సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని చోదకులు తమ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్స్‌లో మార్పు చేర్పులు చేయవద్దని కొత్వాల్ అంజనీకుమార్ బుధవారం ట్వీట్ చేశారు. సక్రమంగా లేని నంబర్ ప్లేట్లతో కూడిన వాహనాలను ఎక్కువగా నేరగాళ్లు వినియోగిస్తున్న ఆనవాళ్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గతంలో ఈ తరహా వాహనాలు వినియోగిస్తూ అనేక మంది దాదాపు 2 వేల స్నాచింగ్స్ చేశారని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే నగరంలో వాహనాల నంబర్ ప్లేట్స్‌పై ప్రత్యేక డ్రైవ్స్ చేస్తున్నామని మంగళవారం ఒక్క రోజే 384 కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ తరహా నంబర్ ప్లేట్లను గమనిస్తే 94906 16555కు వాట్సాప్ చేయాలని నగర వాసులకు కొత్వాల్ సూచించారు. (కెమెరాకు చిక్కితే చెక్ పడుద్ది)
Improper number plate on Bike could be an indicator that the rider is an offender of snatching. We have records of 2000 plus offenders who use bike to commit chain/cell snatching . Yesterday we booked 384 cases against those using improper number plates. Pl send pic at 9490616555
— Anjani Kumar, IPS (@CPHydCity) March 11, 2020
Comments
Please login to add a commentAdd a comment