాణ్యత గల లోహపు రేకుతో బోర్డు తయారవుతోంది. జీపీఎస్‌కు అనుసంధానంగా లేజర్ చిప్ బోర్డులో అమర్చడం లేదు. ఆ ప్రస్తావన సంస్థ తీసుకురావడం లేదు. రాబోయే రోజుల్లో బోర్డులకు చిప్ అమర్చినా ఇప్పటి వరకూ మంజూరు కాబడ్డ బోర్డుల పరిస్థితి ఏమిటీ! అనేది ప్రశ్నార్థకం. ఇతర రాష్ట్రాలలో బోర్డుకు ఐదేళ్ల వారంటీ సంస్థలు ప్రకటిస్తుండగా మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. రాష్ట్రంలో హై సెక్యూరిటీ నంబర్ బోర్డుల ప్రక్రియ నిలిపివేయనున్నట్టు గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బోర్డుల తయారీలో నాణ్యత ప్రమాణాలు లోపించడం, వాహనదారులు ఆసక్తి చూపకపోవడంతో సేవలు నిలిపివేతకు సిద్ధపడింది. ప్రభుత్వం నుంచి అధికారకంగా ఉత్తర్వులు వెల్లడికాకపోవడంతో బోర్డుల ప్రక్రియ యథావిధిగా జరుగుతోంది. ఇక నుంచి అన్ని తరహా పాత వాహనాలకు కూడా ‘హై సెక్యూరిటీ’ బోర్డులు తప్పక కలిగి ఉండాలని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో వాహనదారులలో గందరగోళం నెలకొంది. -
పారిస్‌లో వాతావరణ సదస్సుకు భారీ భద్రత
-
ఛోటాకు బడా సెక్యూరిటీ
-
మొహర్రం సందర్భంగా చార్మినార్ వద్ద భారీ బందోబస్తు
-
నిమజ్జనోత్సవానికి గట్టి భద్రత
-
హై సెక్యూరిటీ నెంబర్‌ప్లేట్ల కోసం హైరిస్క్
-
‘నిఘా’ పటిష్టం.!
నేర నియంత్రణకు ప్రత్యేక చర్యలు సరిహద్దులపై డేగకన్ను ప్రధాన కేంద్రాలు, రహదారులపై సీసీ కెమెరాల ఏర్పాటుకు కసరత్తు పోలీస్స్టేషన్లలో ఐప్యాడ్లు మిర్యాలగూడ టౌన్: జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు.. హైవేపై అక్రమ సరుకుల రవాణా.. దొంగలు, దోపిడీదారులు ఇలా నీలగిరి నేరగాళ్లకు అడ్డాగా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక విమర్శకులకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదనుకుందో ఏమో తెలియదు కానీ జిల్లా పోలీస్‌యంత్రాగం నేర నియంత్రణకు పక్కా చర్యలకు ఉపక్రమించినట్టు తెలిసింది. జిల్లాలో ఎవరెవరు చొరబడుతున్నారు..రహదారుపై.. పట్టణాల్లో ఏం జరుగుతోంది.. ఎప్పటికప్పుడు నాకు తెలియాల్సిందే అంటూ ఎస్పీ హుకూం జారీ చేసినట్టు సమాచారం. అందుకోసం నిఘా వ్యవస్థను పటిష్టపరిచేందుకు నడుంబిగించినట్టు తెలిసింది. ఇప్పటికే ఫేస్బుక్, వాట్సప్, షీ టీమ్స్ తదితర నూతన చర్యలు తీసుకున్న ఆయన మరో ముందడుగు వేశారు. అంతటా సీసీ కెమెరాలు ముఖ్యంగా ఉగ్రవాదులు, దోపిడీదారులు సు లువుగా జిల్లాలో ప్రవేశించి కార్యకలాపాలను చక్కదిద్దుకుని తప్పించుకుపోతున్నా కనిపెట్టలేని చేతకానితనాన్ని రూపుమాపుకునేందుకు పోలీస్శాఖసత్వర చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అన్ని పట్టణ, మండలకేంద్రాలు, రహదారులపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇటీవల జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, కేంద్ర ఇంటెలీజెన్స్ వర్గాల హెచ్చరికలతో పోలీస్స్టేషన్లలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. స్టేషన్‌కు ఎవరెవరు వస్తున్నారు.. వారి కదలికలపై కూడా కన్నేసి ఉంచాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. పోలీస్ యంత్రంగం కేసులకు సంబంధించిన స్టేషన్ హౌస్ఆఫీసర్లకు ప్రత్యేకంగా ఐప్యాడ్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేపడుతోంది. వీటిని అనుసంధానం చేస్తూ ప్ర త్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొం దించి పోలీస్స్టేషన్ల పనితీరుతో పాటు కేసులను పర్యవేక్షించనున్నారు.పోలీస్ యంత్రంగా ముం దుగా నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, భువనగిరిలలోని ప్రధాన కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది. విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లకు.. జిల్లాల్లోని అన్నీ మున్సిపాలిటీలలో సెంట్రల్ లైటింగ్ విద్యుత్ స్తంభాలతో పాటు వివిధ సిమెంటు పరిశ్రమలు ప్రధాన రోడ్లపై ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లకు సీసీ కెమరాలను ఏర్పాటు చేచేయాలని పోలీస్ యంత్రంగం యోచిస్తుంది. దీని కోసం ఇప్పటికే మున్సిపల్ శాఖ సహా యాన్ని కోరింది. ప్రజా భ ద్రత దృష్యా ప్రభుత్వంతో పాటు పోలీస్ యంత్రంగం వాణిజ్య, వ్యాపార దుకాణాల వద్ద సొంతంగా సీసీ కెమరాలను ఏర్పాటు చేసుకోవాలని త్వరలో అదేశాలు ప్రభుత్వం నుంచి వెలువడనున్నాయి. పోలీస్స్టేషన్లలో కూడా... మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని హాలియా, మిర్యాలగూడ, హుజూర్నగర్ సర్కిల్ పరిధిలో సుమారు 17 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో రెండు ట్రాఫీక్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కాగా మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మాత్రమే సీసీ కెమరాను ఏర్పాటు చేశారు. మిర్యాలగూడ సబ్ డివిజనల్ కార్యాలయంతో పాటు సర్కిల్లోని వాడపల్లి, టూ టౌన్, మిర్యాలగూడ రూరల్, వేములపల్లి, హాలియా సర్కిల్లో సాగర్, పెద్దవూర, హలియా, నిడ్మనూరు, త్రిపురారం, హూజూర్‌నగర్ సర్కిల్లో హుజూర్నగర్, మఠంపల్లి, నేరేడుచర్ల, గరిడేపల్లి పోలీస్ స్టేషన్లతో పాటు మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌లలో ట్రాఫిక్ పోలీస్స్టేషన్లు ఉన్నాయి. కాగా సుమారు 25వేల రూపాయల విలువ గల ఈ సీసీ కెమెరాలను త్వరలోనే అన్ని పోలీస్స్టేషన్లలో ఏర్పాటు చేసేందుకు కూడా పోలీస్ యంత్రగం చర్యలు చేపడుతోంది. వ్యాపార, వాణిజ్య దుకాణాల్లోనూ.. ప్రైవేటు వ్యాపార, వాణిజ్య కేంద్రాల వద్ద దుకాణాదారులు సొంతంగా సీసీ కెమరాలను ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ యంత్రాంగం కోరుతోంది. నేరాల తీవ్రతను తగ్గించేందుకు అపార్ట్‌మెంటులు, ప్రైవేటు ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, హోల్ సెల్ దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లతో పాటు గెజిటెడ్ కమ్యూనిటీ కాలనీలు, మున్సిపాలిటీలు,సినిమా హాళ్లు, మందిరాలు, దేవాలయాలలో సీసీ కెమరాలు తప్పని సరి కానున్నాయి. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే ఈ సీసీ కెమెరాల టెపులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులో.. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాలకు నల్లగొండ జిల్లా సరిహద్దు కావడంతో నిఘూ నేత్రాన్ని పటిష్టపరిచేందుకు రెండు రాష్ట్రాల సరిహద్దులే కీలకం కానున్నాయి. దీంతో ప్రధానంగా మిర్యాలగూడ, కోదాడ, మేళ్లచెరువు మండలా రాష్ట్ర సరిహద్దులో ఉండడండతో భద్రతతను పటిష్టపెంచేందుకు చర్యలు తీసుకుంటుంది. కాగా జిల్లాలోని అన్నీ ఆర్టీసీ బస్స్టేషన్లలో సీసీ కెమరాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్‌లో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వారి ఆగడాలకు కల్లెం వేయడానికి సంస్థ యాజమాన్యమే బస్టాండ్, పరిసరాల్లో సీసీ కెమరాలను ఏర్పాటు చేసేందుకు పోలీసులు అదేశాలను జారీచేయనున్నారు. -
బాబు ఇంటి వద్ద భారీగా బలగాలు
హైదరాబాద్ సిటీ: ఓటుకు నోటు కేసు అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటి వద్ద పోలీసు బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు. మొన్నటి వరకు తెలంగాణ పోలీసులు ఆయన ఇంటి వద్ద గస్తీ నిర్వహించగా తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం, స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో భేరసారాలు జరుపుతున్న వ్యవహారంపై ఇక్కడి పోలీసులు సరిగ్గా స్పందించలేదంటూ చంద్రబాబు రెండు రోజులక్రితమే అక్కడి పోలీసులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో రెండు రోజుల నుంచి ఆయన ఇంటి వద్ద బందో బస్తును భారీగా ఏర్పాటు చేశారు. కర్నూలు నుంచి అదనంగా ఓ ప్లటూన్ బలగాలను ఇక్కడ మోహరించారు. ఇప్పటికే తెలంగాణ స్పెషల్ పోలీస్ ప్లటూన్ ఇక్కడ విధి నిర్వహణలో ఉండగా, వీరిని రోడ్డుపైన విధుల్లో వేసి కర్నూలు నుంచి వచ్చిన స్పెషల్ పోలీసులను ఇంటి వద్ద మోహరించారు. అలాగే 30 మంది గ్రేహౌండ్స్ పోలీసులను, 30 మంది ఆక్టోపస్ పోలీసులను రప్పించారు. వీరూ రెండు రోజుల నుంచి చంద్రబాబు ఇంటి వద్ద మోహరించారు. అలాగే ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ పోలీసులు కొత్తగా ఎనిమిది మంది చేరారు. చంద్రబాబు నివాసిత ప్రాంతమే కాకుండా చుట్టుపక్కల రోడ్లన్నీ పోలీసు నిఘాలో ఉండిపోయాయి. చీమ చిటుక్కుమన్నా మేల్కొనే విధంగా బలగాలను మోహరించారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ రోడ్డుపైన ఎవరి వెళ్లినా వారి వివరాలు సేకరిస్తున్నారు. అవసరమైన వారి పత్రాలను కూడా తనిఖీ చేస్తున్నారు. -
గన్నవరం బయల్దేరిన చంద్రబాబు
-
రాహుల్పర్యటనకు భారీబందోబస్తు
-
నగరంలో భారీ బందోబస్తు
చార్మినార్/అత్తాపూర్ : నగరంలోని పాతబస్తీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు శుక్రవారం ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన తీవ్రవాదుల అంత్యక్రియల నేపథ్యంలో చిన్నచిన్న అవాంఛనీయ సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు శుక్రవారం ప్రార్థనలను దృష్టిలో పెట్టుకొని చార్మినార్, మక్కామసీద్ ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి పాతబస్తీలో పరిస్థితులను పర్యవేక్షించారు. ఆయనతో పాటు అడిషినల్ సీపీ అంజన్‌కుమార్, సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ ఉన్నారు. అదేవిధంగా అత్తాపూర్ లో పోలీసులు ముందు జాగ్రత్తగా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే రాజేంద్రనగర్ పోలీసులు అత్తాపూర్‌లోని గురుద్వారా జండా వద్ద భారీ బలగాలు మోహరించాయి. -
ఒబామా పర్యటనకు భారీ భద్రత
న్యూఢిల్లీ: ఒబామా భారత పర్యటన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలో కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేసింది. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యవేక్షణలో ఏడంచెల నిఘా వ్యవస్థ, ప్రత్యేక రాడార్లతో గగనతల నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఢిల్లీ వీధుల్లో పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిరంతరం కంట్రోల్ సిస్టం ద్వారా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. ఒబామా వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆగ్రా, న్యూఢిల్లీలలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అంతేకాకుండా నగరంలోని అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి తీవ్రవాద నిరోధక బలగాలను మోహరించారు. నగర వ్యాప్తంగా 15 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 80 వేల మంది సాధారణ పోలీసు సిబ్బందిని, 20 వేల మంది పారామిలిటరీ బలగాలను మోహరించారు. -
తగ్గిన ‘హై సెక్యూరిటీ’
మర్రిపాలెం : ‘హై సెక్యూరిటీ’ నంబర్ ప్లేట్లకు ఆదరణ త గ్గుతోంది. రక్షణ, భద్రత లక్ష్యంగా అమలులోకి వచ్చిన ‘హై సెక్యూరిటీ’ విధానం సక్రమంగా అమలు కావడంలేదు. కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాహనాలకు హై సెక్యూరిటీ బోర్డులు తప్పక అమర్చాలన్న ఆదేశాలను వాహనచోదకులు పట్టించు కోవడంలేదు. సంబంధిత అధికారులు కూడా శ్రద్ధ చూపకపోవడంతో హై సెక్యూరిటీ విధానం నిర్లక్ష్యానికి గురవుతోంది. కానరాని నాణ్యత ప్రమాణాలు గతేడాది డిసెంబర్ 11 తర్వాత కొనుగోలు చేసిన వాహనాలకు హై సెక్యూరిటీ బోర్డుల ప్రక్రియను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ ఏడాది మార్చి రెండో వారం నుంచి వాహనాలకు బోర్డులు అమర్చడం జరుగుతోంది. బోర్డుల నాణ్యత పాటించకపోవడంతో వాహనచోదకులు రవాణా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బోర్డుల తయారీ సంస్థ ‘లింక్ ఆటో టెక్’కు అధికారులకు సూచనలు చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. అయినా మార్పు లేకపోవడంతో యజమానులు కొనుగోలు చేయడం తగ్గించారు. తయారీ సంస్థ నిబంధనలు పాటించకపోయినా సంబంధిత అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడంపై సర్వత్రా విమర ్శలు వినిపిస్తున్నాయి. తగ్గిన డిమాండ్ కొత్త రిజిస్ట్రేషన్ వాహనాలన్నీ దాదాపు స్టిక్కరింగ్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. ‘హై సెక్యూరిటీ’లో లోపాలు సాకుగా చూపించి యజమానులు సామాన్య బోర్డులు అతికిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో బోర్డులకు ఆయా సంస్థలు ఐదేళ్ల వారంటీని ప్రకటిస్తున్నా మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ‘హై సెక్యూరిటీ’ బోర్డుల బుకింగ్‌లు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. నెలకు నాలుగు వేలకు పైగా టూ వీలర్స్ రిజిస్ట్రేషన్లు కాగా దాదాపు వెయ్యి బోర్డులకు బుకింగ్ ఉంటోంది. కేవలం 10 శాతం మంది మాత్రమే కార్లకు ‘హై సెక్యూరిటీ’ బోర్డులు కోరుకుంటున్నారు. -
తగ్గిన ‘హైసెక్యూరిటీ’..
వాహనాలకు అమర్చే హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లకు డిమాండ్ బాగా తగ్గింది. ప్రతి వాహనానికి హైసెక్యూరిటీ నంబర్లు అమర్చుకోవాలని ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లకు గిరాకీ బాగానే ఉంది. అప్పట్లో వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిలో 90 శాతం మంది ఈ నంబర్ ప్లేట్లను తీసుకున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పాత నంబర్లు ఉంటాయా..?రిజిస్ట్రేషన్ మారుతుందా..? లేదా అనేది తెలియక వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. కొత్త రాష్ట్రంలో తీసుకున్న నంబర్లుతో సరిపెట్టుకుందామని... హైసెక్యూరిటీ నంబర్లు వైపు ఎవరూ వె ళ్లడంలేదు. గత నెల 18 తేదీ నుంచి ఆర్టీఏ అధికారులు కొత్త నంబర్లు కేటాయిస్తున్నా వాటిలో 30 శాతం మంది మాత్రమే హైసెక్యూరిటీ నంబర్లు బుక్ చేసుకుంటున్నారు. గత నెల 18వ తేదీ నుంచి ఇప్పటి వరకు సుమారు ఆరు వేల మంది వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయించుకోగా అందులో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను కేవలం 15 వందల మంది మాత్రమే బుక్ చేసుకున్నారు. ఒకే కౌంటర్‌తో ఇబ్బందులు.. ఖమ్మం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో లెర్నింగ్ లెసైన్స్ కోసం వచ్చే వారికి ఒకే కౌంటర్ ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వేలి ముద్ర తప్పనిసరని ప్రభుత్వం నిర్ణయించడంతో ఒకే కౌంటర్లో గంటల తరబడి లైన్లో నిల్చుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ ఇబ్బందులను తొలగించాలని పలువురు కోరుతున్నారు. -
భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు
-
హైసెక్యూరిటీ ప్లేట్లు జారీలో నిర్లక్ష్యం
విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్: హైసెక్యూరిటీ ప్లేట్లు జారీ చేయడంలో లింక్ ఆటో టోక్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ నిర్లక్ష్యం వహిస్తోంది. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాటిలో 20 శాతం వాహనాలకు కూడా హైసెక్యూరిటీ ప్లేట్లను అమర్చలేదు. వేలల్లో వాహనాలు రిజిస్ట్రేషన్ అయినప్పటికీ వందల సంఖ్యలో కూడా వాహనాలకు హైసెక్యూరిటీ ప్లేట్లు ఏర్పాటు చేయలేదు. వాహన యాజమానులకు అవగాహన కల్పించడంలో ఆ సంస్థ విఫలమైంది. హైసెక్యూరిటీ ప్లేట్ ఉన్న వాహనం దొంగతనానికి గురైతే లేబర్ కోడ్ ఆధారంగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అన్ని వాహనాలకు ఒకే విధమైన ప్లేట్లు ఉంటాయి. ఎటువంటి రాతలకు ఆస్కారం ఉండదు. 2014 మార్చి ఒకటో తేదీన రవాణా శాఖ కార్యాలయంలో హైసెక్యూరిటీ ప్లేట్లు జారీ పక్రియ ప్రారంభమైంది. మార్చి ఒకటో తేదీ నుంచి ఇంతవరకు 3500 వాహనాలు రిజిస్ట్రేషన్ కాగా, ఇంతవరకు 237 వాహనాలకు మాత్రమే హైసెక్యూరిటీ ప్లేట్లను అమర్చారు. ఆసక్తి చూపని వాహనదారులు హైసెక్యూరిటీ ప్లేట్లు ఏర్పాటుకు వాహనదారులు ఆసక్తి కనబరచడం లేదని లింక్ ఆటోటెక్ ప్రవేట్ లిమిటెడ్ సూపర్వైజర్ చంద్రశేఖర్ తెలిపారు. టువీలర్ వాహనాలకు హైసెక్యూరిటీ ప్లేట్‌కు 245, ఫోర్ వీలర్ వాహనాలకు 619 ఫీజు వసూలు చేస్తున్నామన్నారు. దీనిపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. -
‘హై సెక్యూరిటీ’గోల్మాల్
వాహనాల నెంబర్ ప్లేట్ల ప్రాజెక్టులో కుంభకోణం? రవాణా శాఖ మంత్రి, అధికారుల ప్రమేయం ఉందంటూ సీఎంకు ఫిర్యాదు వెలుగులోకి తెచ్చిన ఆలిండియా మోటార్ వెహికల్ సెక్యూరిటీ అసోసియేషన్ సాక్షి, హైదరాబాద్: వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు అమర్చే ప్రాజెక్టు... మూడు రాష్ట్రాల్లో దీని అమలు బాధ్యత ఒకే కంపెనీది... కానీ నెంబర్ ప్లేటు ధరల్లో భారీ తేడా... పోనీ అదేమన్నా చిన్న మొత్తమా అంటే అదీ కాదు. వచ్చే పదేళ్లలో వాహనాల సంఖ్య ఆధారంగా బేరీజు వేస్తే ఆ తేడా మొత్తం దాదాపు రూ. 608 కోట్లు. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆ మొత్తాన్ని తలపై మోసేది మన రాష్ట్ర సగటు వాహనదారులు. ప్రభుత్వ పెద్దలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమేననటానికి ఇదే నిదర్శనం. ఇటీవల రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల (హెచ్ఎస్ఆర్పీ) ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు గత నాలుగేళ్లుగా సాగుతున్న కసరత్తులో వివాదాలు ఎన్నో. వాటిని ఎలాగోలా అధిగమించి తీరా ప్రాజెక్టు అమలు ప్రారంభమయ్యాక, పాత వివాదాలను తలదన్నే రీతిలో ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రవాణాశాఖ మంత్రి, ఉన్నతాధికారులప్రమేయంపై ఆరోపణచేస్తూ ‘ఆలిండియా మోటార్ వెహికల్ సెక్యూరిటీ అసోసియేషన్’ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన హెచ్ఎస్ఆర్పీ ప్రాజెక్టులో టెండర్లు దక్కించుకున్న ఉత్సవ్ సేఫ్టీ సిస్టం ప్రైవేట్ లిమిటెడ్, లింక్పాయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సార్షియం ఈ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల ధరలను చాలా ఎక్కువగా నిర్ధారించింది. ఇదే కంపెనీ.. ఈ పథకాన్ని ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు చేస్తోంది. ప్రస్తుతం ఆ రెండు రాష్ట్రాల్లో ఇస్తున్న నెంబర్ ప్లేట్ల ధరలకు, రాష్ట్రంలో అమలు చేస్తున్న ధరలకు ఏమాత్రం పొంతన లేదు. వాటితో పోలిస్తే రాష్ట్రంలో ధరలు దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ద్విచక్ర వాహనం నెంబర్ ప్లేటు ధర ఢిల్లీలో రూ. 68.91, హర్యానాలో రూ. 60.6 ఉంటే అదే మన రాష్ట్రంలో ఏకంగా రూ. 208 (పన్నులు కాకుండా)గా ఖరారు చేశారు. అలాగే ఆటోలు, తేలికపాటి వాహనాలు/కార్లు, భారీ వాహనాల ప్లేట్ల ధరల్లో కూడా ఇదే తరహా వ్యత్యాసం ఉండటం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. ఈ మొత్తం వివరాలను ‘ఆలిండియా మోటార్ వెహికల్ సెక్యూరిటీ అసోసియేషన్’ ముఖ్యమంత్రికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.19 కోట్ల వాహనాలు ఉండగా వచ్చే పదేళ్లలో వాటి సంఖ్య 3.10 కోట్లకు చేరుకుంటుందని, ప్లేట్ల ధరల్లో ఉన్న వ్యత్యాసం వల్ల రాష్ట్ర ప్రజలు దాదాపు రూ. 608 కోట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని లెక్కలు తేల్చింది. ఢిల్లీ, హర్యానాల్లో ప్లేట్లను వాహనాలకు అమర్చేందుకు స్థానిక రవాణా కార్యాలయాల్లో ఎలాంటి వసతులు కల్పించలేదని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆర్టీఏ కార్యాలయాల్లోనే వసతి కల్పించారని పేర్కొన్నారు. ఫలితంగా ఆ రెండు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ధర తక్కువగా ఉండాల్సింది పోయి మూడు రెట్లు ఎక్కువగా ఉండటం కచ్చితంగా కుంభకోణమేనని స్పష్టం చేసింది. ఇక కన్సార్షియంలో భాగంగా ఉన్న లింక్ పాయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై మరో భాగస్వామి ఉత్సవ్ సేఫ్టీ సిస్టం ప్రై.లి. ఆర్టీఏ అధికారులకు నిబంధనల ఉల్లంఘనపై ఫిర్యాదులు చేయటాన్ని కూడా ఫిర్యాదు దారులు ప్రస్తావించారు. గతంలో ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధించి నాటి ఆర్టీసీ ఎండీ (పథకం నోడల్ ఏజెన్సీ ఆర్టీసీనే) లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకపోవటమే కాకుండా ఏకంగా ఆయనను ఆ పదవి నుంచి తప్పించి మరీ ప్రాజెక్టును అమలులోకి తేవటాన్ని కూడా అసోసియేషన్ ప్రముఖంగా ప్రస్తావించింది. ముఖ్యమంత్రితోపాటు అన్ని ప్రధాన పార్టీల అధ్యక్షులకు కూడా అసోసియేషన్ ఫిర్యాదు కాపీలను అందజేసింది. రవాణాశాఖ మంత్రి బొత్సపై వచ్చిన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశం కావటంతో ఈ ప్రాజెక్టు మరోసారి వివాదంలో చిక్కుకున్నట్టయింది. -
