mahindra scorpio
-
అరుదైన సేల్స్ రికార్డ్.. అమ్మకాల్లో దేశీయ దిగ్గజం హవా!
మహీంద్రా స్కార్పియో, స్కార్పియో ఎన్ రెండూ అమ్మకాలలో అద్భుతమైన రికార్డ్ క్రియేట్ చేశాయి. 2003 నుంచి 2024 వరకు ఈ రెండు కార్లు ఏకంగా 10,42,403 యూనిట్ల అమ్మకాలను కైవసం చేసుకున్నాయి. అత్యధికంగా FY2024లో నమోదయ్యాయి. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే కంపెనీ 1,41,462 యూనిట్ల స్కార్పియో కార్లను విక్రయించింది.2013 ఆర్థిక సంవత్సరంలో 50168 యూనిట్లు, 2014వ ఆర్థిక సంవత్సరంలో 50,949 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇలా ప్రతి ఏటా మహీంద్రా స్కార్పియో అమ్మకాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. మొత్తం మీద ప్రారంభం నుంచి గత నెల వరకు కంపెనీ 10 లక్షల కంటే ఎక్కువ కార్లను విక్రయించి.. విక్రయాల్లో సరికొత్త మైలురాయిని చేరుకున్నాయి. ప్రారంభంలో కంపెనీ స్కార్పియో కార్లను మాత్రమే విక్రయించింది. 2022లో కంపెనీ స్కార్పియో ఎన్ లాంచ్ చేసింది. ఈ మోడల్ కూడా అమ్మకాల పెరుగుదలకు దోహదపడింది.మహీంద్రా స్కార్పియో, స్కార్పియో ఎన్ రెండూ కూడా మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇవి మల్టిపుల్ వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పనితీరుపరంగా ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ అందించాయి. ఇవన్నీ ఎక్కువమంది కస్టమర్లను ఆకర్శించడంలో సహాయపడ్డాయి. -
ఫైనల్ మ్యాచ్‌కు ముందే కొత్త కారు కొన్న ఆస్ట్రేలియా క్రికెటర్ - వీడియో వైరల్
Matthew Hayden Mahindra Scorpio N: మహీంద్రా కార్లను సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తూ ఉంటారు. దేశీయ విఫణిలో విడుదలైన అతి తక్కువ కాలంలో మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్లిన 'మహీంద్రా స్కార్పియో ఎన్' (Mahindra Scorpio N) ఎస్‌యూవీని మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ 'మాథ్యూ హేడెన్' (Matthew Hayden) కొనుగోలు చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆస్ట్రేలియాలో భారతీయ కార్ల తయారీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియన్ క్రికెట్ లెజెండ్ మాథ్యూ హేడెన్ ఇటీవల తన గ్యారేజీకి 'స్కార్పియో ఎన్' జోడించాడు. దీనికి సంబంధించిన వీడియోను మహీంద్రా ఆస్ట్రేలియా యూట్యూబ్ ఛానెల్ ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోలో మాథ్యూ హేడెన్ క్వీన్స్ల్యాండర్ బ్రిస్బేన్‌లోని మహీంద్రా డీలర్షిప్ చుట్టూ తిరుగుతూ, ఎవరెస్ట్ వైట్ కలర్ స్కీమ్ కలిగిన స్కార్పియో-ఎన్ డెలివరీ తీసుకోవడం చూడవచ్చు. మహీంద్రా స్కార్పియో-ఎన్ ప్రారంభం నుంచి ఉత్తమ అమ్మకాలను పొందుతున్న మహీంద్రా స్కార్పియో ఎన్ ప్రారంభ ధర రూ. 13.26 లక్షలు, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 22.78 లక్షలు (ఎక్స్-షోరూమ్). వేరియంట్లలో లభించే ఈ కారు 6-సీట్లు మరియు 7-సీట్ల ఆప్సన్లలో లభిస్తుంది. మహీంద్రా స్కార్పియో ఎన్ SUV 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్, 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్లను పొందుతుంది. డీజిల్ ఇంజిన్ 175 పీఎస్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. పెట్రోల్ ఇంజిన్ 203 పీఎస్ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇవి రెండూ కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను పొందుతుంది. ఇదీ చదవండి: మస్క్ చేసిన పనికి మండిపడ్డ అమెరికా.. గుణపాఠం చెప్పిన దిగ్గజ కంపెనీలు! ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 20.32 సెం.మీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 17.78 సెం.మీ కలర్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ క్రూయిజ్ కంట్రోల్స్, 6-వే పవర్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, ప్రీమియం-లుకింగ్ బ్రౌన్ అండ్ బ్లాక్ లెదర్ సీట్లు మొదలైనవి ఉంటాయి. -
మళ్ళీ జలపాతం కిందికి మహీంద్రా కారు - ఈ సారి ఏమైందంటే?
Clarity About Mahindra Scorpio N Sunroof Leak: భారతీయ మార్కెట్లో అమ్ముడవుతున్న అత్యంత సురక్షితమైన కార్లలో మహీంద్రా స్కార్పియో ఎన్ ఒకటి. గత కొంతకాలం కింద ఒక వ్యక్తి తన కారు సన్‌రూఫ్ నుంచి వాటర్ లీక్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో వీడియో అప్లోడ్ చేసి హల్ చల్ చేసాడు. అయితే ఈ సమస్యకు కంపెనీ పరిస్కారం అందించింది. కాగా తాజాగా మరో సంఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం యష్9డబ్ల్యు (Yash9w) అనే యూట్యూబర్, మహీంద్రా స్కార్పియో ఎన్ కారుని జలపాతం కిందికి తీసుకెళ్లి సన్‌రూఫ్ లీక్‌పై ఉన్న సందేహాలకు సమాధానం చెప్పాలని నిర్ణయించుకుంటాడు. ఇందులో భాగంగానే కారుని జలపాతం కిందికి తీసుకెళ్లాడు. జలపాతం నీరు కారుపై పడినా లోపలికి ఏ మాత్రమే రాలేదని స్పష్టం చేసాడు. అయితే మరో సారి కూడా కారుని జలపాతం కింది తీసుకెళతాడు. అప్పుడు చిన్న నీటి బిందువులను గమనించినట్లు వెల్లడించాడు. చిన్న నీటి బిందువులే కానీ అది అసలు చెప్పుకోదగ్గ సమస్య కాదని కూడా వీడియో ద్వారా వ్యక్తం చేసాడు. కారుని జలపాతం కిందికి తీసుకెళ్లాడనికి ముందు సన్‌రూఫ్ పూర్తిగా క్లోజ్ చేస్తాడు. సన్‌రూఫ్ మూసివేయడంతో ఏ చిన్న తప్పు జరిగినా వేగంగా వచ్చే నీరు లోపలి వస్తుంది. అయితే యూట్యూబర్ స్కార్పియో ఎన్ కారు చాలా పటిష్టమైందని, ఎలాంటి లీక్ లేదని స్పష్టంగా వెల్లడించాడు. (ఇదీ చదవండి: కోటి శాలరీ.. ప్రైవేట్ జెట్‌లో ప్రయాణం.. కుక్కను చూసుకుంటే ఇవన్నీ!) సాధారణంగా వాహన తయారీ సంస్థలు కార్లను చాలా పటిష్టంగా తయారు చేస్తాయి. అయితే వాహన వినియోగదారుడు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల సమస్యలు పుట్టుకొస్తాయి. అయితే కారులో ఏదైనా సమస్య ఉందని గమనిస్తే.. కంపెనీ తప్పకుండా దానికి తగిన పరిష్కారం అందిస్తుంది. అంతే కాకుండా సన్‌రూఫ్ అనేది వర్షపు నీటి బిందువులు లోపలికి రాకుండా కాపాడటానికి, కారులోకి కావలసినంత వెలుతురు రావడానికి ఉపయోగపడుతుంది. (ఇదీ చదవండి: బన్నీ మంచి బిజినెస్మెన్ కూడా! ఈ కంపెనీలన్నీ తనవే..) జలపాతాల కిందికి కారుని తీసుకెళ్లి సన్‌రూఫ్ టెస్ట్ చేయడమనేది సమంజసం కాదు. జలపాతం నుంచి కిందికి పడే నీరు చాలా వేగంతి పడుతుంది. అలాంటి సమయంలో ఏదైనా ఊహించని ప్రమాదం జరగవచ్చు. కావున ఇలాంటి సాహసాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచింది. మొత్తం మీద మహీంద్రా స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ పటిష్టంగా ఉందని మరోసారి ఋజువైంది. ఇది మహీంద్రా ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. -
ఆనంద్ మహీంద్రా ఇకనైనా శ్రద్ద పెట్టండి - నెట్టింట్లో మహిళ ట్వీట్ వైరల్!
Car Owner Tweets to Anand Mahindra: గత కొన్ని రోజులకు ముందు మహీంద్రా కంపెనీకి చెందిన లేటెస్ట్ స్కార్పియో ఎన్ ఒక పెద్ద ప్రమాదానికి గురైంది. ఈ SUV చెట్టుకి ఢీ కొట్టడం వల్ల కారు పై భాగం మొత్తం ఒక పక్కకు వచ్చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంత ప్రమాదానికి గురైనప్పటికీ లోపల ఉన్న ప్రయాణికులకు ప్రాణ నష్టం జరగలేదు, కానీ గాయాలతో బయటపడ్డారు. అయినప్పటికీ ఒక మహిళ ఈ ప్రమాదం గురించి 'ఆనంద్ మహీంద్రా'కి ట్వీట్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, మహీంద్రా స్కార్పియో-ఎన్ కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి డ్రైవింగ్ చేసే సమయంలో నిద్రపవడంతో ఈ పెను ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు చూస్తే ఒక్క సారిగా భయం కలుగుతుంది. కారు అటవీ ప్రాంతం గుండా వెల్తూ చెట్టుకి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైనపుడు స్కార్పియో ఎన్ కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాలేదని ఓనర్ వెల్లడించినట్లు సమాచారం. ఈ విషయం మీదనే బిబేకానంద దాస్ ట్వీట్ చేస్తూ కారులో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాలేదని, ఈ ప్రమాదం వల్ల తన చిన్న కూతురు పరిస్థితి విషయంగా ఉందని, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాకపోవడమే దీనికి కారణమని, దీని మీద తప్పకుండా మరింత ద్రుష్టి సారించాలని కోరింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. ప్రస్తుతానికి ఆనంద్ మహీంద్రా దీనిపైన స్పందించలేదు. కాగా ఇప్పటి వరకు స్కార్పియో ఎన్ కారుకి ఇలాంటి ప్రమాదం సంభవించలేదు, ఇంత ప్రమాదానికి గురైనప్పటికీ ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారంటే అందులో ఉన్న పటిష్టమైన సేఫ్టీ ఫీచర్స్ మనకు ఇట్టే అర్థమైపోతాయి. @anandmahindra 🙏Met with a fatal road accident on 11th June while driving Scorpio N with my family my younger daughter is critical. Unfortunately none of the airbags open. Pl take care for further development. pic.twitter.com/yp3tUZGmpp— BIBEKANANDA DASH (@bibek_india) June 13, 2023 సేఫ్టీ రేటింగ్ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన మహీంద్రా స్కార్పియో ఎన్ ఎస్‌యువిలో జరిగిన ఈ సంఘటన ఈ కారు కొనుగోలుదారులతో కొంత భయాందోళనను కలిగించింది. ఈ ఎస్యువి అడల్స్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 34 పాయింట్లకు గానూ 2.25 పాయింట్లు, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 48 పాయింట్లకు గానూ 28.94 పాయింట్లను సాధించి, మొత్తం మీద సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది. సేఫ్టీ ఫీచర్స్ మహీంద్రా స్కార్పియో ఎన్ ఏడు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, హిల్ అసిస్ట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్దారించడంలో సహాయపడతాయి. ఇన్ని సేఫ్టీ ఫీచర్స్ కలిగిన ఈ కారులో ఎయిర్ బ్యాగ్స్ ఎందుకు ఓపెన్ కాలేదనేదానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు తెలియాల్సి ఉంది. -
మెట్లెక్కిన మహీంద్రా స్కార్పియో ఎన్.. వైరల్ అవుతున్న వీడియో
Mahindra Scorpio N: దేశీయ మార్కెట్లో ఎస్‌యువిలకు డిమాండ్ విపరీతంగా ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగంగానే ఎక్కువ మంది ప్రజలు మహీంద్రా, టాటా కంపెనీ మొదలైన కంపెనీ ఎస్‌యువిలను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇవి కేవలం రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా ఆఫ్-రోడ్ సామర్థ్యాలను కూడా కలిగి ఉంటాయి. కావున అద్భుతమైన పనితీరుని అందిస్తాయి. ఇటీవల మహీంద్రా కంపెనీకి చెందిన 'స్కార్పియో ఎన్' మెట్లెక్కే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యూట్యూబ్‌లో విడుదలైన వీడియోలో లేటెస్ట్ మహీంద్రా స్కార్పియో ఎన్ సులభంగా మెట్లు ఎక్కడం చూడవచ్చు. అంతే కాకూండా ఈ వైట్ కలర్ స్కార్పియో సులభంగా మెట్లు దిగటం కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మహీంద్రా స్కార్పియో ఎన్ కెపాసిటీ తప్పకుండా అర్థమవుతుంది. కార్లతో ఇలాంటి ప్రయోగాలు చేయడం ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. కానీ ఈ వీడియోలో గమనించినట్లయితే ఆ ప్రాంతం మొత్తమ్ నిర్మానుష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. మహీంద్రా కంపెనీ విడుదల చేసిన ఆధునిక కార్లలో స్కార్పియో ఎన్ ఒకటి. ఇది మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందింది. దీన్ని బట్టి చూస్తే ఇది కొనుగోలుదారులను ఎంతగా ఆకర్షించిందనే విషయం ఇట్టే అర్థమవుతుంది. చూడగానే ఆకర్షించే డిజైన్ కలిగిన ఈ కారు అత్యాధునిక ఫీచర్స్ కూడా పొందుతుంది. (ఇదీ చదవండి: కస్టమర్లకు షాకిచ్చిన ఓలా.. పెరిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు) మహీంద్రా స్కార్పియో ఎన్ 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ & 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్ 198 bhp పవర్ 380 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. డీజిల్ ఇంజిన్ 173 bhp పవర్ 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. రెండు ఇంజిన్లు 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. (ఇదీ చదవండి: ఇప్పుడు ప్రపంచ కుబేరుడు ఇతడే..) భారతదేశంలో మహీంద్రా స్కార్పియో ఎన్ ప్రారంభ ధరలు ఇప్పుడు రూ. 13.06 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 24.51 లక్షల వరకు ఉంటాయి. ఈ SUV దేశీయ మార్కెట్లో మల్టిపుల్ వేరియంట్లలో & మల్టిపుల్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
కారు రిజిస్టర్ నెంబర్ ఖరీదు రూ. 6 లక్షలు - ఆ నెంబర్ ఏదంటే?
Mahindra Scorpio N: ప్రపంచంలోని ఇతర దేశాల్లో మాత్రమే కాకుండా భారతదేశంలో కూడా వాహనాలన్నా, నెంబర్ ప్లేట్స్ అన్నా ఎక్కువ క్రేజుంది. ఇందులో భాగంగానే తక్కువ ధరకు కొనుగోలు చేసే వాహనాలకు కూడా అంతకు మించి డబ్బు వెచ్చించి నెంబర్ ప్లేట్స్ కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. అలాంటి మరో సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రూ. 6 లక్షల నెంబర్ ప్లేట్ నివేదికల ప్రకారం ఇటీవల రాజస్థాన్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన మహీంద్రా స్కార్పియో కారుకి ఏకంగా రూ. 6 లక్షలు వెచ్చించి నెంబర్ ప్లేట్ కొనుగోలు చేశారు. ఇది మాత్రమే కాకుండా తన కారు చూసేవారిని వెంటనే ఆకట్టుకోవాలని ప్రత్యేకంగా కస్టమైజ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఒక వీడియో తరుణ్ వ్లాగ్స్3445 అనే తన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో గమనించినట్లయితే మహీంద్రా స్కార్పియో 'RSY 0017' అనే ప్రత్యేకమైన రిజిస్టర్ నెంబర్ చూడవచ్చు. ఇది సాధారణ రిజిస్ట్రేషన్ నెంబర్లకు భిన్నంగా ఉంది, ఈ కారణంగానే దీనికి రూ. 6 లక్షలు ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఈ SUV దాని స్టాండర్డ్ మోడల్ కంటే భిన్నంగా 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందింది. ఇక్కడ వీడియోలో కనిపించే కారు స్కార్పియో ఎన్ Z4 ట్రిమ్ పెట్రోల్ మోడల్ అని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ప్రపంచంలో ఖరీదైన కారు నెంబర్ ప్లేట్ అక్షరాలా రూ. 122 కోట్లు) మహీంద్రా స్కార్పియో ఎన్ 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 200 బీహెచ్‌పి పవర్, 370 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలిగి ఉత్తమ పనితీరుని అందిస్తుంది. స్కార్పియో ఎన్ ప్రారంభ ధర రూ. 13.05 లక్షలు, కాగా Z4 ట్రిమ్ పెట్రోల్ ధర రూ. 14.65 లక్షల నుంచి ప్రారంభమవుతుంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). -
కారు కొన్న ఆనందం.. డ్యాన్స్ చేసిన కుటుంబం.. ఆనంద్ మహింద్రా స్పందనేంటో తెలుసా?
భారతీయులకు వాహనం అంటే చాలా సెంటిమెంట్. అది కార్ అయినా కావచ్చు.. బైక్ అయినా కావచ్చు. కొత్తగా వాహనం కొంటే ఇంటిల్లిపాదికి అదొక పండుగ లాంటి సందర్భం. ఇలాగే ఛత్తీస్‌గఢ్‌లో ఒక కుటుంబం ఇటీవల నెటిజెన్ల దృష్టిని ఆకర్షించింది. ఇదీ చదవండి: టాప్ బిజినెస్ టైకూన్స్ మాతృమూర్తుల గురించి తెలుసా? వారు కొన్న మహీంద్రా స్కార్పియో-N ఎస్యూవీ డెలివరీ సందర్భంగా కుటుంబం మొత్తం కారు ముందు డ్యాన్స్ చేశారు. యువకులు పిల్లలు, పెద్దలు అందరూ ఓ హిందీ పాటకు ఉత్సాహంగా చిందులు వేశారు. ఈ వీడియోను కార్ న్యూస్ గురు అనే ట్విటర్ పేజీ షేర్ చేయగా నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా దృష్టిని కూడా ఆకర్షించింది. ఆయన దానిపై స్పందిస్తూ రీట్వీట్ చేశారు. వారి ఆనందం చూస్తుంటే తాను వాహన తయారీ రంగంలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఇంతకు మించిన అవార్డులు ఏముంటాయని పేర్కొన్నారు. ఆనంద మహీంద్రా ట్వీట్‌ను వేలాది మంది లైక్ చేశారు. పలువురు తమకు తోచిన విధంగా కామెంట్లు పెట్టారు. This is the real reward and joy of working in the Indian auto industry… https://t.co/ormA7i8sQq — anand mahindra (@anandmahindra) May 19, 2023 ఇలాంటి ఆసక్తికర ట్రెండింగ్ అప్డేట్ల కోసం సాక్షి బిజినెస్ పేజీని చూస్తూ ఉండిండి -
సన్‌రూఫ్ లీక్‌పై రచ్చ లేపి.. ఇప్పుడు హ్యాపీ అంటున్నాడు: వీడియో
భారతీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థలలో ఒకటి. ఇప్పటికే థార్, XUV700, స్కార్పియో క్లాసిక్ వంటి వాటిని విక్రయిస్తూ అమ్మకాల్లో దూసుకెళ్తోంది. అయితే గత కొన్ని రోజులకు ముందు స్కార్పియో-ఎన్ SUV సన్‌రూఫ్ లీక్‌కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహీంద్రా స్కార్పియో సన్‌రూఫ్ లీక్ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన యూట్యూబర్ అరుణ్ పన్వార్ ఇప్పుడు చాలా హ్యాప్పీగా ఉందంటూ మరో వీడియో పోస్ట్ చేసాడు. దీనికి కారణం కంపెనీ ఎటువంటి చార్జెస్ తీసుకోకుండా సన్‌రూఫ్ బాగుచేసి అతడికి అప్పగించడమే. గతంలో వెలువడిన వీడియోలో అరుణ్ పన్వర్ తన మహీంద్రా స్కార్పియో-ఎన్ కారుని జలపాతం కిందకి తీసుకెళ్లినప్పుడు, నీరు సన్‌రూఫ్ నుంచి లోపలికి వచ్చాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రచ్చ చేసాడు. అయితే అదే జలపాతం కింద కంపెనీ అలాంటి కారుని నిలిపి ఎటువంటి లీక్ లేదని నిరూపించింది. అంతే కాకుండా కస్టమర్ అసౌకర్యానికి కంపెనీ బాధ్యత వహిస్తూ అతని కారు సన్‌రూఫ్ బాగు చేసింది. దీనికి రూ. 53,000 ఖర్చయింది. కానీ కస్టమర్ నుంచి డబ్బు తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ చేసింది. మొత్తానికి యూట్యూబర్ ఇప్పుడు చాలా హ్యాప్పీగా ఫీలయ్యాడు. కంపెనీ అతనికి కారుని అందించిన తరువాత మహీంద్రా స్కార్పియో-ఎన్ జలపాతం కిందికి వెళ్లే సమయంలో సన్‌రూఫ్ కొంత ఓపెన్ అయి ఉండటం వల్ల నీరు లోపలికి వచ్చిందని నివేదించింది. అంతే కాకుండా జలపాతం కిందికి వెళ్లడం ప్రమాదమని, అది కొన్ని సందర్భాల్లో అనుకోని ప్రమాదాన్ని ఆహ్వానిస్తుందని చెప్పుకొచ్చింది. సాధారణంగా కంపెనీ కారులో ఇలాంటి సమస్యలు గతంలో ఎప్పుడూ వెలుగులోకి రాలేదని కూడా వెల్లడించింది. -
నిజం నిరూపించిన మహీంద్రా.. వాటర్ లీక్ వీడియోకి గట్టి రిప్లే
మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ మార్కెట్లో ప్రజలు ఎక్కువ నమ్మే బ్రాండ్. అయితే ఇటీవల వెలువడిన ఒక వీడియోలో మహీంద్రా స్కార్పియో-ఎన్ సన్‌రూఫ్ నుంచి జలపాతం నీరు రావడం పెద్ద వైరల్ అయింది. దీనికి సమాధానంగా కంపెనీ మరో వీడియో విడుదల చేసింది. గతంలో వెలువడిన వీడియోలో అరుణ్ పన్వర్ అనే యూట్యూబర్ తన మహీంద్రా స్కార్పియో-ఎన్ కారుని జలపాతం కిందకి తీసుకెళ్లినప్పుడు, నీరు సన్‌రూఫ్ నుంచి లోపలికి వచ్చాయని, దానికి సంబంధించిన వీడియో విడుదల చేసాడు. ఇది అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మహీంద్రా కంపెనీ అదే జలపాతం కిందికి మరో స్కార్పియో-ఎన్ తీసుకెళ్లి టెస్ట్ చేసింది. అయితే జలపాతం నీరు ఏమాత్రం లోపలికి రాలేదు. ఈ వీడియోను మొదటి వీడియోకి రీప్లేగా సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇందులో జలపాతం నీరు ఏ మాత్రం లోపలికి రాకుండా ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి మహీంద్రా తమ వాహనాలను పటిష్టంగా తయారు చేసి మార్కెట్లో విడుదల చేస్తుంది. అయితే కష్టమర్ కారు నుంచి ఎందుకు నీరు లోపలికి వచ్చింది అనేదానికి ఖచ్చితమైన సమాధానం తెలియదు. బాధితుడి కారులో ఏదైనా సమస్య ఉందా.. లేకుంటే పబ్లిసిటీ కోసం ఇలాంటిది ఏమైనా చేశాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. కంపెనీ ఉత్పత్తులలో ఏదైనా సమస్య తలెత్తితే తప్పకుండా దానికి పరిష్కారం పొందవచ్చు. అది మాత్రమే కాకుండా కంపెనీ అటువంటి సమస్యను గుర్తిస్తే రీకాల్ ప్రకటిస్తుంది. అలా కాకుండా వీడియోలు సోషల్ మీడియాలో వెల్లడైతే కస్టమర్లకు బ్రాండ్ మీద ఉన్న నమ్మకం పోతుంది. జలపాతం కింద డ్రైవింగ్ చేయడం అనేది చాలా ప్రమాదం, ఇది అనుకోని ప్రమాదాలకు దారి తీస్తుంది. జలపాతం కింది నుంచి డ్రైవింగ్ చేస్తే కారు బ్యాలెన్స్ తప్పే అవకాశం ఉండవచ్చు, లేదంటే పైనుంచి ఏదైనా కిందికి పడినప్పుడు కారులో ఉన్న ప్రయాణికులు నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. వాహన వినియోగదారులు తప్పకుండా ఇలాంటివి గుర్తుంచుకోవాలి. Just another day in the life of the All-New Scorpio-N. pic.twitter.com/MMDq4tqVSS — Mahindra Scorpio (@MahindraScorpio) March 4, 2023 -
మహీంద్రా స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ లీక్? షాకింగ్ వీడియో వైరల్
సాక్షి, ముంబై: మహీంద్రా పాపులర్ ఎస్‌యూవీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్లో హల్చల్ చూస్తోంది. గత ఏడాది లాంచ్ చేసిన స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ కారులో వాటర్ లీక్ అవుతున్న వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో 1 రోజు క్రితం పోస్ట్ అయిన ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 4.7 మిలియన్ల వ్యూస్‌ని సంపాదించింది. యూట్యూబర్ అరుణ్ పన్వార్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన మహీంద్రా స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ కారులో నీరు ఎలా లీక్ అయ్యిందో చూపించే వీడియోను షేర్ చేశారు. కొండల్లో ప్రయాణిస్తుండగా ఓ జలపాతం తనకు ఈ అనుభవం ఎదురైందని వీడియోలో చెప్పాడు. తన కారును జలపాతం కింద కడగాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ కారును పార్క్ చేసే ముందు డ్రైవర్ సన్‌రూఫ్‌ను మూసివేసినా కూడా సన్‌రూఫ్, స్పీకర్ల ద్వారా కారులోకి నీరు లీక్ అయిందని, కారు లోపల పాడైపోయిందని పేర్కొన్నాడు. వీడియోలో, రూఫ్-మౌంటెడ్ స్పీకర్లు, క్యాబిన్ ల్యాంప్ ద్వారా క్యాబిన్ లోపల నీరు పారుతూ ఉండగా, సన్‌రూఫ్ మూసి ఉందా లేదా అని రెండు సార్లు నిర్ధారించుకున్నట్టు కనిపిస్తోంది ఈవీడియోలో. (ఆర్ఆర్ఆర్ మేనియా: రామ్ చరణ్‌పై ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్!) అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. నా జీప్ మెరిడియన్ని చాలాసార్లు ఇలా కడిగాను కానీ ఇలా ఎపుడూ కాలేదని ఒకరు కమెంట్ చేయగా, అలాంటిదేమీ లేదు.. ఉద్దేశపూర్వకంగా అతగాడు సన్‌రూఫ్‌ను కొద్దిగా తెరిచి ఉంచాడని భావిస్తున్నానంటూ మరొకరు కామెంట్ చేయడం గమనార్హం. (బిజినెస్ క్లాస్ ప్యాసింజర్‌కి షాక్, ట్వీట్ వైరల్: ఎయిరిండియా స్పందన) అయితే కంటెంట్ కోసం అతను నిజంగానే అలా చేశాడా? అసలు ఏమైంది? సన్‌రూఫ్ ఎందుకు లీక్ అయ్యింది, సన్‌రూఫ్ లీక్ ప్రూఫ్‌గా ఉండే రబ్బరు సీల్ ఉందా లేదా అనేదానిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన టెక్నికల్ అంశాలపై మహీంద్ర అధికారికంగా స్పందించాల్సి ఉంది. (గుండె ఆగిపోయినంత పనైంది! నాకే ఎందుకిలా? గూగుల్ ఉద్యోగి భావోద్వేగం ) View this post on Instagram A post shared by Arun Panwar (@arunpanwarx) -
స్కార్పియో-ఎన్ను అలా వాడేసిన కేటుగాళ్లు: వైరల్ వీడియో
కోలకతా: కొట్టేసిన సొమ్మును అక్రమ రవాణాకోసం కేటుగాళ్లు కొత్త కొత్త మార్గాలతో పోలీసులను బురిడీ కొట్టించాలని చూసి భంగ పడుతూ ఉంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మహీంద్రా స్కార్పియో-ఎన్లో అక్రమ డబ్బును రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది వ్యక్తులను పశ్చిమ బెంగాల్ పోలీసులు పట్టుకున్నారు. బ్లాక్ కలర్ మహీంద్రా స్కార్పియో-ఎన్ వాహనంలో 98 లక్షల రూపాయల విలువైన దోపిడీ డబ్బును అక్రమంగా తరలించాలని పోలీసులకు చిక్కారు. నల్లటి పాలిథిన్ ప్యాకెట్లలో డబ్బును ప్యాక్ చేసి స్టెఫినీ టైర్లో దాచిన వైనాన్ని పోలీసులు చేధించారు. చెక్‌పోస్టు తనిఖీల్లో భాగంగా స్కార్పియో-ఎన్లో నగదు పట్టు బడింది. నమోదైన యూజర్‌తో పాటు ఎస్‌యూవీలో ఉన్న వారిపై నల్లధనం అక్రమ రవాణా, దోపిడీ కేసు నమోదు చేశారు. బ్లాక్ కలర్ స్కార్పియో-ఎన్ వాహనంలోని స్టెఫినీ టైర్లో దాచిన నగదు అంటూ ఒక యూ ట్యూబ్ (Raftaar 7811) వైరల్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. -
ఈ కార్లకు యమ క్రేజ్, ‘మరో రెండేళ్లైనా వెయిట్ చేస్తాం..అదే కారు కావాల్సిందే’
దేశంలో కార్ల వినియోగం రోజురోజుకీ పెరిగిపోతుంది. చిరు ఉద్యోగి నుంచి బడా వ్యాపార వేత్తల వరకు మార్కెట్లో విడుదలై, తమకు నచ్చిన డిజైన్, ఫీచర్లు ఉంటే చాలు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు కొనుగోలు దారులు లేక వెలవెబోయిన కార్ల షోరూంలు ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి. అందుకే కొనుగోలు దారుల డిమాండ్లకు అనుగుణంగా వాహన తయారీ సంస్థలు వెహికల్స్‌ను మ్యాన్సిఫ్యాక్చరింగ్ చేసి మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా స్కార్పియో మోడల్‌ను అప్ డేట్ చేస్తూ మహీంద్రా స్కార్పియో-ఎన్, మహీంద్రా ఎక్స్ యూవీ-700 లేటెస్ట్ వెర్షన్లను పరిచయం చేశాయి. అయితే పైన పేర్కొన్న మహీంద్రా వెహికల్ కార్లను బుక్ చేసుకుంటే సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిప్‌ల కొరత, సప్లయ్ చైన్‌లో అవరోధాలతో పాటు విపరీతమైన డిమాండ్ నెలకొంది. దీంతో మహీంద్రా ఎక్స్‌యూవీ700, మహీంద్రా స్కార్పియో-ఎన్ వెయిటింగ్ పీరియడ్ 18- 20 నెలల మధ్య ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. బుకింగ్‌లో రికార్డులు నవంబర్ 2022 నాటికి మహీంద్రా ఎక్స్‌యూవీ 700, మహీంద్రా స్కార్పియో-ఎన్ల కోసం నెలకు 8,000-9,000 బుకింగ్‌లు అవుతండగా.. ఈ నెలలో 2.60 లక్షల కంటే ఎక్కువ ఓపెనింగ్ బుకింగ్స్ ఉన్నాయి. వీటిలో ఈ రెండు ఎస్‌యూవీల బుకింగ్స్ 1.30 లక్షలుగా ఉన్నాయి. మహీంద్రా స్కార్పియో-ఎన్ (క్లాసిక్‌తో సహా) 1,30,000 మొత్తం ఓపెన్ బుకింగ్‌లతో అగ్రస్థానంలో ఉంది. కొత్త మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో వస్తున్న ఈ కారు ప్రారంభ ధర రూ. 15.45 లక్షలుగా ఉంది. చదవండి👉 'టెన్షన్ వద్దు..నేను ఏదో ఒకటి చేస్తాలే' ఆనంద్ మహీంద్రా రీ ట్వీట్ వైరల్! -
ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు!
భారత ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా కంపెనీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇటీవల మహీంద్రా ఎక్స్యువి 700 లాంచ్ చేసిన నిమిషాల్లోనే రికార్డు బుకింగ్స్ సొంతం చేసుకోవడమే అందుకు ఉదాహరణ. ప్రస్తుతం ట్రెండ్‌కి అనుగుణంగా మహీంద్రా ఎలక్ట్రిక్ వాహన రంగంలోనూ దూసుకెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను తీసుకువస్తోంది. ఈ సంస్థ నుంచి మార్కెట్లోకి విడుదలయ్యే కార్ల క్రేజ్ గురించి కూడా చెప్పక్కర్లేదు. అందుకే అధిక కస్టమర్లు మహీంద్రా వాహనాల వైపే మొగ్గు చూపుతుంటారు. నేపథ్యంలో స్కార్పియో, XUV700 వంటి కొన్ని మోడళ్లపై 24 నెలలకు పైగా వేచి చూడాల్సిన పరిస్థతి ఏర్పడింది. అయినా వీటికి డిమాండ్ మాత్రం తగ్గడం లేదట. కాగా కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చిన కొత్త కొత్త మోడళ్లు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మహీంద్రా స్కార్పియో ఎన్ ఇటీవల విడుదల చేసిన మహీంద్రా స్కార్పియో N దాని ప్రీమియం, ఫీచర్-రిచ్ ప్యాకేజీతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. SUVలోని Z8, Z6 వేరియంట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఎంతలా అంటే కస్టమర్లు ఈ వాహనం కావాలంటే 24 నెలల వరకు వేచి చూడాల్సి వస్తోంది. మరోవైపు Z8L దాదాపు 20 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఇతర వేరియంట్లు మార్కెట్లో తక్కువ వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉన్నాయి. మహీంద్రా XUV700 మహీంద్రా XUV700కి కూడా మార్కెట్లో డిమాండ్ నడుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ కారు అమ్మకాలలో దూసుకుపోతోంది. ఈ SUV మీద ప్రస్తుతం కస్టమర్లు ఎంచుకునే వేరియంట్‌పై ఆధారపడి 18 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ కలిగి ఉంది. అయితే పెట్రోల్ వెర్షన్లతో పోల్చినప్పుడు డీజిల్ మోడల్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. స్కార్పియో, ఎక్స్‌యూవీ 700 వంటి మోడళ్లకు ఏకంగా 2 సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఈ రెండు కార్లు భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది కేవలం ఎంపిక చేసిన వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుందని గుర్తించుకోవాలి. చదవండి: ఐఫోన్ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. భారీ డిస్కౌంట్లతో ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్! -
మహీంద్రా స్కార్పియో-N ఆటోమేటిక్: ధరలు ఎలా ఉన్నాయంటే..!
Mahindra Scorpio N Price, సాక్షి,ముంబై: మహీంద్ర లేటెస్ట్ మిడ్ సైజ్ వెహికల్ 2022 మహీంద్రా స్కార్పియో-N ధరలను కంపెనీ ప్రకటించింది. లాంచ్ అయిన నెల తరువాత ఆల్-న్యూ మహీంద్రా స్కార్పియో-N ఆటోమేటిక్ వేరియంట్లు, టాప్-స్పెక్ 4X4 ట్రిమ్ వేరియంట్ల ధరలు తాజాగా బహిర్గత మైనాయి. వేరియంట్ వారీగా ఈ కారు ధరలు రూ. 11.99 లక్షల నుండి రూ. 23.90 లక్షల (ఎక్స్-షోరూం) వరకు ఉండనున్నాయి. బుకింగ్‌లు ఆన్లైన్లో, ఏకకాలంలో మహీంద్రా డీలర్‌షిప్‌లలో జూలై 30, ఉదయం 11 గంటల నుండి ప్రారంభం. బుకింగ్‌లు 'ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్' ప్రాతిపదికన, కస్టమర్ ఎంచుకున్న వేరియంట్‌ను బట్టి డెలివరీ తేదీ ఆధారపడి ఉంటుంది.సెప్టెంబరు 26న ప్రారంభమయ్యే రాబోయే పండుగ సీజన్లో డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 15 అర్ధరాత్రి వరకు బుక్ చేసుకున్న వారికి మాత్రమే బుకింగ్ ఎడిట్ చేసుకునే చాన్స్ ఉంటుంది. మాన్యువల్ ట్రిమ్ తో పోలిస్తే Z4 నుండి Z8 L వరకు ప్రతి ఆటోమేటిక్ ట్రిమ్ ధర 1.96 లక్షలు అదనం. అంతేకాదు ప్రారంభ ధరలు మొదటి 25,000 బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తాయని మహీంద్రా తెలియజేసింది. 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ మహీంద్రా స్కార్పియో-ఎన్ గత నెలలో ఇండియాలో లాంచ్ అయింది. దీని ప్రారంభ ధర రూ. 11.99 లక్షల ఎక్స్-షోరూమ్ వద్ద ప్రారంభించగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 23.90 లక్షలుగా ఉంటుంది. ఐదు ట్రిమ్స్‌లో లభ్యం. Z2, Z4, Z6, Z8 & Z8 L, అనే వేరియంట్లలో పెట్రోలు, డీజిల్ వెర్షన్లో అందుబాటులో ఉన్నాయి. 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్: వేరియంట్ వారీగా ధరలు (ఎక్స్-షోరూమ్) Z2 రూ.11.99 లక్షలు నుంచి రూ.12.49 లక్షలు Z4 ధరలు: రూ.13.49 లక్షలు, రూ.15.45 లక్షలు, రూ.13.99 లక్షలు, రూ.16.44 లక్షలు రూ.15.95 లక్షలు, రూ.18.40 లక్షలు Z6 ధరల: రూ.14.99 లక్షలు , రూ.16.95 లక్షలు Z8 ధరలు: రూ.16.99 లక్షలు, 18.95 లక్షలు, 17.49 లక్షలు, 19.94 లక్షలు, రూ19.45 లక్షలు రూ.21.90 లక్షలు Z8 L ధర : రూ.18.99 లక్షలు, రూ.20.95 లక్షలు, రూ.19.49 లక్షలు, రూ.21.94 లక్షలు రూ.21.45 లక్షలు, రూ. 23.90 లక్షలు -
వారెవ్వా ! అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త స్కార్పియో ఎన్
మహీంద్రా ఆటోమొబైల్స్ గ్రూపు దశాదిశను మార్చేసిన స్కార్పియో ఇప్పుడు కొత్త రూపులో మన ముందుకు వచ్చేసింది. ఇండియాలో స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ యూసేజ్‌కి కొత్త అర్థం చెప్పిన స్కార్పియో ఇప్పుటి ట్రెండ్‌కి తగ్గట్టుగా అప్డేట్ అయ్యింది. స్కార్పియో ఎన్ సిరీస్‌కి సంబంధించిన విశేషాలను మహీంద్రా గ్రూపు ప్రకటించింది. సరికొత్త స్కార్పియో ఎన్ సిరీస్ మొత్తం ఐదు వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఈ వేరియంట్లను జెడ్ 2, జెడ్ 4, జెడ్ 6, జెడ్ 8, జెడ్ 8 లగ్జరీలుగా మహీంద్రా పేర్కొంది. కొత్త స్కార్పియో మోడల్ మార్కెట్లోకి వస్తుండటంతో ఇప్పటి వరకు ఉన్న మోడల్‌ను ఇకపై స్కార్పియో క్లాసిక్‌గా వ్యవహరించనున్నారు. ఫస్ట్ ఇన్ ఇండియా ఇండియన్ ఎస్యూవీ మార్కెట్ సెగ్మెంట్లో ఉన్న మహీంద్రా థార్, టాటా సఫారీ, ఎంజీ హెక్టార్లకు పోటీగా మహీంద్రా ఎన్ సిరీస్ స్కార్పియోను మార్కెట్లోకి తెస్తోంది. బాడీ ఆన్ ఫ్రేమ్‌లో విభాగంలో దేశంలో ఇదే మొదటి వాహనంగా భావిస్తున్నారు. కీలక ఫీచర్లు - 4,662 మిల్లీ మీటర్ల పొడవు , 1917 మిల్లీ మీటర్ల వెడల్పు , 1870 మిల్లీ మీటర్ల ఎత్తు - మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ - 4 క్రాస్ 4 వీల్ డ్రైవ్ - 8 స్క్రీన్ టచ్ స్క్రీన్ ఇన్ఫోంటైన్మెంట్, 3డీ సౌండ్ సిస్టమ్ - బిల్ట్ ఇన్ అలెక్సా, వైర్లెస్ ఛార్జర్ - ఎలక్ట్రానిక్ సన్‌రూఫ్ - 6 ఎయిర్ బ్యాగ్స్, డ్రైవర్ అలెర్ట్ సిస్టమ్ ధర ఎంతంటే స్కార్పియో ఎన్ సిరీస్ కనీస ధర రూ.11.99 లక్షలు ఉండగా గరిష్ట ధర రూ.19.49 లక్షలుగా ఉంది. ఈ కారు అడ్వాన్స్ బుకింగ్ జులై 30 నుంచి మొదలు కానుంది. A legend will be reborn tomorrow… (1/2) pic.twitter.com/H8OU9FUoAU — anand mahindra (@anandmahindra) June 26, 2022 చదవండి: మారుతి ఆల్టో: స్పార్క్ లుక్, రెట్రో డిజైన్, ధర ఎంతంటే? -
మహీంద్రా స్కార్పియో ఎన్.. ఆహా! అనిపించే ఫీచర్లు..
మహీంద్రా ఆటోమొబైల్స్ దశ దిశను మార్చి వేసిన మోడళ్లలో స్కార్పియో ఒకటి. రెండు దశాబ్ధాలు దాటినా ఇప్పటికీ మహీంద్రా క్రేజ్ ఇంచైనా తగ్గలేదు. స్కార్పియో తర్వాత అనేక ఎస్‌యూవీలు మార్కెట్‌కి పోటెత్తినా స్కార్పియో మార్కెట్ చెక్కుచెదరలేదు. ఇప్పటికీ స్కార్పియో కోసం ఎదురు చూసే అభిమానులు ఉన్నారు. వీరందరి కోసం స్కార్పియోకి అదనపు హంగులు జోడించి ఎన్ సిరీస్‌లో రిలీజ్ చేసేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా రెడీ అయ్యింది. ఫీచర్లు - పాపులర్ ఎస్యూవీ మహీంద్రా స్పార్పియో ఎన్ మోడల్లో అన్ని వేరియంట్లు 4X4 వీల్ డ్రైవ్‌లో వస్తున్నాయి. దీంతో ఇవి ఆన్‌రోడ్‌తో పాటు ఆఫ్‌రోడ్ డ్రైవింగ్‌లో కూడా దుమ్ము రేపనున్నాయి - స్కార్పియో ఎన్లో కూడా మహీంద్రా కొత్త లోగోనే ఉంటుంది. ఎక్స్‌యూవీ ఓఓ7 తర్వాత కొత్త లోగోతో వస్తున్న మోడల్ స్కార్పియో ఎన్ - స్పోర్టీ లుక్ కోసం డ్యూయల్ ఎల్ఈడీ ప్రొజెక్టన్ లైటింగ్ ఇచ్చారు - డైనమిక్ టర్న్ ఇండికేటర్ వ్యవస్థను పొందు పరిచారు - డ్యాష్‌బోర్డు మధ్యలో ఇన్ఫోంటైన్మెంట్లో భాగంగా లార్జ్ టచ్ స్క్రీన్ - డిజిటల్ డ్రైవర్స్ డిస్ప్లే - మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ - సన్‌రూఫ్ - ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ చదవండి: యుటిలిటీ వాహనాలకు డిమాండ్ -
అది చెప్తే.. నా ఉద్యోగం ఊడుతుంది: ఆనంద్ మహీంద్రా
Anand Mahindra Funny Tweet Reply: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.. సోషల్ మీడియాలో ఫ్రెండ్లీ ఇంటెరాక్టర్ కూడా. ఎవరేం అడిగినా.. చాలా ఓపికగా సమాధానం చెప్తుంటాడాయన. ఈ క్రమంలో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు.. మాత్రం సమాధానం ఇవ్వలేకపోయాడు. కానీ, ఫన్నీగా మాత్రం ఓ బదులు ఇచ్చారు ఆయన. ఐఎన్‌సీ ప్రాజెక్టు మేకర్స్ అనే ట్విటర్ అకౌంట్ నుంచి.. ‘‘సర్.. స్కారిపియో ఎప్పుడు లాంఛ్ అవుతుంది? మేం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం.. తేదీ ఎప్పటి నుంచో చెప్పండి’’ అంటూ ఆనంద్ మహీంద్రాకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. Sir please tell me on