
Jai Bhim Controversy: Suriya Gets Police Protection: హీరో సూర్య నటించిన జై భీమ్ సినిమా ఓటీవలె ఓటీటీలో విడుదలై సూపర్ హిట్టయ్యింది. ఓవైపు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమాపై అదే స్థాయిలో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. వన్నియర్ సంఘం తమ ప్రతిష్టను దిగజార్చారంటూ ఇప్పటికే చిత్ర యూనిట్‌కు లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. దీని తర్వాత కూడా సూర్యకు అనేక బెదిరింపులు వస్తుండటంతో పోలీసులు ఆయనకు భద్రత కల్పించారు.
చెన్నైలోని సూర్య నివాసం వద్ద పోలీసులు భద్రత కల్పించారు. మరోవైపు సూర్యకు పలువురు ప్రముఖులు సహా అభిమానులు అండగా నిలుస్తున్నారు. ట్విట్టర్‌లో # WeStandwithSuriya అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. సూర్యకు మద్ధతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.