బొత్స నివాసం వద్ద భారీ బందోబస్తు
-
ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైన తొలివిడత పోలింగ్
-
వేడుకలు వెలవెల
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకలు బోసిపోయాయి. తెలంగాణవాదుల నిరసనల భయంతో అధికారిక కార్యక్రమం కొందరు అధికారులకే పరిమితం అయ్యింది. రాష్ర్ట అవతరణ దినాన్ని విద్రోహదినంగా పాటిస్తామన్న టీఆర్ఎస్, టీజేఏసీ ప్రకటనల నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు మధ్య కార్యక్రమాన్ని మమ అనిపించారు. వేడుకలకు దూరమని ప్రకటించిన మంత్రి శ్రీధర్‌బాబుతోపాటు ప్రజాప్రతినిధులెవరూ హాజరుకాలేదు. ఉదయం నుంచే పరేడ్ గ్రౌండ్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకలకు వస్తున్న వారిని నిలువెల్లా తనిఖీ చేశారు. నల్ల జెండాలు ఎగరేస్తారేమోనన్న అనుమానంతో జేబురుమాళ్లను కూడా పరిశీలించారు. దీంతో సామాన్యజనం పరేడ్ గ్రౌండ్ వైపు కన్నెత్తికూడా చూడలేదు. కొంతమంది సామాన్యులు వచ్చినా భద్రత పేరుతో లోపలకు పంపలేదు. ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. కిందిస్థాయి అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం వేడుకలను బహిష్కరించడంతో పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన అధికారుల గ్యాలరీలో ఖాళీ కుర్చీలు కనిపించా యి. కార్యక్రమం 25 నిమిషాల్లో ముగిసింది. ఇన్చార్జి కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ సరిగ్గా ఉదయం 8.46 గంటలకు వేదిక వద్దకు వచ్చారు. వచ్చీ రాగానే సమయానికంటే 13 నిమిషాల ముందే జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆ తర్వాత తెలుగుతల్లికి పూల మాలవేశారు. మా తెలుగుతల్లి గీతాలపనను సౌండ్ సిస్టమ్ ద్వారా వినిపించారు. పతాకావిష్కరణ, ప్రసంగం, గౌరవవందన స్వీకారం వెంట వెంటనే జరిగిపోయాయి. పట్టణ ప్రముఖులు, ఉద్యోగులు, పార్టీల నాయకులు, సమరయోధులు, ఇతరులు హాజరుకాకపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగానే దర్శనమిచ్చాయి. విద్యార్థుల ఆటపాటలు, కళాకారుల నృత్యాలు, ఉత్తమ సేవలకు ప్రశంసాపత్రాలు అందివ్వలేదు. పోలీసుల హడావుడి మాత్రం కనిపించింది. -
జగన్ దీక్షకు భారీ బందోబస్తు
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం నుంచి చేపట్టనున్న ఆమరణ నిరాహారదీక్షకు నగరపోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దీక్షను అడ్డుకుని, భగ్నం చేస్తామని కొన్ని సంఘాలు ప్రకటించడంతో అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీక్షావేదికతో పాటు లోటస్‌పాండ్ చుట్టూ ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అవసరాన్ని బట్టి ఆయా మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించాలని నిర్ణయించారు. బందోబస్తుపై పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. జగన్ గత నెలాఖర్లో బెయిల్‌పై విడుదలైనప్పుడు ఆయన ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో చంచల్‌గూడ జైలు వద్దకు చేరుకోవడం తెలిసిందే. జైలు నుంచి లోటస్‌పాండ్ వరకు రోడ్ల న్నీ జనసంద్రమయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వీఐపీల జాబితాలో ఉన్న జగన్ దీక్షకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ నుంచి లోట స్పాండ్ వరకు ప్రధాన మార్గాల్లో నాలుగు చోట్ల బారికేడ్లతో కార్డన్ ఏరియాలు ఏర్పా టు చేయనున్నారు. లోటస్‌పాండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిఘా, గస్తీని ముమ్మరం చేయాలని నిర్ణయించారు. దీక్ష జరిగినన్నాళ్లూ సీమాంధ్ర, ఇతర జిల్లాల నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తారని పోలీసుల అంచనా. సాధ్యమైనంతమేర వాహనాలను లోటస్‌పాండ్ దాకా రాకుండా అడ్డుకోవాలని నిర్ణయించారు. రావి నారాయణరెడ్డి ఆడిటోరియం వద్దే వాహనాలను ఆపేసి, అక్కడ నుంచి అభిమానులను కాలినడకన దీక్షాస్థలికి పంపాలని భావిస్తున్నారు. -
అడుగడుగునా పోలీసుల తనిఖీలు
-
పోలీసు పహరాలో హైవేలు
సాక్షి నెట్వర్క్: ఏపీఎన్జీఓలు శనివారం హైదరాబాద్‌లో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణ జేఏసీ నాయకులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి 24 గంటల బంద్‌కు పిలుపునివ్వడంతో.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు హాజరయ్యేందుకు ఉద్యోగులు విజయవాడ , కర్నూలు, మహబూబ్‌నగర్ వైపుల నుంచి వాహనాల్లో వస్తుండటాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటు హైదరాబాద్‌లో అటు హైదరాబాద్‌కు వచ్చే జాతీయ రహదారుల్లో గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగులను తెలంగాణవాదులు అడ్డుకోకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముఖ్యమైన కూడళ్లలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నం వంటి సుదూర నగరాలు, పట్టణాల నుంచి ఉద్యోగులు శుక్రవారం మధ్యాహ్నమే హైదరాబాద్‌కు బయలుదేరారు. వేల సంఖ్యలో ఉద్యోగులు రైళ్ల ద్వారా కూడా రాజధానికి చేరుకునే అవకాశాలున్న దృష్ట్యా బందోబస్తు ముమ్మరం చేశారు. ముఖ్యంగా నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పోలీసులు బందోబస్తులో నిమగ్నమయ్యారు. రాష్ట్ర రాజధానిని ఆంధ్రా ప్రాంతంతో కలిపే జాతీయ రహదారితో పాటు, రెండు ప్రధాన రహదారులు నల్లగొండ జిల్లా గుండా వెళుతుండడంతో జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. విజయవాడ జాతీయ రహదారిపై ఏకంగా 64 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై ఉన్న ప్రతి గ్రామంలో ముగ్గురు పోలీసులతో పికెట్లు ఏర్పాటు చేశారు. నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై వాడపల్లి కృష్ణా నది వంతెన వద్ద, హైదరాబాద్ -మాచర్ల రహదారిపై నాగార్జునసాగర్ కొత్త వంతెన వద్ద కూడా పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. విజయవాడ హైవేలో హయత్‌నగర్ సమీపంలోనూ పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉత్కంఠ..డీజీపీ సమీక్ష: ఏపీఎన్జీవోల సభ, తెలంగాణ బంద్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉత్కంఠ నెలకొంది. డీజీపీ వి.దినేశ్ రెడ్డి శుక్రవారం బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. శుక్రవారం హైకోర్టు వద్ద తెలంగాణ, సీమాంధ్ర లాయర్ల మధ్య ఘర్షణలు చోటు చేసుకుని పరస్పర దాడులకు సైతం దారితీయడంతో పరిస్థితి మరింత సున్నితంగా మారిందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఉద్యోగుల బస్సుపై రాళ్ల దాడి : ఉద్యోగికి గాయాలు ఖమ్మం/పెనుబల్లి, న్యూస్‌లైన్: హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోలు నిర్వహిస్తున్న సభకు ఆంధ్రప్రాంత ఉద్యోగులను తీసుకెళ్తున్న బస్సుపై శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాటు వద్ద రాళ్లదాడి జరిగింది. ఖమ్మంలో బాధితులు తెలిపిన వివరాలప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్‌కు బయలు దేరారు. సత్తుపల్లి, వి.ఎం.బంజర మధ్యలోని మండాలపాడు సమీపంలోని కల్వర్టు వద్ద రాత్రి 7 గంటల సమయంలో బస్సు నెమ్మదిగా వెళ్తుండగాముసుగులు వేసుకున్న గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. దీంతో బస్సు వెనుకభాగంలో అద్దం పగిలి పోయింది. చింతలపూడికి చెందిన ఉద్యోగి వెంకట్రావ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ బస్సు ఆపడంతో ఉద్యోగులు కిందకి దిగిచూసేసరికి దుండగులు పరారయ్యారు. దీనిపై ఉద్యోగులు వి.ఎం.బంజర పోలీసులకు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. రాత్రి 9 గంటల సమయంలో ఖమ్మం రోటరీనగర్ వద్ద బస్సులోని ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు నాగేశ్వరరావు, రాజబాబు విలేకరులతో మాట్లాడారు. -
అంతా సమైక్యమై..
సాక్షి,నెల్లూరు: సింహపురివాసులంతా ‘సమైక్య’మై గర్జించారు. 37 రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉర్రూతలూగిస్తున్న జిల్లా ప్రజలు గురువారం మరో అడుగు ముందుకేసి ‘సమైక్య సింహగర్జన’లో కదం తొక్కారు. సభ ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుంచి విద్యార్థులు, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు మొత్తంగా సమైక్యవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సమైక్య నినాదాలతో సభ జరిగిన ఏసీసుబ్బారెడ్డి స్టేడియం హోరెత్తింది. విభజన ప్రకటనను తక్షణం ఉపసంహరించుకోవాలని ఉద్యోగసంఘాల నేతలు తమ ప్రసంగాల్లో డిమాండ్ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఉత్తేజితులను చేశాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమైక్య సింహగర్జన సభ ఊహించిన దానికంటే మిన్నగా విజయవంతమైంది. ఇదిలా ఉండగా జిల్లాలో సమైక్యవాదులు ర్యాలీలు, రాస్తారోకోలు, నిరసన దీక్షలు కొనసాగించారు.ఉదయగిరి నియోజకవర్గ వ్యాప్తంగా సమైక్యవాదులు, ఉద్యోగులు, సింహపురి లక్ష గళ గర్జనకు తరలివచ్చారు. ఉదయగిరిలో వైఎస్సార్సీపీ రిలే దీక్షలు 17వ రోజుకు చేరుకున్నాయి. సీతారాంపురంలో ఉద్యోగ జేఏసీ నిర్వహిస్తున్న దీక్షలో వికలాంగులు పాల్గొన్నారు. బస్టాండ్ సెంటర్లో కేసీఆర్‌ను వలవేసి పట్టుకున్నట్టుగా వినూత్న నిరసన తెలిపారు. కేరళ ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలతో ర్యాలీ నిర్వహించి బస్టాండ్‌లో మానవహారం ఏర్పాటు చేశారు. సోనియా శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారు. కావలిలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రిలేనిరాహార దీక్షలు, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు, రజక సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, విచిత్ర వేషధారణతో నృత్యాలను ప్రదర్శిం చారు. మానవహారం, రాస్తారోకో చేశారు. కోవూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి నెల్లూరులో జరిగిన సింహగర్జనకు భారీగా తరలి వచ్చారు. ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో గ్రామస్తులు నిరాహారదీక్ష చేపట్టారు. సింహగర్జనకు గూడూరు నుంచి వైఎస్సార్సీపీ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో భారీగా తరలి వచ్చారు. చిట్టమూరులో మోటారుసైకిళ్ల ర్యాలీ, మల్లాంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం మోటారుసైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. నెల్లూరులో జరిగిన సింహపురి సింహగర్జనకు సూళ్లూరుపేట నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సుమారు వెయ్యిమంది వచ్చారు. పట్టణంలో పురోహితుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రిలే నిరాహారదీక్షలో కూర్చున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గ జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో ‘ఆంధ్ర రాష్ర్ట విభజనతో అన్నీ కష్టాలే.. అందరికీ నష్టాలే’ అనే శీర్షికన రాసిన కరపత్రాన్ని జేఏసీ కన్వీనర్ వాకిచర్ల శాంతారామ్ ఆవిష్కరించి అందరికీ పంపిణీ చేశారు. ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో విశ్రాంత ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. సింహగర్జనకు వెంకటగిరి తహశీల్దార్ ఆధ్వర్యంలో 20 వాహనాల్లో వివిధ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, కార్మికులు తరలి వచ్చారు.