which date the Scorpio is going to launch because we are waiting for it — Inc project makers (@Incprojectmake1) May 5, 2022 దీనికి ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. ‘‘ష్.. ఒకవేళ అది చెప్తే.. నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు. కానీ, ఒక్క విషయం మాత్రం చెప్పగలను. నేను కూడా మీలాగే ఆత్రుతతో ఉన్నా’’ అంటూ బదులిచ్చారాయన. Sshhhh. If I tell you, I’ll be fired… But I can say this much..I’m as excited as you are… https://t.co/6EnseHYZDE — anand mahindra (@anandmahindra) May 6, 2022 సమాధానం అందుకున్న వ్యక్తి సంతోషంగా ఉన్నాడో లేదో తెలియదుగానీ.. ఆనంద్ మహీంద్రా చేసిన ఈ సరదా ట్వీట్‌ను మాత్రం పలువురు నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మీ కంపెనీ నుంచి మిమ్మల్ని ఎవరు సార్ తీసేది అంటూ ఫన్నీ రిప్లయ్‌లు ఇస్తున్నారు. అఫ్కోర్స్.. ట్విటర్లో ఆయన ఫాలోయింగ్ ఎక్కువగా ఉండడానికి ఇలాంటి టైమింగ్ కూడా ఒక కారణం కాబోలు! You are the King of Mahindra residing in heart of every Indian,who will fire you? — Agrawal Rishi (@AgrawalRishi1) May 6, 2022 Who will fire your sir, you yourself..??? pic.twitter.com/f4lD2TmXMj — R.V (@R_Vatsh) May 6, 2022 ఇదిలా ఉండగా.. కంపెనీ కొత్త స్కార్పియో విషయంలో ఎలాంటి తేదీని ప్రకటించలేదు. జూన్‌లో.. అదీ కంపెనీ 20వ వార్షికోత్సవం సందర్భంగా లాంఛ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చదవండి: నా స్కోర్ సున్నా.. అయినా గర్వంగా ఉంది -
అధి‘కార్’.. బేకార్
‘రాజుల సొమ్ము రాళ్లపాలు’ అన్నట్టు...ప్రభుత్వ వాహనాలు ‘తుప్పు’ పట్టిపోతున్నాయి. హోండా సిటీ.. కరోలా ఆల్టిస్.. మహీంద్రా స్కార్పియో..అలనాటి అంబాసిడర్లు.. ఆటోలు.. వ్యాన్లు ఇలా ఖరీదైన వాహనాలెన్నో సచివాలయంలో ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోయాయి. ఈ వాహనాలు ఎందుకువినియోగించడం లేదో తెలియడం లేదు. హోండా సిటీ.. కరోలా ఆల్టిస్.. మహీంద్రా స్కార్పియో.. ఇంకా అలనాటిరాజ వాహనం అంబాసిడర్లు.. ఆటోలు.. వ్యాన్లు ఎన్నో అక్కడ పడివున్నాయి. ఎవరికీ పట్టనట్టున్నాయి. దుమ్ము కొట్టుకుపోయి.. శిథిలమైపోయి, పాక్షికంగా పాడైపోయి, పార్టులు పీకేసి.. చెట్ల కింద.. గోడ పక్కనా కార్లే. ఎటుచూసినా కార్లే. పదో, ఇరవయ్యో కాదు.. సుమారు 200 కార్లు. ఈఎంఐలు కట్టలేక దుబాయ్ ఎయిర్‌పోర్టులో కార్లు వదిలేసినవి కావు. నగరం నడిబొడ్డునున్న సెక్రటేరియట్లో కనిపించే పరిస్థితి ఇది. ప్రతి కారుకు ‘గవర్నమెంట్ వాహనం’ అన్న బోర్డులు సైతం ఉన్నాయి. ఎవరికోసం కొనుగోలు చేశారో.. ఎంతకాలం వాడారోగాని ఇప్పుడు ఎవరికీ కాకుండావదిలేయడంతో తుప్పు పట్టిపోతున్నాయి. వేలం వేసినా ప్రభుత్వానికి ఎంతోఆదాయం సమకూరేది. కానీ ఎవరికీ పట్టనట్టు వదిలేశారు. – ఫొటోలు: ఎం. అనిల్‌కుమార్ -
స్కార్పియో కొత్తమోడల్ 25న విడుదల
ఎప్పటినుంచో అందరూ ఎదురుచూస్తున్న మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్ కొత్త ఎడిషన్ వచ్చేస్తోంది. శరన్నవరాత్రుల ప్రారంభం రోజైన సెప్టెంబర్ 25న దీన్ని విడుదల చేయనున్నారు. ఆటోమొబైల్ ప్రేమికులు ఇప్పటినుంచే ఈ వాహనానికి ప్రీబుకింగ్స్ చేసేస్తున్నారు. వాళ్లలో ఇప్పటికే స్కార్పియో వాహనం ఉన్నవాళ్లకు ముందు ప్రాధాన్యం ఇస్తామని డీలర్లు చెబుతున్నారు. భారతీయ ఎస్యూవీ మార్కెట్లో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న స్కార్పియో కొత్త మోడల్ ఉత్పాదన ఆగస్టు ఒకటోతేదీ నుంచి మొదలైంది. దీని లాంచింగ్ మొదలుపెట్టడానికి ముందే కనీసం 5వేల వాహనాలు సిద్ధం చేసుకోవాలని మహీంద్రా భావిస్తోంది. కొత్త మోడల్ స్కార్పియోలో.. ముందు లుక్ చాలా బాగుంటుందని కంపెనీ వర్గాలు అంటున్నాయి. దీంతోపాటు కొత్త హెడ్ ల్యాంపులు, ముందు బంపర్, గ్రిల్ కూడా రూపురేఖలు మారిపోతాయి. మామూలు బల్బులకు బదులు హెచ్ఐడీ/ప్రొజెక్టర్ హెడ్ ల్యాంపులు ఉండొచ్చు. అయితే పక్కనుంచి చూస్తే మాత్రం ఇది మామూలు స్కార్పియోలాగే ఉంటుంది. కొత్త స్కార్పియోకు అన్నీ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. కేబిన్‌లో చాలా మార్పులు ఉండబోతున్నాయి. దీని డాష్‌బోర్డు, కొత్త స్టీరింగ్ వీల్, రీ డిజైన్ చేసిన ఏసీ వెంట్లు.. వీటన్నింటితో సరికొత్త స్కార్పియో.. ఆటోమొబైల్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. అయితే ఇంజన్ పరంగా చూసుకుంటే మాత్రం పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు. 2.2 లీటర్ల ఎంహాక్ డీజిల్ ఇంజన్ ఉంటుందని చెబుతున్నారు.