
సాక్షి ప్రతినిధి, అనంతపురం, పెనుకొండ: పెనుకొండ ప్రాంతంలో ఒకే నంబరు ప్లేటుతో రెండు కార్లు తిరుగుతున్నాయి. పట్టణానికి చెందిన సురేష్‌బాబు అనే వ్యక్తి ఏపీ02 ఆర్ 8118 నంబరు గల సిల్వర్ రంగు ఇన్నోవా కారు కొనుగోలు చేశాడు. మరో ప్రాంతంలో బిస్కట్ రంగు ఇన్నోవా వాహనాన్ని కొనుగోలు చేశాడు. అయితే రెండింటికీ ఒకే నంబరు ప్లేటు తలిగించుకుని దర్జాగా బాడుగకు తిప్పుతున్నాడు. పన్నులు ఎగ్గొట్టడానికి ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment