ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అదిరిపోయే ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా లాక్ చాట్ (Lock Chat) అనే కొత్త ఫీచర్‌పై పనిచేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్ సాయంతో వాట్సాప్ చాట్‌లోని వ్యక్తిగత ఫోటోలు, వీడియాలు,చాట్‌లను వేరే వాళ్లు చూడకుండా లాక్ వేయొచ్చు.
వాట్సాప్ బీటా ఇన్‌ఫో ప్రకారం.. యూజర్లు ఒకసారి ఫింగర్ ప్రింట్, పాస్‌వర్డ్ సాయంతో లాక్ చాట్ ఆప్షన్ వినియోగిస్తే సదరు చాట్‌ను వేరే వాళ్లు చూడడం, లేదంటే చోరి చేసే వీలుండదు. అంతేకాదు లాక్ చాట్‌లో ఉన్న వీడియోలు, ఫోటోలు సైతం ఫోన్ గ్యాలరీలు సేవ్ కావు. ఒకవేళ ఎవరైనా మీ అనుమతి లేకుండా ఫోన్ తీసుకుని పాస్‌వర్డ్, ఫింగర్ ప్రింట్ లేకుండా లాక్ చాట్ తెరవడానికి ప్రయత్నిస్తే.. ఆ చాట్ మొత్తం డిలీట్ చేయాలని కోరుతుంది.
అలా ఇతరులు వాట్సాప్ చాట్‌ను చూడకుండా లాక్ చాట్ అదనపు ప్రొటెక్షన్ లేయర్‌గా పనిచేస్తుందని వాట్సాప్ బీటా ఇన్‌ఫో నివేదిక తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ది దశలోనే ఉండగా..దీన్ని అధికారికంగా యూజర్లకు ఎప్పుడు అందిస్తారనే సంగతి తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment