ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు | Police Security Up At Delhi High Court After Bomb Threat Email | Sakshi
Sakshi News home page

ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు

Published Thu, Feb 15 2024 12:04 PM | Last Updated on Thu, Feb 15 2024 12:16 PM

police Security Up Delhi High Court After Bomb Threat Email - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు వచ్చిన బాంబుల బెదింపులు కలకలం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులను ఈ మెయిల్‌ ద్వారా పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హైకోర్టుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఢిల్లీ హైకోర్టులో భారీ బాంబు పేలుడు సంభిస్తుందని బుధవారం కోర్టు  రిజిస్ట్రార్ జనరల్ ఈ మెయిల్‌ వచ్చింది. 

‘ఫిబ్రవరి 15న హైకోర్టులో బాంబు పేల్చుతా. ఈ పేలుడు ఢిల్లీలోనే అతిపెద్దది కానుంది. ఎంతమంది భద్రతా బలగాలైనా పెట్టుకోండి.. అందరినీ పేల్చివేస్తాం’ అని గుర్తు తెలియని దుండగులు ఈ మెయిల్‌లో బెదిరింపులకు పాల్పడ్డారు.  ఇదే రోజు మరోవైపు బిహార్‌ డీజీపీకి  వాట్సప్‌ ఆడియో క్లిప్‌ ద్వారా బాంబు బెదిరింపు రావటం గమనార్హం. 

అయితే ఈ ఘటనలో నిందితుడిని కర్ణాటకలో పటుకున్నామని పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి అతన్ని విచారణ కోసం  పట్నా తరలించారు. నిందితుడిని అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement