innova vehicles
-
ఒకే నంబర్.. రెండు కార్లు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం, పెనుకొండ: పెనుకొండ ప్రాంతంలో ఒకే నంబరు ప్లేటుతో రెండు కార్లు తిరుగుతున్నాయి. పట్టణానికి చెందిన సురేష్‌బాబు అనే వ్యక్తి ఏపీ02 ఆర్ 8118 నంబరు గల సిల్వర్ రంగు ఇన్నోవా కారు కొనుగోలు చేశాడు. మరో ప్రాంతంలో బిస్కట్ రంగు ఇన్నోవా వాహనాన్ని కొనుగోలు చేశాడు. అయితే రెండింటికీ ఒకే నంబరు ప్లేటు తలిగించుకుని దర్జాగా బాడుగకు తిప్పుతున్నాడు. పన్నులు ఎగ్గొట్టడానికి ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది. -
జిల్లాల్లోనూ పోలీసులకు కొత్త వాహనాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లోని పోలీసుస్టేషన్లకు కొత్త వాహనాలను సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులకు కొత్త ఇన్నోవా వాహనాలను, 300కు పైగా ద్విచక్ర వాహనాలను ప్రభుత్వం ఇదివరకే అందజేసిన సంగతి తెలిసిందే. మిగిలిన తొమ్మిది జిల్లాల పోలీసు స్టేషన్లకు సైతం కొత్త వాహనాలను సమకూర్చితే, గస్తీ విస్తృతమై శాంతి భద్రతలు పరిరక్షించడానికి వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఇన్నోవా వాహనాలు పోలీసుల విధినిర్వహణకు అంతగా తోడ్పడవని వచ్చిన విమర్శలపై దృష్టి సారించిన ప్రభుత్వం జిల్లాలకు టాటాసుమో, బొలేరో వాహనాలను అందచేయాలని యోచిస్తోంది. అలాగే ద్విచక్ర వాహనాలను కూడా గస్తీ కోసం అందజేయనుంది. ఇందులో భాగంగా పూర్తిగా వాహనాలు లేని పోలీసుస్టేషన్లకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై డీజీపీ అనురాగ్‌శర్మ, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డిలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. రాష్ట్రంలో మొత్తం 680 పోలీసు స్టేషన్లు ఉన్నాయి. హైదరాబాద్,సైబరాబాద్‌లకు చెందిన పోలీసు స్టేషన్లు పోగా మిగతా వాటికి ప్రాధాన్యక్రమంలో కొత్త వాహనాలను అందచేస్తారని అధికారవర్గాలు తెలిపాయి. -
సీపీ-పీసీ ఇద్దరికీ ఇన్నోవానే !
సాక్షి, సిటీబ్యూరో: అత్యాధునిక వసతులు కలిగిన పోలీసు వాహనాలు జంట కమిషనరేట్లలో పరుగులు తీయనున్నాయి. సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గురువారం కొత్తవాహనాలను ప్రారంభించారు. ట్యాంక్‌బండ్‌పై జరిగిన ఈ కార్యక్రమంలో వంద ఇన్నోవా వాహనాలు, 476 ద్విచక్ర వాహనాలను సీఎం జంట కమిషనరేట్లకు అందజేశారు. నిన్నటి వరకు నగర పోలీసు కమిషనరేట్‌లో కేవలం రెండు ఇన్నోవా వాహనాలు మాత్రమే ఉండేవి నేడు ఆ సంఖ్య 52కు చేరాయి. ఇక నుంచి పోలీస్ కమిషనర్, కానిస్టేబుళ్లు ఇన్నోవా వాహనంలో తిరగనున్నారు. కొత్త వాహ నాలు పంపిణీ ఇలా.. నగర పోలీసులకు అందిన కొత్త వాహనాలలో వెస్ట్‌జోన్‌కు ఆరు, ఈస్ట్‌జోన్‌కు మూడు, సెంట్రల్ జోన్‌కు నాలుగు, నార్త్‌జోన్‌కు నాలుగు, ట్రాఫిక్ విభాగానికి 12 కేటాయించారు. మరో 18 వాహనాలు జిల్లాలకు వెళ్లాయి. పద్రాగస్టు వేడుకల తరువాత తిరిగి ఇవి నగర కమిషనరేట్‌కు చేరుకోనున్నాయి. 268 ద్విచక్ర వాహనాలు బ్లూకోట్స్ పోలీసులకు ఇచ్చారు. ఇక సైబరాబాద్‌కు 50 ఇన్నోవా వాహనాలు, 208 ద్విచక్ర వాహనాలు చేరుకున్నాయి. వాహనంలో సదుపాయాలు ... పోలీసు డ్రైవర్, ఎస్ఐతోపాటు ముగ్గురు కానిస్టేబుళ్లు ఉంటారు. వాహనంలో ఉండే సౌకర్యాలు.... * ఇంటర్నెట్ సౌకర్యం కలిగిన చిన్నపాటి ట్యాబ్ * డిజిటల్ కెమెరా * వాహనాన్ని జీపీఎస్‌తో అనుసంధానం చేస్తారు. * కమ్యూనికేషన్ సిస్టమ్ (వెరి హై ఫ్రీక్వెన్సీ) * వాహనంపై నీలం, ఎరుపు, ఆకుపచ్చ రంగుల లైట్లతో పాటు సైరన్ * సీసీ కెమెరా మైక్ సిస్టం * ఆయుధాలు, లాఠీలు పెట్టుకునే సదుపాయం