Mahindra Scorpio N Owner Spends Rs 6 Lakh For Fancy Number Plate - Sakshi
Sakshi News home page

Mahindra Scorpio N: కారు రిజిస్టర్ నెంబర్ ఖరీదు రూ. 6 లక్షలు - అట్లుంటది నెంబర్లపై క్రేజ్!

Published Sun, May 21 2023 2:37 PM | Last Updated on Sun, May 21 2023 3:17 PM

Mahindra Scorpio N Rs 6 Lakh Number Plate - Sakshi

Mahindra Scorpio N: ప్రపంచంలోని ఇతర దేశాల్లో మాత్రమే కాకుండా భారతదేశంలో కూడా వాహనాలన్నా, నెంబర్ ప్లేట్స్ అన్నా ఎక్కువ క్రేజుంది. ఇందులో భాగంగానే తక్కువ ధరకు కొనుగోలు చేసే వాహనాలకు కూడా అంతకు మించి డబ్బు వెచ్చించి నెంబర్ ప్లేట్స్ కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. అలాంటి మరో సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రూ. 6 లక్షల నెంబర్ ప్లేట్
నివేదికల ప్రకారం ఇటీవల రాజస్థాన్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన మహీంద్రా స్కార్పియో కారుకి ఏకంగా రూ. 6 లక్షలు వెచ్చించి నెంబర్ ప్లేట్ కొనుగోలు చేశారు. ఇది మాత్రమే కాకుండా తన కారు చూసేవారిని వెంటనే ఆకట్టుకోవాలని ప్రత్యేకంగా కస్టమైజ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఒక వీడియో తరుణ్ వ్లాగ్స్3445 అనే తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు.

ఈ వీడియోలో గమనించినట్లయితే మహీంద్రా స్కార్పియో 'RSY 0017' అనే ప్రత్యేకమైన రిజిస్టర్ నెంబర్ చూడవచ్చు. ఇది సాధారణ రిజిస్ట్రేషన్ నెంబర్‌లకు భిన్నంగా ఉంది, ఈ కారణంగానే దీనికి రూ. 6 లక్షలు ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఈ SUV దాని స్టాండర్డ్ మోడల్ కంటే భిన్నంగా 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందింది. ఇక్కడ వీడియోలో కనిపించే కారు స్కార్పియో ఎన్ Z4 ట్రిమ్ పెట్రోల్ మోడల్ అని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ప్రపంచంలో ఖరీదైన కారు నెంబర్ ప్లేట్ అక్షరాలా రూ. 122 కోట్లు)

మహీంద్రా స్కార్పియో ఎన్ 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 200 బీహెచ్‌పి పవర్, 370 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ కలిగి ఉత్తమ పనితీరుని అందిస్తుంది. స్కార్పియో ఎన్ ప్రారంభ ధర రూ. 13.05 లక్షలు, కాగా Z4 ట్రిమ్ పెట్రోల్ ధర రూ. 14.65 లక్షల నుంచి ప్రారంభమవుతుంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement