మహీంద్రా ఆటోమొబైల్స్ దశ దిశను మార్చి వేసిన మోడళ్లలో స్కార్పియో ఒకటి. రెండు దశాబ్ధాలు దాటినా ఇప్పటికీ మహీంద్రా క్రేజ్ ఇంచైనా తగ్గలేదు. స్కార్పియో తర్వాత అనేక ఎస్‌యూవీలు మార్కెట్‌కి పోటెత్తినా స్కార్పియో మార్కెట్ చెక్కుచెదరలేదు. ఇప్పటికీ స్కార్పియో కోసం ఎదురు చూసే అభిమానులు ఉన్నారు. వీరందరి కోసం స్కార్పియోకి అదనపు హంగులు జోడించి ఎన్ సిరీస్‌లో రిలీజ్ చేసేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా రెడీ అయ్యింది.
ఫీచర్లు
- పాపులర్ ఎస్‌యూవీ మహీంద్రా స్పార్పియో ఎన్ మోడల్‌లో అన్ని వేరియంట్లు 4X4 వీల్ డ్రైవ్‌లో వస్తున్నాయి. దీంతో ఇవి ఆన్‌రోడ్‌తో పాటు ఆఫ్‌రోడ్ డ్రైవింగ్‌లో కూడా దుమ్ము రేపనున్నాయి
- స్కార్పియో ఎన్‌లో కూడా మహీంద్రా కొత్త లోగోనే ఉంటుంది. ఎక్స్‌యూవీ ఓఓ7 తర్వాత కొత్త లోగోతో వస్తున్న మోడల్ స్కార్పియో ఎన్
- స్పోర్టీ లుక్ కోసం డ్యూయల్ ఎల్‌ఈడీ ప్రొజెక్టన్ లైటింగ్ ఇచ్చారు
- డైనమిక్ టర్న్ ఇండికేటర్ వ్యవస్థను పొందు పరిచారు
- డ్యాష్‌బోర్డు మధ్యలో ఇన్ఫోంటైన్‌మెంట్‌లో భాగంగా లార్జ్ టచ్ స్క్రీన్
- డిజిటల్ డ్రైవర్స్ డిస్‌ప్లే
- మల్టీ ఫంక‌్షనల్ స్టీరింగ్
- సన్‌రూఫ్
- ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్
చదవండి: యుటిలిటీ వాహనాలకు డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment